Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

FASTag Annual Pass: Annual Toll Pass (Rs. 3000) On National Highways Started - Details Here

 

FASTag Annual Pass: Annual Toll Pass (Rs. 3000) On National Highways Started  - Details Here

జాతీయ రహదారుల పై వార్షిక టోల్ పాస్ (రూ.3 వేలు) యాక్టి వేషన్ ప్రక్రియ ప్రారంభం – పూర్తి వివరాలు ఇవే

===================

జాతీయ రహదారుల పై ప్రయాణించే వాణిజ్యేతర వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.3 వేల వార్షిక టోల్ పాస్ (FASTag Annual Pass) ఆగస్టు 15 నుండి అమలు లోకి వచ్చింది. రాజ్ మార్గ యాత్ర యాప్ లో ఈ పాస్ ను యాక్టివేట్ చేసుకొనేందుకు ఓ లింక్ ను రవాణాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. కార్లు, జీపులు, వ్యాన్లు తదితర వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఈ పాస్ వర్తిస్తుంది. దీంతో ఇక టోల్ చెల్లింపులకు ఫాస్టాగ్ కార్డులు పదేపదే రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

ఒక ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు కు ఉపయోగం    

రూ.3 వేలతో ఫాస్టాగ్ టోల్పాస్ తీసుకునే కార్లు, జీపులు, వ్యాన్ల యజమానులు ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు (ఏది ముందైతే అది) జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు. నూతన విధానం వ్యక్తిగత కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది. వాణిజ్య వాహనాలకు చెల్లుబాటు కాదు. 200 ట్రిప్పులు పూర్తయ్యాక మళ్లీ రూ. 3వేలతో యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఏడాదిలో ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు. ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్నవారు మళ్లీ కొత్త ఫాస్టాగ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. పాత ఫాస్టాగ్ తోనే టోల్ పాస్ యాక్టివేట్ చేసుకోవచ్చు.

ట్రిప్పు అంటే?

ఒక్కో టోల్ గేటు ఒక ట్రిప్పుగా లెక్కిస్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేవారు 4 టోల్ గేట్లను దాటాల్సి ఉంటుంది. అంటే వారు నాలుగు ట్రిప్పులను పూర్తి చేసినట్లుగా లెక్కిస్తారు. తిరిగి వస్తే మరో నాలుగు ట్రిప్పులుగా పరిగణిస్తారు. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి రావడానికి 8 ట్రిప్పులు అవుతాయి. వార్షిక పాస్ తీసుకోవడం తప్పనిసరేమీ కాదు. తక్కువ ట్రిప్పులు తిరిగేవారు, ఒకేసారి రూ.3వేలు చెల్లించడానికి ఇష్టపడనివారు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫాస్టాగ్ విధానాన్ని కొనసాగిస్తూ టోల్ గెట్ లలో వసూలు చేసే ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.

ఉపయోగమా కాదా?

ఇప్పుడున్న విధానం ప్రకారం ఒక్కో గేట్ వద్దా కనీసం రూ.50 చెల్లిస్తారనుకుంటే.. 200 గేట్లు దాటడానికి రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక పాస్ తో ఇది రూ.3 వేలకు తగ్గుతుంది. దీనివల్ల వాహనదారులకు ఏటా సగటున రూ. 7 వేల ప్రయోజనం చేకూరుతుంది.

యాక్టివేషన్ ఎలా?

> ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదార్లు ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లో రాజ్ మార్గ్ యాత్ర యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.

> మొబైల్ నంబర్, వాహన నంబర్, ఫాస్టాగ్ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ కావాలి.

> ‘Annual Pass’ మీద క్లిక్ చేసి, ఆ తర్వాత ‘Activate’ బటన్ మీద క్లిక్ చేసి పేమెంట్ గేట్ ద్వారా రూ. 3వేలు చెల్లించాలి. అనంతరం రెండు గంటల్లో పాస్ యాక్టివేట్ అవుతుంది.

===================

RAJMARGYATRA ANDROID APP

RAJMARGYATRA iOS APP

WEBSITE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags