Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSLPRB 2022: SI & Constable Recruitment – All the Details Here

 

TSLPRB 2022: SI & Constable Recruitment – All the Details Here

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్షల పూర్తి వివరాలు ఇవే

======================

UPDATE 28-03-2023

TS: SCT PC (డ్రైవర్), SCT PC (మెకానిక్) ఉద్యోగాల భర్తీ కోసం ఫైనల్ రాత పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 02/04/2023

SCT PC (డ్రైవర్), SCT PC (మెకానిక్) ఉద్యోగాల భర్తీ కోసం ఫైనల్ రాత పరీక్ష ఏప్రిల్ 2న ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు జరుగును. డ్రైవర్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు మెకానిక్ పరీక్ష జరుగును.

మార్చి 28వ తేదీ అర్ధరాత్రి నుంచి మార్చి 31వ తేదీ వరకు అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్టికెట్లు పొందిన అభ్యర్థులు.. దానిపై పాస్పోర్ట్ సైజ్ ఫొటో అతికించాలి.

DOWNLOAD HALL TICKETS

PRESS NOTE 28-03-2023

WEBSITE

======================

UPDATE 19-03-2023

పోలీసు ట్రాన్స్పోర్టు ఆర్గనైజేషన్ (పీటీవో)లో ఎస్సై ఉద్యోగాల ఎంపికకు సంబంధించి మార్చి 26న రాత పరీక్ష (టెక్నికల్ పేపర్) నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం (మార్చి 19) ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ పరిసరాల్లోని కేంద్రాల్లో ఆ రోజు ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకూ పరీక్ష జరుగుతుందన్నారు.

హాల్ టికెట్ల ను మార్చి 21 ఉదయం 8 నుంచి 24న అర్ధరాత్రి 12 గంటల వరకూ డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. దానిపై అభ్యర్థులు తమ పాస్ పోర్టు సైజ్ ఫొటో అంటించాలని, పరిగణనలోకి తీసుకోబోమన్నారు. లేనిపక్షంలో హాల్టికెట్లు డౌన్లోడ్ కాకుంటే support@tslprb.inకి ఈ-మెయిల్ చేయడం, లేదా 93937 11110, 93910 05006 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. ఇదే ఉద్యోగానికి సంబంధించి నిర్వహించబోయే తదుపరి రెండు పరీక్షలకు హాల్టికెట్లు వేర్వేరుగా జారీ చేస్తామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

DOWNLOAD HALL TICKETS

PRESS NOTE

WEBSITE

======================

06-03-2023

Hall Tickets for Written Examination (Technical Papers) for SCT SI (IT & CO) and SCT ASI (FPB)

ఎస్సై(IT), ఏఎస్సై (ఫింగర్ ప్రింట్) పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి.

హాల్ టికెట్లు డౌన్లోడ్ కి అవకాశం: 06-03-2023 (ఉదయం 8 గంటలు) నుండి 09-03-2023 (అర్ధరాత్రి 12 గంటలు) వరకు    

పరీక్ష తేదీలు: ఎస్సై పరీక్ష 11-03-2023 న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఏఎస్సై పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు

DOWNLOAD HALL TICKETS

PRESS NOTE 04-03-2023

WEBSITE

======================

UPDATE 13-01-2023

Revised Schedule for Conduct of Final Written Examinations

తుది రాత పరీక్షల సవరించిన షెడ్యూల్ విడుదల

REVISED SCHEDULE

WEBSITE

======================

UPDATE 07-01-2023

TSLPRB ఈవెంట్ల ఫలితాలు విడుదల – తుది పరీక్ష కి 1,11,209 మంది ఎంపిక 

ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ) / ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ) లాంటి శారీరక సామర్థ్య పరీక్షల్లో 53.70 శాతం మంది ఎంపికయ్యారు. మొత్తం 2,07,106 మంది ఈ పరీక్షలకు హాజరుకాగా.. 1,11,209 మంది అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 కేంద్రాల్లో డిసెంబర్ 8న ప్రారంభమైన ఈ పరీక్షలు జనవరి 5వ తేదీతో ముగిశాయి. ఈ పోటీల్లో అర్హత సాధించిన వారంతా మార్చి నుంచి ఏప్రిల్ వరకు జరిగే తుది రాతపరీక్షలకు హాజరవ్వనున్నారు. 2018- 19లో జరిగిన శారీరక సామర్థ్య పరీక్షల్లో 48.52 శాతం మంది అర్హత సాధించగా, ఈసారి అదనంగా 5.18 శాతం మంది ఎంపికైనట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామకమండలి (టీఎస్ఎల్పీఆర్బీ) జనవరి 6న వెల్లడించింది.

