Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Recruitment 2022: Apply for 1673 Probationary Officer Posts – Details Here

 

SBI Recruitment 2022: Apply for 1673 Probationary Officer Posts – Details Here

ఎస్బీఐలో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు బేసిక్ పే రూ.41,960. 

దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), సెంట్రల్ రిక్రూట్ మెంట్ & ప్రమోషన్ డిపార్ట్ మెంట్... పీవో ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 22.09.2022 నుంచి 12.10.2022 వరకు అవకాశం ఉంది. అభ్యర్థిని ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్ బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

ప్రొబేషనరీ ఆఫీసర్: 1673 పోస్టులు (ఎస్సీ- 270, ఎస్టీ- 181, ఓబీసీ- 464, ఈడబ్ల్యూఎస్- 160, యూఆర్-648)

ఖాళీలు: రెగ్యులర్- 1600; బ్యాక్ లాగ్- 73.

అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయోపరిమితి (01.04.2022 నాటికి): 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు బేసిక్ పే రూ.41,960.

దరఖాస్తు రుసుము: రూ. 750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్ & ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్లు / ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్లు: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం , కరీంనగర్, వరంగల్.

ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్టేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 22.09.2022 నుంచి 12.10 .2022 వరకు.

దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 22.09.2022 నుంచి 12.10.2022 వరకు.

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ల డౌన్లోడ్: 2022, డిసెంబర్ మొదటి / రెండో వారంలో ప్రారంభం.

స్టేజ్ 1- ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2022, డిసెంబర్ 17/ 18/ 19/ 20.

ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: డిసెంబర్ 2022 / జనవరి 2023.

మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్లోడ్: జనవరి 2023 / ఫిబ్రవరి 2023.

స్టేజ్ 2- ఆన్ లైన్ మెయిన్ ఎగ్జామ్: జనవరి 2023 / ఫిబ్రవరి 2023.

ప్రధాన పరీక్ష ఫలితాల ప్రకటన: ఫిబ్రవరి 2023.

ఫేజ్ 3 కాల్ లెటర్ డౌన్లోడ్: ఫిబ్రవరి 2023.

ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: ఫిబ్రవరి/ మార్చి 2023.

ఇంటర్వ్యూ & గ్రూప్ ఎక్సర్ సైజ్ తేదీలు: ఫిబ్రవరి/ మార్చి 2023.

తుది ఫలితాల ప్రకటన: మార్చి 2023.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar