Flipkart ‘Big Billion Days’ Sale 2025:
Dates Announced – Details Here
ఫ్లిప్
కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' సేల్ 2025: తేదీలు మరియు ఆఫర్ ల వివరాలు ఇవే
==================
ఫ్లిప్
కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్ 2025' సేల్ తేదీని అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని తెలిపింది. ఇదే తేదీన
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కూడా మొదలవుతుంది. దీంతో ఈ రెండు ఇ-కామర్స్
ప్లాట్ఫాంల మధ్య భారీ పోటీ నెలకొననుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్స్ కు ఒక రోజు ముందుగానే ప్రత్యేక ఆఫర్లకు
యాక్సెస్ ఇవ్వనుంది.
ఫ్లిప్కార్ట్
యాప్ లో ల్యాండింగ్ పేజీని అప్డేట్ చేసింది. అయితే సేల్ ఎన్ని రోజుల పాటు
కొనసాగుతుందనేది ఇంకా వెల్లడించలేదు. ఈ సేల్ లో యాపిల్, శాంసంగ్, మోటరోలా వంటి
బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు ఉండనున్నాయి. సేల్ సందర్భంగా లిమిటెడ్
టైమ్ ఆఫర్లు, ఫెస్టివ్ రష్ అవర్స్ లాంటివి
అందుబాటులో ఉంటాయి. అదనంగా కొన్ని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై డబుల్ డిస్కౌంట్స్
ఇవ్వనుంది.
ఐఫోన్ 16, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24, మోటరోలా ఎడ్జ్ 60 ప్రో, వస్ బడ్స్ 3పై ప్రత్యేక
ఆఫర్లు రానున్నాయని వెల్లడించింది. అంతేకాకుండా ఇంటెల్ పీసీలు, 55 అంగుళాల స్మార్ట్ టీవీలు, ఫ్రంట్లోడింగ్ వాషింగ్ మెషీన్లు కూడా తక్కువ ధరలకు లభించనున్నాయి. బ్యాంకు
ఆఫర్లలో భాగంగా యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్
క్రెడిట్/డెబిట్ కార్డ్ హోల్డర్లకు 10 శాతం
ఇన్స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.
==================
==================



0 Komentar