Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE Exams 2023: PIB Warns Students of Fake Website Asking Registration Fees

 

CBSE Exams 2023: PIB Warns Students of Fake Website Asking Registration Fees

సీబీఎస్ఈ పరీక్షలు 2023: నకిలీ వెబ్సైట్ గురించి పీఐబీ హెచ్చరిక – వివరాలు ఇవే

సైబర్ నేరగాళ్లు తాజాగా సీబీఎస్ఈ (CBSE) విద్యార్థులే లక్ష్యంగా మోసాలకు దిగారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పేరిట ఓ నకిలీ వెబ్సైట్ తెరిచి కొత్త దందాకు తెరతీశారు. రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు దృష్టికి రావడంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) అప్రమత్తమైంది.

ఇలాంటి నకిలీ వెబ్సైట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులకు ట్విటర్ వేదికగా ఫ్యాక్ట్చిక్ అలర్ట్ జారీ చేసింది. www.cbsegovt.com  పేరిట ఓ నకిలీ వెబ్సైట్లో అడ్మిట్కార్డు రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు కట్టాలని ఫేక్ లింక్ చూపిస్తోందంటూ పీఐబీ దృష్టికి వచ్చింది. దీంతో ఈ సైట్కు ఎలాంటి అనుమతీ లేదని పీఐబీ తెలిపింది.

కేవలం www.cbse.gov.in, www.cbse.nic.in మాత్రమే సీబీఎస్ఈకి చెందిన అధికారిక వెబ్సైట్లు అని పేర్కొంది. పరీక్ష తేదీలు, డేటా షీట్లు, పరీక్షా ఫలితాలు మొదలైన సమాచారం కోసం అధికార వెబ్ సైట్లను సంప్రదించాలని తెలిపింది. ఏదైనా సమాచారం తనిఖీ చేసేటప్పుడు అసలుదా? నకిలీదా? అనేది చెక్ చేసుకోవాలని సూచించింది.

MAIN WEBSITE 1

MAIN WEBSITE 2

FAKE WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags