Intelligence Bureau Recruitment 2025: Apply
for 455 Security Assistant Posts – Details Here
ఇంటలీజెన్స్
బ్యూరోలో 455 సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటర్
ట్రాన్స్పోర్ట్) పోస్టులు - జీతం: నెలకు రూ. 21,700 - రూ. 69,100.
====================
భారత
ప్రభుత్వం, హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని
ఇంటెలిజెన్స్ బ్యూరో.. 455 సెక్యూరిటీ
అసిస్టెంట్ (మోటర్ ట్రాన్స్పోర్ట్) పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సబ్సీడరీ ఇంటలిజెన్స్ బ్యూరోల్లో (SIBs) ఈ నియామకాలు జరుగనున్నాయి. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 28 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలి.
సెక్యూరిటీ
అసిస్టెంట్ (మోటర్ ట్రాన్స్పోర్ట్) - 455 పోస్టులు
అర్హత:
గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి
(మెట్రిక్యూలేషన్) ఉత్తీర్ణత. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్
మెకానిజం పరిజ్ఞానం అవసరం. లైసెన్స్ పొందిన తర్వాత కనీసం ఒక సంవత్సరం డ్రైవింగ్
అనుభవం ఉండాలి. అభ్యర్థి దరఖాస్తు చేసిన రాష్ట్రానికి సంబంధించిన డొమిసైల్
సర్టిఫికేట్ తప్పనిసరి. మోటార్ సైకిల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంటే అదనపు అర్హతగా
పరిగణిస్తారు.
వయోపరిమితి: 28.09.2025 నాటికి 18- 27 సంవత్సరాల మధ్య
ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు
వయసులో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు
రూ. 21,700
- రూ. 69,100.
ఎంపిక
విధానం: టైర్-1 (100 మార్కులకు, గంట సమయం); టైర్-2 (50 మార్కులు) డ్రైవింగ్ టెస్ట్ లో పాటు ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. టైర్1లో జనరల్ అవేర్నెస్ 20 మార్కులు; ట్రాన్స్పోర్ట్/డ్రైవింగ్ రూల్స్ కు 20 మార్కులు; క్వాంటిటేటివ్
ఆప్టిట్యూడ్ 20 మార్కులు, రీజనింగ్ 20 మార్కులు, నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు
ఫీజు: యూఆర్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ పురుషులకు రూ.650 ఎస్సీ/ఎస్టీ/ మహిళలలు/ ఈఎస్ఎం అభ్యర్థులకు రూ.550.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభ తేదీ: 06-09-2025
దరఖాస్తుకు చివరి
తేదీ: 28-09-2025
====================
====================


0 Komentar