Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Election Results 2022: BJP Record win in Gujarat - Congress Wins in Himachal Pradesh

 

Election Results 2022: BJP Record win in Gujarat - Congress Wins in Himachal Pradesh

అసెంబ్లీ ఎన్నికలు-2022: గుజరాత్ లో బీజేపీ - హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ విజయం

====================

గుజరాత్ లో బీజేపీ భారీ విజయం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఏడోసారి విజయం సాధించడంతో పాటు 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టి అత్యధిక స్థానాలతో భాజపా సరికొత్త చరిత్ర లిఖించింది. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాషాయ పార్టీ ఏకంగా 156 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓ రాజకీయ పార్టీ ఈ స్థాయిలో సీట్లు దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకుముందు 1985లో కాంగ్రెస్ (Congress) అప్పటి నేత సోలంకీ సారథ్యంలో అత్యధికంగా 149 సీట్లతో విజయం సాధించింది. ఇప్పుడా రికార్డును భాజపా బ్రేక్ చేసింది.

గుజరాత్లో 1962 నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలుత 154 నియోజకవర్గాలుండగా.. 1972 తర్వాత 182 నియోజకవర్గాలకు పెంచారు. 1980లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ 141 స్థానాలతో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లోనూ అదే ఉత్సాహం కొనసాగించిన హస్తం పార్టీ.. 149 సీట్లతో విజయఢంకా మోగించింది. ఆ తర్వాత ఏ పార్టీకి కూడా ఆ స్థాయిలో మెజార్టీ దక్కలేదు.

ఇక, 1995లో తొలిసారి అధికారంలోకి వచ్చిన భాజపా (BJP).. 121 సీట్లతో విజయం సాధించింది. అప్పటి నుంచి వరుసగా అధికారంలో కొనసాగుతూ వస్తోన్న కమలం పార్టీ.. 2002లో 127 స్థానాలు దక్కించుకుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో తన సొంత రికార్డును బద్దలుకొట్టిన భాజపా.. చరిత్రను తిరగరాసింది. ఏకంగా 156 స్థానాల్లో విజయం సాధించి.. ప్రతిపక్షాలకు అందనంత ఎత్తుకు దూసుకెళ్లింది.

గురువారం వెలువడిన ఫలితాల్లో భాజపా 156 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ కేవలం 17 స్థానాలకు పరిమితమైంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి 5 సీట్లు దక్కగా.. మరో నాలుగు స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు.

OFFICIAL GUJARAT RESULTS

====================

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ విజయం

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 68 సీట్లకు గానూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 35ను దాటేసింది. మొత్తం 40 స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీజేపీ 25  స్థానంలో గెలుపొందగా.. ఇతరులు మూడు సీట్లను గెలుచుకున్నాయి.

OFFICIAL HIMACHAL PRADESH RESULTS

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags