Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UP Govt to Distribute Free Smartphones, Tablets to One Crore Final Year Students

 

UP Govt to Distribute Free Smartphones, Tablets to One Crore Final Year Students

కోటి మంది విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు - తొలి దశ డిసెంబర్‌ 25న లక్ష యూనిట్ల పంపిణీ – యూపీ ముఖ్యమంత్రి ప్రకటన

మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రంలో కోటిమంది ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయీ జయంతి రోజున (డిసెంబర్‌ 25న) వీటి పంపిణీ తొలి దశను ప్రారంభించనున్నారు. ఆ రోజు లక్ష స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లను లఖ్‌నవూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్టు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

ఎవరెవరికి ఇస్తారు?

రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థినులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోజున 60వేల స్మార్ట్‌ఫోన్లు, 40వేల ట్యాబ్‌లను యువతకు పంపిణీ చేస్తారని తెలిపారు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా వీటిని పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎంఏ, బీఏ, బీఎస్సీ, ఐటీఐ, ఎంబీబీఎస్‌, బీటెక్‌, ఎంటెక్‌ తదితర కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు స్పష్టంచేశారు.

తొలి విడత పంపిణీకి ₹2035 కోట్లు

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌ల పంపిణీపై యూపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి కుమార్‌ వినీత్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే 38లక్షల మందికి పైగా విద్యార్థులు డీజీ శక్తి పోర్టల్‌లో నమోదు చేయించుకున్నారని తెలిపారు. తదుపరి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఈ ఎలక్ట్రానిక్‌ పరికరాల కోసం లావా, శామ్‌సంగ్‌, ఏసర్‌ కంపెనీలకు ప్రభుత్వం నుంచి ఆర్డర్లు చేశామని తెలిపారు. ఆయా కంపెనీలు డిసెంబర్‌ 24కు ముందే  సమకూరుస్తాయన్నారు. తొలి విడతలో పంపిణీ చేయబోయే పరికరాల కోసం రూ.2035 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. మొత్తంగా 10.50లక్షల స్మార్ట్‌ఫోన్లను ఒక్కోటి ₹10,740ల చొప్పున, అలాగే, 7.20లక్షల ట్యాబ్‌లను ₹12,606 చొప్పున కొనుగోలు చేసినట్టు వివరించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags