Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NTA - Common University Entrance Test (CUET (UG) 2023) – All the Details Here

 

NTA - Common University Entrance Test (CUET (UG) 2023) – All the Details Here

ఎన్‌టి‌ఏ - సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ (యూజీ)-2023): పూర్తి వివరాలు ఇవే

======================

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (యూజీ)-2023 కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ-యూజీ/ క్యూయెట్ యూజీ)- 2023 నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికిగానూ యూజీ కోర్సుల్లో చేరొచ్చు. ప్రైవేట్, డీమ్డ్ టు బీ యూనివర్సిటీలు సైతం అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోరును ఆధారంగా చేసుకోవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. పరీక్ష నిర్వహణ బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అప్పగించింది. ఈ పరీక్ష ద్వారా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇగ్నో, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, దిల్లీ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి మరెన్నో ప్రముఖ విద్యాసంస్థల్లో సీటు సంపాదించొచ్చు. మేలో ప్రవేశ పరీక్ష జరుగనుంది.

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (యూజీ)-2023

అర్హత: ఇంటర్మీడియట్ / తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష మాధ్యమం: 13 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, మరాఠీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ, పంజాబీ, ఒడియా) రాయొచ్చు.

పరీక్ష విధానం: యూజీ పరీక్ష మూడు సెక్షన్లుగా జరుగుతుంది. మొదటి సెక్షన్(1, 1బి) లాంగ్వేజ్లో, రెండో సెక్షన్ స్పెసిఫిక్ సబ్జెక్టులో, మూడో సెక్షన్ జనరల్ టెస్ట్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. మొదటి సెక్షన్లో 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. రెండో సెక్షన్లో 45/50 ప్రశ్నలకు గానూ 35/40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మూడో సెక్షన్లో 60 ప్రశ్నలకు గానూ 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరాఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

జనరల్- మూడు సబ్జెక్టులకు రూ.750; ఏడు సబ్జెక్టులకు రూ.1500; పది సబ్జెక్టులకు రూ.1750.

ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్- మూడు సబ్జెక్టులకు రూ.700; ఏడు సబ్జెక్టులకు రూ.1400; పది సబ్జెక్టులకు రూ.1600.

ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్ జెండర్- మూడు సబ్జెక్టులకు రూ.650; ఏడు సబ్జెక్టులకు రూ.1300; పది సబ్జెక్టులకు రూ.1550.

ఏపీలోని పరీక్ష కేంద్రాలు: అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లి, విజయనగరం, తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం.

తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, జగిత్యాల, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సికింద్రాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 09-03-2023.

ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 12-03-2023.

రుసుము చెల్లింపు చివరి తేదీ: 12-03-2023.

దరఖాస్తు సవరణ తేదీలు: 15 నుంచి 18-03-2023 వరకు.

పరీక్ష కేంద్రాల ప్రకటన: 30-04-2023.

అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ తేదీలు: మే రెండో వారం, 2023.

పరీక్ష తేదీలు: 21-05-2023 నుంచి ప్రారంభం.

ఫలితాల ప్రకటన: తర్వాత ప్రకటిస్తారు.

======================

INFORMATION BULLETIN

REGISTER AND APPLY

WEB NOTE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar