Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

తెలంగాణ రాష్ట్రం లో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి జీ. ఓ విడుదల

 

తెలంగాణ రాష్ట్రం లో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి జీ.ఓ విడుదల

========================

TS: Filling up 5,089 Vacant Teacher Posts - Direct Recruitment through Departmental Selection Committee (DSC) – G.O Released  

========================

G.O- DETAILS

Public Services – School Education Department – Filling up of five thousand and eighty-nine (5,089) vacant teacher posts in various categories under the control of Director of School Education, Telangana, Hyderabad by way of Direct Recruitment through Departmental Selection Committee – Orders – Issued.

FINANCE (HRM.VII) DEPARTMENT

G.O.Ms.No.96, Dated: 25th, August, 2023

DOWNLOAD G.O. 96


========================

UPDATE 25-08-2023

తెలంగాణలో డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

తెలంగాణలో డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2,575 ఎస్జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈసారి టీఎస్ పీఎస్సీ ద్వారా కాకుండా గతంలో మాదిరిగా జిల్లా ఎంపిక కమిటీలు (డీఎస్సీ) నియామకాలు చేపడతాయని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ ప్రకారం టెట్ లో క్వాలిఫై అయిన వారంతా టీఆర్టీకి పోటీ పడేందుకు అర్హులు. అందులో అర్హత సాధించిన వారి వివరాలతో జిల్లాలవారీ జాబితాను రూపొందించి డీఎస్సీకి పంపుతారు. అనంతరం ఆయా జిల్లాల డీఎస్సీలు నియామకాలు చేపడతాయని చెప్పారు.

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సెప్టెంబరు 15న నిర్వహిస్తామన్న ఆమె.. అదే నెల 27న ఫలితాలు వెల్లడించనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత వెంటనే నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. అలాగే, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఇటీవలే కాంట్రాక్ట్ విధానంలో 1,264 బోధన, బోధనేతర ఖాళీలను భర్తీచేశామని.. ప్రాజెక్టు అయినందున కాంట్రాక్ట్ విధానంలో నియమించామని చెప్పారు. అయితే, కేజీబీవీల్లో సిబ్బందిని క్రమబద్ధీకరించడం కుదరదని మంత్రి తేల్చి చెప్పారు. గురుకులాల్లో 12,150 బోధన, బోధనేతర ఖాళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

========================

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తెలంగాణ రాష్ట్రం లో టీచర్ పోస్టుల భర్తీకి రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

మొత్తంగా 6,500కు పైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందులో పాఠశాల విద్యలో 5,089, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్లలో 1,523 పోస్టులు ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags