Navodaya Vidyalaya
Admission 2026-27: Class 6 – All the Details Here
నవోదయ
విద్యాలయ లో 2026-27 విద్యా సంవత్సరంలో 6
వ తరగతి ప్రవేశ పరీక్ష పూర్తి వివరాలు ఇవే
=====================
UPDATE 13-12-2025
నవోదయ
ప్రవేశాలు 2026-27: 6వ తరగతి ప్రవేశ పరీక్ష – ప్రశ్నా
పత్రాలు &
‘కీ’ లు
పరీక్ష తేదీ:
13-12-2025
=====================
UPDATE 18-11-2025
నవోదయ
విద్యాలయ లో 2026-27 విద్యా సంవత్సరంలో 6 వ తరగతి ప్రవేశ పరీక్ష – అడ్మిట్ కార్డులు విడుదల
పరీక్ష తేదీ:
13/12/2025,
11.30 AM
=====================
జవహర్ నవోదయ
విద్యాలయ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆరో
తరగతిలో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జవహర్
నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2026 ద్వారా దరఖాస్తులు
కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ లో 15, తెలంగాణలో 9 జేఎన్వీలు ఉన్నాయి. ఏ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా
విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు
ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు.
జవహర్ నవోదయ
విద్యాలయ ఎంపిక పరీక్ష-2026
అర్హత: ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి.
వయసు:
దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 01.05.2014 నుంచి 31.07.2016 మధ్యలో జన్మించిన వారై ఉండాలి.
ప్రవేశ
పరీక్ష: జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా
విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు (మెంటల్
ఎబిలిటీ,
అరిథ్మెటిక్, లాంగ్వేజ్)
ఉంటాయి.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ లో
ఎంపిక
ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు
ప్రక్రియ చివరి తేదీ: 29/07/2025
పరీక్ష తేదీ:
13/12/2025,
11.30 AM
=====================
=====================

.jpg)
0 Komentar