Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 22nd December Information

School Assembly 21st December Information


నేటి ప్రాముఖ్యత
గణిత దినోత్సవం.
చరిత్రలో ఈరోజు
ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, శ్రీనివాస రామానుజన్ జన్మదినం.
    1887వ సంవత్సరంలో తమి ళనాడులో కోమలతామ్మాళ్‌శ్రీనివాస అయ్యంగార్‌ దంపతులకు జన్మించారు శ్రీనివాసరామానుజన్‌. విద్యార్థి దశ నుంచే గణితశాస్త్రం పట్ల అమితాసక్తి కలిగిన రామానుజన్‌ 30 ఏళ్ళ వయస్సులోనే గణితంలో అనేక చిక్కు సమస్యలను పరిష్కరించిఎన్నో కొత్త సిద్ధాంతాలను ఆవిష్కరించారు. 
1953 వ.సం.లో సయ్యద్ ఫజల్‌ఆలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పడింది.
2000 వ.సం.లో ఢిల్లీ లోని ఎర్రకోట లోనికి ప్రవేశించిన ఐదుగురు లష్కరేతొయిబా ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక సాధారణ పౌరుని హతమార్చారు.
ప్రసిద్ధి పొందిన వైద్యశాస్త్ర ప్రముఖుడు శొంఠి దక్షిణామూర్తి పుట్టిన రోజు.
హేతువాది, పాత్రికేయుడు, లాయర్,. 'సారేజహాఁ సే అచ్ఛా ఇండియా' తెలుగు మాస పత్రిక సంపాదకుడు  సయ్యద్ నసీర్ అహ్మద్ పుట్టిన రోజు.
నేటి అంశము:ఆరోగ్యం/వ్యాయామవిద్య/మంచి అలవాట్లు
మంచి నిద్ర - ప్రయోజనాలు
మనుషులు, ఇతర జంతువులలో దైనందిక నిద్ర బ్రతకడానికి అవసరం. నిశ్శబ్దం బంగారం లాంటిది. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనలలో 8 గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో శరీర సామర్థ్యం తగ్గినట్లుగా గుర్తించారు. నిద్ర వలన మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. దానితో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది. నాడీ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది.హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణ నిద్ర వలన సక్రమంగా జరుగుతుంది. 5–12 సంవత్సరాల మధ్య పిల్లలకు  9–11 గంటలు, యువకులకు 10 గంటలు. పెద్దవారికైతే 7–8 గంటల నిద్ర అవసరం.


మంచి మాట
చదువుతో పాటు పెద్దలంటే వినయంతో ఉండటమూ నేర్చుకోవాలి - జవహర్‌లాల్‌ నెహ్రూ
వార్తలలోని ముఖ్యాంశాలు
➥ దేశంలోని ఏ కంప్యూటర్‌లోకి అయినా చొరబడి, అందులోని సమాచారాన్ని విశ్లేషించేందుకు, డీక్రిప్ట్‌(సంకేత భాష నుంచి సాధారణ భాషలోకి మార్చడం) చేయడానికి దర్యాప్తు, నిఘా, భద్రత, పోలీసు వంటి 10విభాగాలకు అధికారాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం.
➥ అగ్రిగోల్డ్‌ గ్రూపునకు చెందిన ఆస్తుల్లో అత్యంత ఖరీదైన హాయ్‌ల్యాండ్‌ వేలానికి రంగం సిద్ధమైంది. హాయ్‌ల్యాండ్‌ కనీస ధరను రూ.600 కోట్లుగా హైకోర్టు నిర్ణయించింది.
➥ ఆర్ధిక పరిస్థితివృద్ధి రేటు, రైతుల సంక్షేమం, సహజ వనరుల నిర్వహణ, గ్రామాలుపట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, విద్యుత్‌ట్రంక్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సుపరిపాలన తదితర అంశాలపై 10 శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
➥ కొవ్వు కరిగింపు (బరువు తగ్గించే) చర్యలో భాగంగా బెరియాట్రిక్‌ సర్జరీల్లో ఇప్పటి వరకు అనుసరించిన కీహోల్‌కు బదులు.. తాజాగా రోబోటిక్‌ ఎండోస్కోపిక్‌ విధానాన్ని హైదరాబాద్‌ లోని  కేర్‌ ఆస్పత్రి  అందుబాటులోకి తెచ్చింది. గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, స్లీప్‌ ఆప్నీయా వంటి సమస్యలతో బాధపడుతున్న స్థూలకాయులకు ఈ పద్ధతి ఓ వరం లాంటిది.
➥ అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ మంత్రి వర్గం నుంచి రక్షణ మంత్రి జేమ్స్‌ మేటిస్‌ వైదొలిగారు. ట్రంప్‌ విదేశాంగ విధానాలతో విభేదించిన ఆయన తన పదవికి గురువారం రాజీనామా చేశారు.
➥ 1986 నాటి వినియోగదారుల హక్కుల చట్టాన్ని, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తూ  వినియోగదారుల పరిరక్షణ బిల్లు 2018కి లోక్‌సభ ఆమోదం లభించగా, రాజ్యసభ ఆమోదానికి వెళ్లనుంది. ఈ బిల్లు ప్రకారం.. ఇ- కామర్స్‌ పోర్టల్‌లో వస్తువులు అమ్మే వ్యాపారులు ఏప్రాంతం వారైనా, వస్తువుల నాణ్యత సరిగా లేకుంటే వినియోగదారులు ఎలక్ట్రానిక్‌ పద్ధతిలోనే ఫిర్యాదు పంపొచ్చు. ఇంకా ఫలానా సినిమాస్టార్‌  చెప్పారు కదా అని నమ్మి డబ్బులతో కొనుగోలు చేసినవారు, మోసపోయామని కేసు పెడితే, సదరు స్టార్‌ కూడా చిక్కుల్లో పడక తప్పదు.
➥ చిత్తూరు జిల్లాలో అపోలో యూనివర్సిటీ, తిరుపతిలో గ్లోబల్‌ డిజిటల్‌ యూనివర్సిటీ, విశాఖపట్నం జిల్లాలో టెక్నో ఇండియా యూనివర్శిటీ, విశాఖపట్నంలో అనీషా రుబికా యునైటెడ్‌ వరల్డ్‌ యూనివర్శిటీ ఇన్‌ ఇంటెలిజెంట్‌ గ్లోబల్‌ హబ్‌ ఫర్‌ డిజిటల్‌ పెడగోగియస్‌తోపాటు ఒంగోలులో ఓం శ్రీ గాయత్రి విశ్వకర్మ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.


పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:22nd DECEMBER

  • School Assembly 22nd December Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,December month school assembly day wise,December 2018 school assembly,December 2018 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 22nd December 2018 assembly, 22nd December 2018 assembly,news of the day history,news of the day highlights,22nd dec 2018 assembly, dec 22nd assembly, dec 22nd historical events, 22nd December 2018 assembly, december 22nd assembly, december 22nd historical events,school related today assembly,school related today news, school related december 22nd information, school related december month information
    Previous
    Next Post »
    0 Komentar

    Google Tags