80 శాతానికి పైగా ఎంపికైనా వారు పరుగు విజేతలే

శారీరక సామర్థ్య పరీక్షల్లో భాగంగా పురుషులకు 1600 మీటర్లు, మహిళలకు 800 మీటర్ల పరుగు పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలను లాంగ్జంప్, షాట్పుట్లకు అనుమతించారు. లాంగ్లింప్లో 83 శాతం మంది పురుషులు, 80 శాతం మంది మహిళలు అర్హత సాధించారు. షాట్పుట్లో 91 శాతం మంది పురుషులు.. 96 శాతం మంది మహిళలు ఎంపికవ్వడం విశేషం.

అదనపు విద్యార్హతలే కీలకం.

* ఎస్సై(సివిల్) స్థాయి శారీరక సామర్థ్య పరీక్షలో అర్హత సాధించిన 52,786 మందిలో గ్రాడ్యుయేట్లు 46,828 మంది.. పోస్టు గ్రాడ్యుయేట్లు 5281 మంది.. డిగ్రీ సమానస్థాయి కలిగినవారు 598 మంది.. అదనపు విద్యార్హతలు కలిగినవారు 79 మంది ఉన్నారు.

* ఎస్సై (ఐటీ అండ్ కమ్యూనికేషన్స్) విభాగంలో 3411 మంది సాంకేతిక డిగ్రీ పట్టాదారులు.. 523 మంది అదనపు విద్యార్హతలు కలిగినవారున్నారు.

* ఎస్సై (పోలీస్ రవాణాసంస్థ) విభాగంలో 366 మంది డిప్లొమా హోల్డర్లుండగా.. 567 మంది అదనపు విద్యార్హత కలిగినవారున్నారు.

* ఏఎస్సై(ఫింగర్ ప్రింట్ బ్యూరో) విభాగంలో 1629 మంది పట్టాదారులు.. 292 మంది అదనపు విద్యార్హత కలిగినవారున్నారు.

* కానిస్టేబుల్ (సివిల్) విభాగంలో 90488 మంది అర్హత సాధించారు. వీరిలో ఇంటర్ పూర్తి చేసినవారు 36550 మంది.. ఇంటర్ సమానస్థాయి కలిగిన 3017 మంది.. 46046 మంది గ్రాడ్యుయేట్లు.. అదనపు విద్యార్హత కలిగిన 4875 మంది ఉన్నారు.

* కానిస్టేబుల్(ఐటీ అండ్ కమ్యూనికేషన్స్) విభాగంలో ఒకేషనల్ ఇంటర్ కలిగినవారు 1729 మంది.. 387 మంది ఐటీఐ పూర్తి చేసినవారు.. 4443 మంది అదనపు విద్యార్హత కలిగినవారున్నారు.

* కానిస్టేబుల్(మెకానిక్) విభాగంలో ఐటీఐ పూర్తిచేసినవారు 805 మంది.. 380 మంది అదనపు విద్యార్హులున్నారు.

* కానిస్టేబుల్(డ్రైవర్) ఐటీఐ పూర్తిచేసినవారు 465 మంది.. ఇంటర్ చేసినవారు 4524 మంది.. అదనపు విద్యార్హులు 1515 మంది ఉన్నారు.

* కానిస్టేబుల్(రవాణా) విభాగంలో 2472(2055).. 238 (ఇంటర్ సమానస్థాయి) 5465 (గ్రాడ్యుయేషన్).. 828(గ్రాడ్యుయేషన్ కంటే అధికం) మంది ఉన్నారు...

PRESS NOTE 06-01-2023

WEBSITE

======================

UPDATE 28-11-2022

Physical Measurement Test / Physical Efficiency Test (PMT & PET) Dates

తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలను డిసెంబర్ 8వ తేదీ నుంచి నిర్వహిస్తామని తెలంగాణ పోలీసు నియామక బోర్డు ప్రకటించింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు ఆన్లైన్లో అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.

రాష్ట్రవ్యాప్తంగా 11 మైదానాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండతోపాటు ఈసారి సిద్ధిపేటలో కూడా ప్రయోగాత్మకంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు.

