Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

58-Year-Old Odisha MLA takes Matriculation Exam

 

58-Year-Old Odisha MLA takes Matriculation Exam

58 ఏళ్ల వయసులో పదో తరగతి పరీక్ష రాసిన ఎమ్మెల్యే

వయసుతో చదువుకు సంబంధం లేదని నిరూపించారు ఓ ఎమ్మెల్యే. 58వ ఏట పదో తరగతి పరీక్షలు రాసి.. తన దీర్ఘకాల కలను నెరవేర్చుకున్నారు. ఒడిశాలోని ఫుల్బానీకి చెందిన బిజూ జనతా దళ్ (BJD) శాసనసభ్యుడు అంగద కన్హర్ శుక్రవారం పదో తరగతి పరీక్ష రాశారు. 1980లోనే కన్హర్ తన చదువు ఆపేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో రాణించినప్పటికీ.. పదో తరగతి పూర్తి చేయాలని ఎప్పుడూ భావించేవారు. ఈ క్రమంలోనే బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(బీఎస్ఈ) నిర్వహిస్తోన్న హైస్కూల్ వార్షిక పరీక్షలకు శుక్రవారం హాజరయ్యారు. కంధమాల్ జిల్లా పితాబరి గ్రామంలోని రుజంగీ ఉన్నత పాఠశాలలో 67 మంది విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే పదో తరగతి పరీక్ష రాశారు.

కుటుంబ సమస్యల కారణంగా పాఠశాల వయసులో పదో తరగతి పరీక్షకు హాజరు కాలేకపోయాను. 1980లోనే నా చదువును ఆపేయాల్సి వచ్చింది. కానీ ఏళ్లు గడిచేకొద్దీ.. నాతోటి వారు, నా కంటే పెద్దవారు ఎంతో కష్టపడి చదువులు పూర్తిచేశారని కథలుకథలుగా విన్నాను. సంకల్పం ఉంటే.. చదువును ఏ వయసులోనైనా పూర్తి చేయొచ్చని గుర్తించా. పరీక్షకు హాజరై నా చదువు పూర్తిచేయాలనేది నా కోరిక. కానీ అందుకు కాస్త భయపడ్డా. కానీ నా కుటుంబసభ్యులు, స్నేహితులు, గ్రామ ప్రజలు, అందరూ నన్ను ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతోనే ఈ పరీక్ష రాయగలిగా’ అని పరీక్ష అనంతరం ఎమ్మెల్యే పేర్కొన్నారు.

OFFICIAL PROFILE

Previous
Next Post »
0 Komentar

Google Tags