Suzuki First Electric Scooter: e-Access Electric
Scooter Launched – Price & Feature Details Here
సుజుకి నుండి
తొలి విద్యుత్ స్కూటర్: ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల - ధర & ఫీచర్ల వివరాలు ఇవే
===================
సుజుకి కంపెనీ
నుండి తన తొలి విద్యుత్ స్కూటర్ ను దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. తన
విజయవంతమైన మోడల్ యాక్సెస్ ను . ఎలక్ట్రిక్ వెర్షన్లో ఇ-యాక్సెస్ పేరుతో లాంచ్
చేసింది. కంపెనీ తన గురుగ్రామ్ ప్లాంట్ దీన్ని తయారు చేయనుంది. ఎలక్ట్రిక్
స్కూటర్ల మార్కెట్లో బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజాతో ఇది పోటీ పడనుంది.
సుజుకీ
ఇ-యాక్సెస్ లో 3.07 kWh లిథియం ఐరన్ పాస్ఫేట్ బ్యాటరీని
అమర్చారు. ఇది సింగిల్ ఛార్జ్ 95 కిలోమీటర్ల రేంజ్
ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ స్కూటర్లో 4.1kW ఎలక్ట్రిక్ మోటార్ ను అమర్చారు. ఇది 15 Nm పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పోర్టబుల్ ఛార్జర్తో 0-80 శాతం ఛార్జింగ్ ను 4 గంటల 30 నిమిషాల్లో ఛార్జ్ చేయొచ్చని కంపెనీ పేర్కొంది. ఫాస్ట్
ఛార్జర్తో అయితే పూర్తి బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 2 గంటల 12 నిమిషాల సమయం
పడుతుందని కంపెనీ వెల్లడించింది. టాప్ స్పీడ్ గంటకు 71 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది.
ఇందులో
పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్ ఉంది. దీంట్లో ఎకో, రైడ్ ఏ, రైడ్ బి మోడ్లు
ఉన్నాయి. రీజనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ మోడ్ వంటి
సదుపాయాలు కూడా ఉన్నాయి. బ్లూటూత్/ యాప్ కనెక్టివిటీ ఉన్నాయి. యూఎస్బీ ఛార్జింగ్
సదుపాయం కూడా ఉంది. ఎల్ఎస్ఈడీ లైట్స్ ఇచ్చారు. మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో
లభిస్తోంది. గతేడాది భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో దీన్ని తొలిసారిగా ప్రదర్శించారు. సుజుకీ డీలర్షిప్లతో పాటు ఫ్లిప్కార్ట్ లో
కూడా ఆర్డర్ చేయొచ్చు. ఏడేళ్లు లేదా 80వేల
కిలోమీర్ల వరకు వారెంటీ, సుజుకీ కస్టమర్లకు
రూ.10వేల వరకు లాయల్టీ బోనస్, ఇతర
వినియోగదారులకు రూ.7వేలు వెల్కం బోనస్ ఇస్తున్నారు. 5.99 శాతం వడ్డీ రేటుతో ఫైనాన్సింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
===================
===================



0 Komentar