Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Cabinet Meeting Highlights - 26/03/2026


AP Cabinet Meeting Highlights - 26/03/2026

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే - 26/03/2026

====================

Cabinet Decisions - Press Briefing by Sri. Kolusu Parthasarathy, Hon'ble Minister for Information and Public Relations, Housing at Publicity Cell, Block-04, AP Secretariat on 26-03-2026 LIVE

ఏపీ క్యాబినెట్ మీటింగ్ గురించి ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే

YouTube Link:

https://www.youtube.com/watch?v=aHDn96euDDU


====================

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్ లో వివరించారు.

కేబినెట్ నిర్ణయాలు ఇవే:

> రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్-5ను సవరించాల్సిందిగా మంత్రివర్గం తీర్మానం చేసింది.

> కొత్త రాజధాని స్థానంలో అమరావతి పేరును చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

> అంతేకాకుండా నీరుకొండలో ఎస్ఆర్ఎం వర్సిటీ, 60 మీటర్ల ఎత్తు వరకు అకడమిక్ భవనాల నిర్మాణానికి క్యాబినెట్ అనుమతి ఇచ్చింది.

> రాష్ట్రంలో 96 జూనియర్, సీనియర్ సివిల్ జడ్జిల కోర్టుల ఏర్పాటుకు ఆమోదం.

> వడ్డెర సంఘాలకు ప్రాధాన్యక్రమంలో ఖనిజ లీజులు కేటాయింపులపై చర్చ.

> ఖనిజ లీజుల కేటాయింపులో ప్రీమియం, సీనరేజ్ ఫీజుల్లో 50 శాతం రాయితీ.

> కుప్పం బాలికల పాఠశాలలో పీఈటీ, నర్సు, రికార్డు అసిస్టెంట్ పోస్టుల మంజూరుకు ఆమోదం.

> 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ.

> జలవనరుల శాఖలో వివిధ ప్రాజెక్టుల ఆధునికీకరణ, మరమ్మతులకు పరిపాలన అనుమతులు.

> వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది.

> కొత్త రాజధానిగా సీఆర్డీఏ చట్టం పరిధిలోని అమరావతి పేరు చేర్చాలని క్యాబినెట్ తీర్మానించింది.

> ఎల్లుండి (మార్చి 28) అసెంబ్లీలో 4 గంటలపాటు చర్చించి తీర్మానించాలని నిర్ణయించింది.

> రాజధాని చరిత్రను ప్రజలకు తెలియ జేయాలని సీఎం చంద్రబాబు క్యాబినెట్ కు  సూచించారు.

> క్యాబినెట్ సమావేశంలో భాగంగా విద్యుత్ వ్యవస్థపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

> ఏప్రిల్ 5 నుంచి 14 లోపు ప్రతి నియోజకవర్గంలో 2 వేల చొప్పున సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు.

> పీఎం కుసుమ్ ద్వారా పవర్ లాస్లు తగ్గించేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.

> బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థల్ని 33/11 కేవీ సబ్స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

> సాంకేతికత అందిపుచ్చుకుంటూ సంస్కరణలు తీసుకొస్తూ విద్యుత్ శాఖ ముందుకెళ్లాలని సూచించారు.

====================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags