Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telugu States Voters List Draft-2023 Released

 

Telugu States Voters List Draft-2023 Released

తెలుగు రాష్టాల్లో ఓటర్ల ముసాయిదా జాబితా-2023 విడుదల

========================

తెలుగు రాష్టాల్లో ఓటర్ల జాబితా ముసాయిదాలు నవంబర్ 09, బుధవారం విడుదలయ్యాయి.

========================

తెలంగాణలో ఓటర్ల జాబితా:

రాష్ట్రంలో 5,99,900 మంది ఓటర్లు తగ్గారు!

రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య తగ్గింది. ఈ ఏడాది జనవరి 5వ తేదీన విడుదల చేసిన ఓటర్ల జాబితాతో పోలిస్తే 5,99,900 మంది ఓటర్లు తగ్గారు. ఏటా నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం బుధవారం ఖరారు చేసి జిల్లాలకు పంపింది.

రాష్ట్రంలో 2,95,65,689 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1,48,61,100 మంది పురుషులు కాగా, 1,47,02,914 మంది మహిళలు, ఇతర ఓటర్లు 1,655 మంది ఉన్నారు. మహిళ, పురుష ఓటర్లు తగ్గితే ఇతర ఓటర్లు మాత్రం పెరిగారు. ఏటా జనవరి 5వ తేదీన ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను వెలువరిస్తుంది.

ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో 3,01,65,569 మంది ఓటర్లు ఉన్నారు. ఒకే ఫొటోతో ఉన్నవారిని గుర్తించి పెద్ద సంఖ్యలో బోగస్ ఓటర్లను తొలగించారు. తాజాగా ఓటు హక్కు కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో పోలింగు కేంద్రాల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఈ ఏడాది జనవరిలో 34,798 ఉండగా తాజాగా ఆ సంఖ్య 34,891కు పెరిగింది.

TS VOTER’S LIST DRAFT-2023 

======================== 

ఏపీలో ఓటర్ల జాబితా:

రాష్ట్రంలో 11,23,829 మంది ఓటర్లు తగ్గారు!

రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గింది. ఈ ఏడాది జనవరి 5 నాటికి రాష్ట్రంలో 4,07,38,279 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం వారి సంఖ్య 3,98,54,093కు తగ్గింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2023 చేపట్టిన ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను బుధవారం విడుదల చేసింది.

2,41,463 మంది ఓటర్లు కొత్తగా చేరారు. 11,23,829 మందిని జాబితా నుంచి తొలగించారు. నికరంగా 8,82,366 మంది ఓటర్లు తగ్గారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ వివరాలు వెల్లడించారు. పురుషులు కంటే 4,19,007 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.

AP VOTER’S LIST DRAFT-2023

========================

NOTES ON TS STATE:

1.Electoral Rolls have been stored in .PDF Format.

2.To view Electoral Rolls, Acrobat Reader must be installed in your computer. (If you do not have Acrobat Reader in your system, download acrobat    reader free version from internet.)

3. Pop-Up Window shall be allowed to view PDF Files (Tools.... PopUp Blocker.... TurnOff PopUp Blocker)

========================

NOTES ON AP STATE:

1. Electoral Rolls have been stored in .PDF Format.

2. To view Electoral Rolls, Acrobat Reader must be installed in your computer. (If you do not have Acrobat Reader in your system, download acrobat reader free version from internet.)

3. Pop-Up Window shall be allowed to view PDF Files (Tools.... PopUp Blocker.... TurnOff PopUp Blocker)

4. Mozilla Firefox Web Browser is preferable to view the Electoral Rolls.

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags