Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TVS NTorq 125 XT Launched at Rs 1.03 lakh: Tech-Savvy Scooter

 

TVS NTorq 125 XT Launched at Rs 1.03 lakh: Tech-Savvy Scooter

స్మార్ట్‌ ఫీచర్లతో TVS కొత్త ఎన్‌టార్క్‌ - పూర్తి స్థాయి టెక్‌ అడ్వాన్స్‌ ఫీచర్లతో NTORQ 125 XT

ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టీవీఎస్‌  తన విజయవంతమైన ఎన్‌టార్క్‌ శ్రేణిలో మరో కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది. NTORQ 125 XT పేరిట కొత్త స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధరను రూ.1.03 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌)గా నిర్ణయించారు. ఈ స్కూటర్‌ను పూర్తి స్థాయి టెక్‌ అడ్వాన్స్‌ ఫీచర్లతో రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. 

NTorq 125 చాలా కాలం నుంచి టీవీఎస్‌ స్మార్ట్‌ కనెక్ట్‌ బ్లూటూత్‌ వ్యవస్థ ఉంది. కొత్త వేరియంట్‌లో బ్లూటూత్‌తో పాటు వాయిస్‌ అసిస్టెంట్‌ సదుపాయాన్ని కూడా ఇస్తున్నారు. కొత్త ఎన్‌టార్క్‌లో టీఎఫ్‌టీ కన్సోల్‌లో సోషల్‌మీడియా నోటిఫికేషన్లు చూసుకోవచ్చు. కాల్‌, ఎస్సెమ్మెస్‌ అలెర్ట్‌లు పొందొచ్చు. ఆన్‌లైన్‌లో ఫుడ్‌ డెలివరీ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. సిగ్నల్‌ దగ్గర వేచి ఉన్నప్పుడు క్రికెట్‌, ఫుట్‌బాల్‌ స్కోర్లు, వార్తలూ చూసుకునే సదుపాయం అందిస్తున్నారు. మొత్తంగా 60 స్మా్ర్ట్‌ఫీచర్లను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇక సాధారణ ఫీచర్ల విషయానికొస్తే గత స్కూటర్లతో పోలిస్తే పెద్దగా మార్పులు చేయలేదు. ఇందులో 124.8సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ అమర్చారు. ఇది 9.2 హెచ్‌పీ పవర్‌ను, 10.5Nm పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

WEBSITE 

Previous
Next Post »
0 Komentar

Google Tags