Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jio New Prepaid Plans: New Recharge Plans with 3 Months Free Disney+ Hotstar Mobile Subscription

 

Jio New Prepaid Plans: New Recharge Plans with 3 Months Free Disney+ Hotstar Mobile Subscription

డిస్నీ+ హాట్‌స్టార్‌తో జియో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లు - రూ. 151 ప్లాన్ తోనూ 3 నెలల డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్ స్కిప్షన్

డిస్నీ + హాట్ స్టార్ తో కూడిన నాలుగు ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్లను రిలయన్స్ జియో ప్రవేశపెట్టింది. ఐపీఎల్ లక్ష్యంతో వీటిని తీసుకొచ్చినప్పటికీ.. సాధారణంగా కూడా ఇవి యూజర్లకు మంచి ప్రయోజనాలను కల్పిస్తున్నాయి.

మూడు నెలల కాలపరిమితి కలిగిన వీటి ధరలు రూ. 151, రూ. 333, రూ.583, రూ. 783గా ఉన్నాయి.

రూ. 151 ప్లాన్: ఇది పూర్తిగా డేటా ప్లాన్. ఇది పనిచేయాలంటే కచ్చితంగా బేస్ ప్లాన్ ఉండాల్సిందే. దీంట్లో మొత్తం 8 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రూ.149 విలువ కలిగిన డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబిస్కిప్షన్ ఉంటుంది. దీని వ్యాలిడిటీ 90 రోజులు. 8 జీబీ డేటా వినియోగం తర్వాత వేగం 64 కేబీపీఎసకు తగ్గుతుంది.

రూ.333 ప్లాన్: దీని కాలపరిమితి 28 రోజులు. రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకి 100 ఎస్ఎంఎస్లు ఉండనే ఉంటాయి. మూడు నెలల కాలపరిమితితో డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబిస్కిప్షన్ ఉంటుంది. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీజియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా అందుతాయి.

రూ.583 ప్లాన్: రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది. వ్యాలిడిటీ 56 రోజులు. మొత్తంగా 84 జీబీ డేటా పొందవచ్చు. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకి 100 ఎస్ఎంఎస్లు వస్తాయి. దీంట్లో కూడా మూడు నెలల కాలపరిమితితో కూడిన డిస్నీ+ హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ అదనపు ప్రయోజనాలు.

రూ. 783 ప్లాన్: దీంట్లో ప్రయోజనాలు రూ. 583 ప్లాన్ తరహాలోనే ఉంటాయి. కానీ, కాలపరిమితి మాత్రం 84 రోజులు. డిస్నీ + హాట్ స్టార్ ను మూడు నెలలు ఎంజాయ్ చేయొచ్చు.

WEBSITE

JIO APP

Previous
Next Post »
0 Komentar

Google Tags