DOWNLOAD HALL TICKETS

PRESS NOTE

WEBSITE

======================

UPDATE 30-10-2022

పార్ట్-II దరఖాస్తు తేదీలు: 27/10/2022 నుండి 10/11/2022 వరకు  

PART-II APPLICATION

WEBSITE

======================

UPDATE 21-10-2022

CLICK FOR RESULTS

PRESS NOTE 21-10-2022

WEBSITE

======================

UPDATE 03-10-2022

ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ప్రాథమిక రాతపరీక్షలో కటాఫ్ మార్కుల సవరణ

ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించేందుకు నిర్ణయించిన కటాఫ్ మార్కుల్ని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షలో మొత్తం 200 మార్కులకుగాను ఓసీ అభ్యర్థులు 30 శాతం, బీసీ అభ్యర్థులు 25 శాతం, ఎస్సీ, ఎస్టీ లేదా మాజీ సైనికోద్యోగులు 20 శాతం మార్కులు సాధిస్తే అర్హత సాధిస్తారని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) అక్టోబర్ 2న ఒక ప్రకటనలో వెల్లడించింది.

గతంలో జరిగిన పరీక్షల్లో కటాఫ్ మార్కులు ఓసీలకు 40 శాతం.. బీసీలకు 35 శాతం.. ఎస్సీ, ఎస్టీ లేదా మాజీ సైనికోద్యోగులకు 30శాతంగా ఉండేవి. గత ఆగస్టులో జరిగిన పరీక్షలకు మాత్రం అందరికీ 30 శాతమే కటాఫ్ గా నిర్ణయించారు. దీంతో ఎస్సీ, ఎస్టీ లేదా మాజీ సైనికోద్యోగ అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఓసీలకు, బీసీలకు మాత్రమే కటాఫ్ మార్కుల్ని తగ్గించి తమకు మాత్రం యథాతథంగా ఉంచారనే ఆందోళన నెలకొంది. ఈ విషయం శాసనసభలో ప్రస్తావనకు రావడంతో ఎస్సీ, ఎస్టీ లేదా మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకూ మార్కుల్ని తగ్గిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు తాజాగా హోంశాఖ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గత నెలలోనే ఫలితాలు ప్రకటించేందుకు మండలి సన్నాహాలు చేసింది.

కానీ కటాఫ్ మార్కుల తగ్గింపుపై ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూడాల్సి వచ్చింది. తాజా నిర్ణయం వెలువడటంతో ప్రాథమిక రాతపరీక్ష ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది.

మాజీ సైనికోద్యోగ అభ్యర్థులు సమాచారమివ్వాలి

ప్రాథమిక రాతపరీక్ష రాసిన మాజీ సైనికోద్యోగ అభ్యర్థులు ఆ కోటాతో పాటు వయో పరిమితి సడలింపు లబ్ధి పొందేందుకు అవసరమైన సమాచారాన్ని టీఎస్ఎల్‌పీఆర్బీ వెబ్ సైట్ లో తమ వ్యక్తిగత ఖాతాలో ఉంచాలని మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు సూచించారు.

అక్టోబరు 4న ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ రాత్రి 12 గంటలవరకు వివరాలు సమర్పించాలన్నారు. పెన్షన్ పేమెంట్ ఆర్డర్, డిశ్చార్జి బుక్, సంబంధిత యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ నుంచి నిరభ్యంతర పత్రంలో ఏదో ఒక ప్రతిని స్కాన్ చేయాలని సూచించారు. గడువులోగా ఆ వివరాలను సమర్పించిన వారికి మాత్రమే వయో పరిమితి సడలింపు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు.

Capturing of details of Ex-Servicemen Candidates from 8am on 4th October to 12 midnight on 8th October 2022

PRESS NOTE 02-10-2022

WEBSITE

======================

UPDATE 30-08-2022

కానిస్టేబుల్ పోస్టుల పరీక్షల ప్రిలిమినరీ ‘కీ’ విడుదల 

CLICK FOR PRELIMINARY KEY

PRESS NOTE

WEBSITE

======================

UPDATE 29-08-2022

PRESS NOTE 29-08-2022

=====================

UPDATE 28-08-2022

కానిస్టేబుల్ పోస్టుల పరీక్షల ప్రశ్నా పత్రాలు:

పరీక్షా తేదీ 28-08-2022:    

