Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bihar College Professor Returns Rs 24 Lakh Salary for Not Teaching Due to Corona

 

Bihar College Professor Returns Rs 24 Lakh Salary for Not Teaching Due to Corona

రూ. 24 లక్షల జీతాన్ని తిరిగి ఇచ్చేసిన ప్రొఫెసర్ - కరోనా కారణంగా పాఠాలేమీ చెప్పలేకపోయాను అంటూ నిర్ణయం

కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఆన్ లైన్ క్లాసులు జరిగినప్పటికీ హాజరైంది అరకొరా విద్యార్ధులే. పాఠాలేమీ చెప్పలేకపోయాను అంటూ తన 33 నెలల వేతనాన్ని తిరిగిచ్చేశారు ఓ కాలేజీ ప్రొఫెసర్.

విద్యార్థులకు పాఠాలు బోధించకుండా జీతం తీసుకొనేందుకు తన మనస్సాక్షి అంగీకరించలేదంటూ దాదాపు రూ.24 లక్షలను వెనక్కి ఇచ్చేశారు. నిజాయతీకి నిలువుటద్దంగా నిలిచిన ఆయన పేరు లలన్ కుమార్. పనిచేసేది బిహార్ ముజఫర్‌పూర్ లోని ఓ ప్రభుత్వ కళాశాలలో.

బిహార్‌కు చెందిన 33 ఏళ్ల లలన్ కుమార్ దిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి హిందీలో మాస్టర్స్, దిల్లీ యూనివర్శిటీ నుంచి పీహెచ్డీ, ఎంఫిల్ చేశారు. చదువు పూర్తయిన తర్వాత ముజరఫరపూర్ లోని నితిశేశ్వర్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేశారు. ఇది బీఆర్ అంబేడ్కర్ బిహార్ యూనివర్శిటీ (బీఆర్ఎ బీయూ) అనుబంధ కళాశాల. 2019 సెప్టెంబరులో లలన్ ఉద్యోగంలో చేరగా.. ఆ తర్వాత కొన్నాళ్లకే కరోనా వ్యాప్తి దృష్ట్యా లాక్ డౌన్ రావడంతో కాలేజీ మూతబడింది. ఆన్ లైన్ క్లాసులు జరిగినప్పటికీ విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో లలన్ తన రెండేళ్ల తొమ్మిది నెలల వేతనాన్ని బీఆర్ఎ బీయూ యూనివర్శిటీ రిజిస్టారు మంగళవారం తిరిగిచ్చేశారు.

ఈ సందర్భంగా లలన్ మాట్లాడుతూ.. “ఈ కాలేజీలో చేరినప్పటి నుంచి ఒక్క రోజు కూడా పూర్తిగా పాఠాలు బోధించలేకపోయాను. పాఠాలు చెప్పనప్పుడు జీతం తీసుకొనేందుకు నా అంతరాత్మ అంగీకరించలేదు. అందుకే వేతనాన్ని తిరిగిచ్చేశా' అని తెలిపారు. ఈ 33 నెలలకు రూ.23,82,228 వేతనాన్ని తీసుకోగా.. ఆ మొత్తాన్ని లలన్ చెక్కు రూపంలో తిరిగిచ్చారు. అతడి చర్యను బీఆర్ఎబీయూ రిజిస్ట్రార్ అభినందించారు.

అయితే లలన్ పై విమర్శలు కూడా వస్తున్నాయి. ఆయన ఇటీవల పీజీ డిపార్ట్మెంట్ లో బదిలీకి అభ్యర్థన పెట్టుకున్నారని, దీనిలో భాగంగానే యూనివర్శిటీపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ చర్యకు పాల్పడ్డాడని నితిశేశ్వర్ కాలేజీ ప్రిన్సిపల్ ఆరోపించారు. అయితే, లలన్ క్లాసులకు పిల్లలు హాజరుకాకపోవడంతో బీఆర్ఎ బీయూ యూనివర్శిటీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రిన్సిపాళ్ళను ఆదేశించినట్లు సమాచారం.

నితిశేశ్వర్ కాలేజీలో దాదాపు 3వేల మంది విద్యార్థులు చదువుతుండగా.. ఇందులో 1100 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులున్నారు. లలన్ ఒక్కడే ఈ కాలేజీలో రెగ్యులర్ హిందీ టీచర్. అతడితో పాటు మరో గెస్ట్ లెక్చర్ అప్పుడప్పుడు కళాశాలకు వస్తుంటారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags