Indian Rupee Collapses Beyond 90 per USD
for First Time Ever
భారత రూపాయి విలువ
పతనం - మొదటిసారిగా అమెరికా డాలర్ కి రూ. 90
====================
దేశీయ
కరెన్సీ రూపాయి విలువ దారుణంగా పతనమైంది. బుధవారం నాటి ట్రేడింగ్ లో డాలర్ తో పోలిస్తే ఏకంగా 90 మార్క్ ను దాటి సరికొత్త జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది.
క్రితం సెషన్ లో 89.96 వద్ద ముగిసిన
రూపాయి విలువ నేటి ఆరంభం నుంచే క్షీణిస్తూ వస్తోంది. ఒక దశలో ఏకంగా 90.18 వద్ద ఆల్టైమ్ కనిష్ఠాన్ని తాకింది.
దిగుమతిదార్ల
నుంచి డాలరుకు అధిక గిరాకీ, షార్ట్కవరింగ్
కొనసాగడం లాంటివి రూపాయి క్షీణతకు కారణమయ్యాయి. భారత్-అమెరికా వాణిజ్య చర్చలపై
సందిగ్ధత,
విదేశీ సంస్థాగత మదుపర్ల లాభాల స్వీకరణ వంటివి కూడా రూపాయి
విలువను బలహీనపరుస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదిలాగే కొనసాగితే..
రూపాయి విలువ 91కి పడిపోవచ్చని అంచనా వేస్తున్నాయి.
====================
====================



0 Komentar