QUESTION PAPER CODE ’A’ WITH KEY

QUESTION PAPER CODE 'A' WITH KEY

QUESTION PAPER CODE 'B' WITH KEY

QUESTION PAPER CODE 'C' WITH KEY

QUESTION PAPER CODE 'D' WITH KEY

=====================

PRESS NOTE FROM TSLPRB 28-08-2022

WEBSITE

======================

UPDATE 18-08-2022

కానిస్టేబుల్ పోస్టులు:

పరీక్ష తేదీ: 28-08-2022

DOWNLOAD HALL TICKETS

PRESS NOTE

WEBSITE

======================

UPDATE 13-08-2022

ఎస్సై పోస్టులు 

CLICK FOR PRELIMINARY KEY

PRESS NOTE 12-08-2022

OBJECTIONS

WEBSITE

======================

UPDATE 08-08-2022

తెలంగాణలో కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఈ నెల 21న జరగాల్సిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల 28న నిర్వహించాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్ణయించింది. సాంకేతిక కారణాల రీత్యా తేదీని మార్చినట్టు పేర్కొంది. తెలంగాణలో ఆగస్టు 7న (ఆదివారం) ఎస్సై రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో మొత్తం 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మరో 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కాని స్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 28న నోటిఫికేషన్ జారీ అయింది. కానిస్టేబుల్ పోస్టులకు 6.50 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాని స్టేబుల్ పరీక్షలకు హైదరాబాద్ సహా 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నియామక బోర్డు అధికారులు గతంలోనే తెలిపారు.

హాల్ టికెట్లు డౌన్లోడ్ తేదీ: 18-08-2022

పరీక్ష తేదీ: 28-08-2022

PRESS NOTE

WEBSITE

======================

UPDATE 08-08-2022

ఎస్సై పోస్టుల పరీక్ష తేదీ: 07-08-2022

PAPER CODE A

PAPER CODE B WITH ANSWERS KEY

======================

TSLPRB: పోలీస్ రాతపరీక్ష లో బయోమెట్రిక్ విధానం – పరీక్షకి ముందు సూచనలు ఇవే

CLICK HERE

======================

UPDATE 30-07-2022

SI POSTS 👇

పరీక్ష తేదీ: 07-08-2022

DOWNLOAD HALL TICKETS

WEB NOTE

WEBSITE

======================

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలను రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసింది. ఆగస్టు 7న ఎస్సై, ఆగస్టు 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఎస్సై రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 30 నుంచి, కాని స్టేబుల్ అభ్యర్థులు ఆగస్టు 10 నుంచి బోర్డు వైబ్ సైట్ లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది.

మొత్తం 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మరో 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్, మరియు 63 ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 28న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు 2.54 లక్షల మంది అభ్యర్థులు ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు హాజరుకానున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కాని స్టేబుల్ పోస్టులకు 6.50 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. ఎస్సై పోస్టులకు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని 20 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, కానిస్టేబుల్ పరీక్షలకు హైదరాబాద్ సహా 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

ప్రిలిమినరీ పరీక్షల తేదీలు:

ఎస్సై పోస్టులు: ఆగస్టు 7న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు. కానిస్టేబుల్ పోస్టులు: ఆగస్టు 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.

ప్రిలిమినరీ పరీక్షల హాల్ టికెట్ల విడుదల తేదీలు:

ఎస్సై పోస్టులు: జులై 30 నుంచి,

కాని స్టేబుల్ పోస్టులు: ఆగస్టు 10 నుంచి

PRESS NOTE 04-07-2022

WEBSITE

==================

UPDATE 27-05-2022

Tentative Exam Dates

* SCT SI అభ్యర్థులకు మరియు / లేదా తత్సమాన పోస్టులకు 7 ఆగస్ట్ 2022 (ఆదివారం) న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించబడుతుంది.

* SCT PC అభ్యర్థులు మరియు / లేదా తత్సమాన పోస్టులను 21 ఆగస్టు 2022 (ఆదివారం) న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించబడుతుంది.

PRESS NOTE 27-05-2022

WEBSITE

========================

TSLPRB: తెలంగాణలో వివిధ విభాగాల్లో 16614 ఎస్‌ఐ కానిస్టేబుల్ నియామకాల వివరాలు

CLICK HERE

========================

TSLPRB: తెలంగాణలో పోలీసు రవాణా విభాగంఎక్సైజ్‌ శాఖలో 677 కానిస్టేబుల్ నియామకాల వివరాలు

CLICK HERE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags