Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Cabinet Meeting Highlights - 29/12/2025

 

AP Cabinet Meeting Highlights - 29/12/2025

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే - 29/12/2025

====================

Cabinet Decisions - Press Briefing by Sri. Anagani Satya Prasad, Hon'ble Minister for Revenue & Registration and Stamps, Sri. Nadendla Manohar, Hon'ble Minister for Food and Civil Supplies Consumer Affairs, Sri. Satya Kumar Yadav, Hon'ble Minister for Health, Family Welfare & Medical Education, at Publicity Cell, Block-04, AP Secretariat on 29-12-2025 LIVE

ఏపీ క్యాబినెట్ మీటింగ్ గురించి ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే

YouTube Link:

https://www.youtube.com/watch?v=V7w0TpaDZlQ


====================

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం పలువురు మంత్రులు ప్రెస్ మీట్ లో వివరించారు.

క్యాబినెట్ లో 24 అంశాలను చర్చించి ఆమోదం తెలిపినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలను మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్తో కలిసి అనగాని వెల్లడించారు. సాంఘిక సంక్షేమ శాఖలో రుణాలు తీసుకున్న వారికి ఉపశమనం కల్పించామన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లాల ఏర్పాటులో మార్పులు, చేర్పులు చేసినట్లు తెలిపారు. 9 జిల్లాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని.. 17 జిల్లాల్లో కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడించారు. ప్రజల కోరిక మేరకు డివిజన్లు, మండలాలు మార్చామన్నారు. పోలవరం పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాయచోటిని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు.

కేబినెట్ నిర్ణయాలు ఇవే:

1. విశాఖలో ఆసుపత్రి నిర్మాణానికి భూమి కేటాయింపు.

2. పెనుగొండను వాసవీ పెనుగొండగా మార్చేందుకు ఆమోదం.

3. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం కలిపి జిల్లా.

4. బనగానపల్లె, అడ్డరోడ్డును డివిజన్లగా ఏర్పాటు.

5. చేర్పులు, మార్పులన్నీ జనవరి 1 నుంచి అమల్లోకి.

6. అన్నమయ్య జిల్లా పేరు అలాగే ఉంటుంది.. జిల్లా కేంద్రం మాత్రం మదనపల్లె.

7. అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు మార్పు

8. ప్రకాశం జిల్లాలో అద్దంకి సబ్ డివిజన్లోనే దర్శి నియోజకవర్గం

9. రాజంపేటను కడప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలోకి, కడపలోకి సిద్ధవటం, ఒంటిమిట్ట మార్పు.

10. ప్రత్యేక రెవెన్యూ డివిజన్ గా మడకశిర.

11. ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఆమోదించామన్నారు.

====================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags