Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

New Aadhaar – Mobile APP

 

New Aadhaar – Mobile APP

నూతన అధికారిక ఆధార్ మొబైల్ యాప్ - కొత్త యాప్ ఉపయోగాలు ఇవే

=====================

About this app

Aadhaar mobile application—a next-generation digital identity platform for Bharat. This app reimagines how residents engage with their identity, placing control, portability, and privacy directly in their hands.

=====================

భారత ప్రభుత్వం కొత్త ఆధార్ యాప్ ను తీసుకొచ్చింది. తమ ఆధార్ వివరాలను ఫోన్లో స్మార్ట్ సేవ్ చేసి పెట్టుకోవడం, అవసరమైన వివరాలను ఇతరులతో సులువుగా పంచుకోవడం కోసం ఈ యాప్ ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లు యాపిల్ స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని ఉడాయ్ ఎక్స్ వేదికగా తెలిపింది. ఈ యాప్ ద్వారా పేపర్స్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చని పేర్కొంది.

ఉడాయ్ నుంచి ఇప్పటికే ఎంఆధార్ (mAadhaar) పేరిట ఓ యాప్ అందుబాటులో ఉంది. దీనికి అదనంగా ఈ కొత్త యాప్ ను తీసుకొచ్చారు. ఎం ఆధార్ తరహాలో దీంట్లో డిజిటల్ కార్డు డౌన్లోడ్, పీవీసీ కార్డు కోసం ఆర్డర్ చేయడం, ఇ-మెయిల్, మొబైల్ నంబర్ వెరిఫికేషన్, వర్చువల్ ఐడీ జనరేషన్ వంటి ఫీచర్లు ఏవీ ఉండవు. కేవలం మీ ఆధార్ వివరాలను భద్రపరుచుకోవడం, ఇతరులతో పంచుకోవడానికి ఉద్దేశించి మాత్రమే ఈ యాప్ ను తీసుకొచ్చారు.

కొత్త యాప్ ఉపయోగాలు:

> ఆధార్ కార్డును ప్రతిసారీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా.. డిజిటల్ గా  అందుబాటులో ఉంచుకోవడానికి కొత్త ఆధార్ యాప్ ఉపయోగపడుతుంది.

> కుటుంబసభ్యుల ఆధార్ వివరాలన్నీ ఒకే డివైజ్ లో పొందుపరచొచ్చు.

> ఫేస్ అథంటికేషన్ ఫీచర్ కూడా ఉంది.

> మీ కార్డు వివరాలను ఎవరితోనైనా షేర్ చేసుకోవాలన్నా ఈ యాప్ ద్వారా సులువు. ఆధార్ లోని ఏయే వివరాలు పంచుకోవాలనుకుంటున్నారో వాటిని మాత్రమే ఎంపిక చేసుకునే సదుపాయం ఉంది.

> ఆధార్ బయోమెట్రిక్ వివరాలను లాక్ లేదా అన్లాక్ చేసుకునే వెసులుబాటూ ఉంది.

> మీ ఆధార్ వివరాలను చివరిసారిగా ఎక్కడ వినియోగించిందీ ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

=====================

DOWNLOAD APP – ANDROID

DOWNLOAD APP – iOS

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags