Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Permission for 30,453 Jobs – Department wise GOs Released

 

TS: Permission for 30,453 Jobs – Department wise GOs Released

తెలంగాణలో 30,453 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి - శాఖల వారీగా పోస్టులు మరియు జి.ఓ ల వివరాలు ఇవే

తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి ప్రకటించిన 80,039 ఉద్యోగాలకు గాను తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ప్రక్రియకు సంబంధించి నియామక సంస్థలకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

గ్రూప్‌-1లో 503 పోస్టుల భర్తీకి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  టీఎస్‌పీఎస్సీ తదుపరి ప్రక్రియను కొనసాగించనుంది. పోలీసు నియామక సంస్థ ద్వారా జైళ్లశాఖలో 154 పోస్టులు, పోలీసు శాఖలో 16,587 పోస్టులు భర్తీ చేయనున్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా జైళ్లశాఖలో 31 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, వైద్యారోగ్యశాఖలో 2,662 పోస్టులు, డిప్యూటీ కలెక్టర్‌- 42, డీఎస్పీలు-91, ఎంపీడీవో-121, వైద్యారోగ్యశాఖ పాలనాధికారి -20, వాణిజ్య పన్నులశాఖలో 48, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ -38, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌-40 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఆర్థికశాఖ విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగా టెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆయా శాఖల మంత్రులు, అధికారులతో ఆర్థికశాఖమంత్రి హరీశ్‌రావు చర్చించి మిగతా ఉద్యోగాలకు అనుమతి ఇవ్వనున్నారు.

పోస్టుల వివరాలు..

జైళ్ల శాఖలో 154 పోస్టుల ఖాళీలను పోలీసు నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిలో డిప్యూటీ జైలర్‌ 8, వార్డర్‌ 136, మహిళా వార్డర్‌ 10 పోస్టులు ఉన్నాయి. పబ్లిక్‌ కమిషన్‌ ద్వారా జైళ్ల శాఖలో 31 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోలీసు నియామక బోర్డు ద్వారా హోంశాఖలో 16,587 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో సివిల్‌ కానిస్టేబుల్‌ 4,965, ఏఆర్‌ కానిస్టేబుల్‌ 4,423, టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్‌ 5,704, ఏఎస్‌ఐ(ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో) 8, ఏఆర్‌ ఎస్సై 69, పీటీవో డ్రైవర్‌ 100, పీటీవో మెకానిక్‌ 21, సీపీఎల్‌ ఎస్సై 5, సీపీఎల్‌ కానిస్టేబుల్‌ 100, సివిల్‌ ఎస్సై 415, టీఎస్‌ఎస్పీ ఎస్సై 23, ఐటీ అండ్‌ సీ ఎస్సై 23, ఐటీ అండ్‌ సీ కానిస్టేబుల్‌ 262, ఎఫ్‌ఎస్‌ఎల్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ 14, ఎఫ్‌ఎస్‌ఎల్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ 32, ఎఫ్‌ఎస్‌ఎల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ 17, ఎఫ్‌ఎస్‌ఎల్‌ ల్యాబ్‌ అటెండెంట్‌ 1, ఎస్‌పీఎఫ్‌ ఎస్సై 12, ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ 390, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్‌ పోస్టులు 63 ఉన్నాయి. పోలీస్‌ విభాగంలో 227 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. పోలీసు విభాగంలో 2 సీనియర్‌ రిపోర్టర్‌ ఇంటెలిజెన్స్‌, ఎస్పీఎఫ్‌ విభాగంలో 2 జూనియర్‌ అసిస్టెంట్‌, రవాణా శాఖలో 113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌, రవాణా శాఖలో 36 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.  

వైద్యారోగశాఖలో..

వైద్యారోగ్య సేవల నియామక బోర్డు ద్వారా 10,028 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. వీటిలో ఎంపీహెచ్‌ఏ(మహిళలు) 1520, వైద్య విద్య టూటర్‌ 357, వైద్య విద్య అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 1,183, వైద్య విద్య స్టాఫ్‌నర్స్‌ 3,823, ప్రజారోగ్య సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ 751, ఐపీఎం సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ 7, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి స్టాఫ్‌ నర్సు 81, వైద్య విధాన పరిషత్‌ సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ 1,284 , వైద్య విధాన పరిషత్‌ ఏఎన్‌ఎం 265, వైద్య విధాన పరిషత్‌ స్టాఫ్‌ నర్సు 757, నిమ్స్‌లో 45 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఉన్నాయి. ఇక వైద్యారోగ్య శాఖాపరమైన కమిటీ ద్వారా 45 పోస్టులను భర్తీ చేయనున్నారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా వైద్యారోగ్యశాఖలో 2,662 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయుర్వేద, యోగ, యునాని, హోమియోపతిలో 689 పోస్టులు ఉన్నాయి. వైద్య విద్యలో 1,118 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. వైద్య విద్యలో టెక్నీషియన్లు, జూనియర్‌ అసిస్టెంట్‌, ఫిజియోథెరపిస్ట్‌, ఇతర పోస్టులు ఉన్నాయి. ప్రజారోగ్య విభాగంలో 357, ఐపీఎంలో 56 పోస్టులు, ఔషధ నియంత్రంణ విభాగంలో 33, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీలో 13, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో 68, వైద్య విధాన పరిషత్‌లో 36 డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు సహా 301, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 7 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

గ్రూప్‌-1 లో..

టీఎస్‌పీఎస్సీ ద్వారా 503 గ్రూప్‌-1 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. వీటిలో డిప్యూటీ కలెక్టర్‌లు 42, డీఎస్పీలు 91, జైళ్లశాఖ డీఎస్పీలు 2, అసిస్టెంట్‌ ఆడిట్‌ అధికారి 40, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ 38, బీసీ అభివృద్ధి అధికారి 5, మైనార్జీ సంక్షేమాధికారి 6, వైద్యారోగ్యశాఖ పాలనాధికారి 20, పంచాయతీ అధికారి 5, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌(2) 35, ఎంపీడీవోలు 121, వాణిజ్య పన్నుల శాఖ అధికారి 48, ప్రాంతీయ రవాణాధికారి 4, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ 26, రిజిస్ట్రేషన్‌ శాఖ జిల్లా రిజిస్ట్రార్‌ 5, సాంఘిక సంక్షేమ అధికారి 3, గిరిజన సంక్షేమ అధికారి 2 పోస్టులు ఉన్నాయి.

CLICK THE BELOW LINKKS FOR DEPARTMENT WISE G.Os 👇👇👇

G.O.Ms No.26_Group-1

G.O.Ms No.27_Home_TSLPRB

G.O.Ms No.28_Home_TSPSC

G.O.Ms No.30_Prisons_TSLPRB

G.O.Ms No.31_Prisons_TSPSC

G.O.Ms No.32_Transport_TSLPRB

G.O.Ms No.33_Transport_TSPSC

G.O.Ms No.34_HM&FW_HMSRB

G.O.Ms No.35_HM&FW_TSPSC

G.O.Ms No.36_HM&FW_NIMS

Previous
Next Post »
0 Komentar

Google Tags