Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Pariksha PeCharcha 2026 - All the Details

 

Pariksha PeCharcha 2026 - All the Details

పరీక్షా పే చర్చ – 2026: పూర్తి వివరాలు ఇవే

=====================

Episode 2: Pariksha Pe Charcha 2026

Topic: Live Interaction of PM Narendra Modi with Exam Warriors

Date: 09/02/2026, Time: 10.00 AM

YouTube Link:

https://www.youtube.com/watch?v=XFh7BwwTLjc

=====================

పరీక్షా పే చర్చ – 2026: దేశ ప్రధాని మోదీ ముచ్చటించిన విషయాలు ఇవే

విద్యార్థుల్లో సరికొత్త ఉత్సహాన్ని నింపేలా పరీక్షాపే చర్చా కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారితో మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను శుక్రవారం మోదీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. "పరీక్షలను సానుకూలంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం గురించి విద్యార్థులతో అద్భుతమైన చర్చ జరిగింది" అని రాసుకొచ్చారు. అలాగే ఈ వీడియోను అందరూ చూడాలని సూచించారు.

> మీతో మీరు పోటీపడాలి.

> పరీక్షలను పండుగలా చేసుకోవాలి.

> జూదం జోలికి వెళ్లకండి.

> ఇంటర్నెట్ తక్కువ ధరకే లభిస్తుందని సమయం వృథా చేసుకోకండి.

> గతం దగ్గరే ఆగిపోకుండా.. మీ ముందున్న దాన్ని చూసేందుకు ప్రయత్నించండి.

ఈ వీడియోలో మోదీ విద్యార్థులతో మాట్లాడుతూ.. "నేను ప్రధానిని అయ్యాను. కానీ పనితీరు గురించి ప్రజలు ఎన్నో విషయాలు చెప్తుంటారు. ఆ సలహాలు అన్నీ తీసుకోవాలి. కానీ అందులో మనకు సరిపోయేది ఎంచుకోవాలి. నేను కూడా కొన్ని సూచనలు తీసుకొని, పనిలో మార్పులు చేసుకున్నాను. నా విలువలను మాత్రం వదులుకోలేదు. చదువు, విశ్రాంతి, అలవాట్లు, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంలో ఒక బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. అదే ఎదుగుదలకు కీలకంగా మారుతుంది. 

ఆటలు ఆడటం అనేది ఒక నైపుణ్యం. వాటిని ఒక సరదాగా మాత్రమే చూడకండి. జూదం జోలికి వెళ్లకండి. బెట్టింగ్ ల వంటి వాటికి వ్యతిరేకంగా మన దేశంలో చట్టాలు ఉన్నాయి. అలాగే గతం దగ్గరే ఆగిపోకుండా.. మీ ముందున్న దాన్ని చూసేందుకు ప్రయత్నించండి. ఇంకా చేయాల్సిన వాటి గురించి ఆలోచించండి. ఇంటర్నెట్ తక్కువ ధరకే లభిస్తుందని సమయం వృథా చేసుకోకండి. పరీక్షలను పండుగలా చేసుకోవాలి.. మీతో మీరు పోటీపడాలి" అంటూ పలు సూచనలు చేశారు. ప్రతిఒక్కరి ఆలోచనా విధానానికి తేడా ఉంటుందని గుజరాత్ విద్యార్థి సాన్య అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఈసారి పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు 4.5 కోట్ల మంది నమోదయ్యారు.

=====================

UPDATE 04-02-2026

పరీక్షా పే చర్చ – 2026: 

తేదీ & సమయం: 06/02/2026, 10 AM

Ministry of Education Government of India

https://www.youtube.com/watch?v=jL0nhTOhsPc

DD Saptagiri

https://www.youtube.com/watch?v=z08luUahNzQ

DD Yadagiri

https://www.youtube.com/watch?v=TSPkP0KhVBI

=====================

పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే 'పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. 2026 లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రధాని ముఖాముఖి చర్చిస్తారని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.

ఈ కార్యక్రమం ద్వారా మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టి, పలు అంశాలపై వారి సందేహాలను నివృత్తి చేస్తుంటారు. ప్రధానితో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 6-12 తరగతులు చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రిజిస్టర్ చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 01/12/2025

దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేదీ: 11/01/2026

=====================

USER MANUAL PPC-2026

STUDENT SELF REGISTRATION

STUDENT THRU TEACHER LOGIN

PARENT REGISTRATION

TEACHER REGISTRATION

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags