Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DRDO Scholarship Scheme for Girls 2022 – Details Here

 

DRDO Scholarship Scheme for Girls 2022 – Details Here

డిగ్రీ స్థాయిలో ఏడాదికి రూ.1,20,000

పీజీ స్థాయిలో ఏడాదికి రూ.1,86,000

డీఆర్‌డీఓ (డిఫెన్స్‌ ఆర్‌ అండ్‌ డిఆర్గనైజేషన్‌) స్కాలర్‌షిప్‌: ఆర్థిక సమస్యల కారణంగా ఇంజినీరింగ్‌ చదవలేని విద్యార్థినులకు DRDO చేయూతను అందిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

ఎవరు అర్హులు:

ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌/ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌/ స్పేస్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రాకెటరీ/ ఏవియానిక్స్‌/ ఏర్‌క్రాఫ్ట్‌ ఇంజినీరింగ్‌ చదువుతోన్న డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థినులు స్కాలర్‌షిప్‌ పొందడానికి అర్హులు. డ్యూయల్‌ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌లు

డిగ్రీ: డిగ్రీ స్థాయిలో 20 స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి. భారతీయ విద్యార్థినులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ (మెయిన్‌)లో మేలైన స్కోర్‌ సాధించి ఉండాలి. ఏడాదికి రూ.1,20,000 చొప్పున నాలుగేళ్లకు స్కాలర్‌షిప్‌ ఇస్తారు. లేదా వార్షికఫీజు.. ఏది తక్కువగా ఉంటే అది చెల్లిస్తారు.

పీజీ: పీజీ స్థాయిలో 10 స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి. భారతీయ విద్యార్థినులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంఈ/ఎంటెక్‌/ఎంఎస్సీ ఇంజినీరింగ్‌ చదువుతున్నవారై ఉండాలి. బీఈ/బీటెక్‌/బి.ఇంజినీరింగ్‌ డిగ్రీలో 60 శాతం మార్కులు పొంది ఉండాలి. గేట్‌లో మేలైన స్కోర్‌ సాధించాలి. ఏడాదికి రూ.1,86,000 స్కాలర్‌షిప్‌ను రెండేళ్ల కాలానికి చెల్లిస్తారు. లేదా నెలకు రూ.15,500 చొప్పున చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతోపాటు ఇటీవలి పాస్‌పోర్ట్‌ సైజ్‌ కలర్‌ఫొటో, ఆధార్‌, ప్రూఫ్‌ ఆఫ్‌ అడ్మిషన్‌, ఫీజు వివరాలు... మొదలైనవి అప్‌లోడ్‌ చేయాలి. పూర్తి వివరాలతో నింపకపోయినా, సంబంధిత పత్రాలను జతపరచకపోయినా దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎలాంటి కరస్పాండెన్స్‌కూ అవకాశం ఉండదు. స్కాలర్‌షిప్‌ల మంజూరుకు సంబంధించి ఏ దశలోనూ ఎలాంటి ఫీజూ చెల్లించనవసరం లేదు. ప్రతిభ ఆధారంగానే అర్హులైన విద్యార్థినులను ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరి తేది: 31.03.2022

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags