SBI Recruitment 2023: Apply for 8,773 Junior
Associate Posts – Details Here
ఎస్బీఐలో 8,773 జూనియర్ అసోసియేట్ పోస్టులు - బేసిక్ పే: నెలకు రూ.19,900.
=====================
ప్రభుత్వ రంగ
బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారీ ఖాళీలతో క్లర్క్ జాబ్
నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 8,773 జూనియర్ అసోసియేట్స్ (క్లరికల్ కేడర్) పోస్టులను భర్తీ
చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్లో 525; అమరావతి సర్కిల్లో 50
ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు
ఆన్లైన్లో నవంబర్ 17 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు:
జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్)
మొత్తం
పోస్టుల సంఖ్య: 8,773.
హైదరాబాద్
సర్కిల్ (తెలంగాణ) లో పోస్టుల సంఖ్య: 525.
అమరావతి
సర్కిల్ (ఆంధ్రప్రదేశ్)లో పోస్టుల సంఖ్య: 50.
విద్యార్హత:
ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్/ చివరి
సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.04.2023 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 02.04.1995 - 01.04.2003 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ(జనరల్/
ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
బేసిక్ పే:
నెలకు రూ.19,900.
ఎంపిక
విధానం: ఆన్లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్
ఎగ్జామ్),
స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగరం, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.
ముఖ్యమైన
తేదీలు...
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.11.2023.
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేది: 07.12.2023.
ప్రిలిమినరీ
పరీక్ష: జనవరి 2024లో జరుగుతుంది.
మెయిన్
పరీక్ష తేది: ఫిబ్రవరి 2024లో జరుగుతుంది.
=====================
0 Komentar