Khairatabad Ganesh 2025 - ‘Sri Viswashanti
Maha Shakti Ganapathi’ - Details Here
ఖైరతాబాద్
గణనాథుడు 2025: 'శ్రీ విశ్వశాంతి మహా శక్తి గణపతి’ గా
గణనాథుడు - నమూనా ఫొటో ఇదే
===================
ఖైరతాబాద్
మహాగణపతి ఈ ఏడాది ‘శ్రీ విశ్వశాంతి
మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఖైరతాబాద్
లో జరిగే మహాగణపతి 71వ వేడుకల సందర్భంగా
ఈ ఏడాది రూపుదిద్దుకోనున్న విగ్రహ నమూనా చిత్రాన్ని జూన్ లోనే విడుదల చేశారు.
ఈసారి 69 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు
నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ
ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్
విజయారెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
===================
===================



0 Komentar