Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 26th December Information

School Assembly 26th December Information

నేటి ప్రాముఖ్యత
జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం.
చరిత్రలో ఈరోజు
1907వ సం.  భారత జాతీయ కాంగ్రెస్‌ 23వ మహాసభలో పార్టీ సభ్యులు అతివాద, మితవాద వర్గాలుగా చీలిపోయారు. అతివాద వర్గానికి బాలగంగాధర తిలక్, మితవాదులకు గోపాలకృష్ణ గోఖలే నాయకత్వం వహించారు.
2004 వ సం. హిందూ మహాసముద్రంలో వచ్చిన పెను భూకంపం కారణంగా సునామి వచ్చింది. వివిధ దేశాల్లో సునామి సృష్టించిన విధ్వంసంలో దాదాపు 2,75,000 మంది వరకు చనిపోయారు. రిక్టర్‌ స్కేలుపై భూకరప తీవ్రత 9.3గా నవోదైంది. ఈ భూకంపంలో విడుదలైన శక్తి 0.8టీఎన్‌టీలకు సమానం.
1982 వ సం.  టైమ్‌ మ్యాగజైన్‌ ఏటా ఇచ్చే 'మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌' పురస్కారాన్ని ఆ ఏడాది 'పర్సనల్‌ కంప్యూటర్‌'కు ఇచ్చింది. మనిషికి కాకుండా ఆ గౌరవాన్ని ఒక యంత్రానికి ప్రకటించడం అదే మొదటిసారి.
ఉద్దమ్ సింగ్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు 1899 వ సం.లో జన్మించారు.
కొమ్మారెడ్డి సావిత్రి, తెలుగు సినీ ప్రపంచంలో మహానటి 1981 వ సం.లో మరణించారు.
 నేటి అంశము:
సునామీలు రావడానికి గల ముఖ్య కారణాలు...?
1.భూకంపాలు:
ఎక్కువసార్లు సునామీలు సముద్రంలో భూకంపాల వల్ల వస్తాయి. రిక్టర్ స్కేలుపై 7.5 లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రతతో సముద్రంలో సంభవించే భూకంపాల వల్ల సముద్రం అడుగున ఉన్న భూ ఫలకాలలో కదలికలు సంభవిస్తాయి. అప్పుడు ఆ భాగంలో ఉన్న నీరు అస్థిరతకు లోనై, ఆ తర్వాత భూమ్యాకర్షణ శక్తి వల్ల ఆ నీరంతా మళ్లీ కిందకు రావడం తదితర కారణాలతో సునామి సంభవిస్తాయి.
2.మంచు పర్వతాలు విరగడం:
సముద్రం మధ్యలో ఉండే కొండ చరియలు విరిగిపడటం, భారీ మంచు పర్వతాలు విరిగిపోవడం వల్ల కూడా భూకంపాలు వస్తాయి.
3.అగ్నిపర్వతాలు పేలడం:
సముద్రంలోని అగ్నిపర్వతాలు పేలినప్పుడు భారీ మొత్తంలో నీరు స్థానభ్రంశం చెంది సునామీ అలలు ఏర్పడతాయి. అలాగే అగ్ని పర్వతం పై భాగం విరిగి సముద్రంలోకి పడినప్పుడు భారీ మొత్తంలో నీరు అగ్నిపర్వతం లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఏర్పడే అలజడుల కారణంగా కూడా సునామీ వస్తాయి.
4.గ్రహశకలాలు పడటం: అప్పుడప్పుడు భూమిపైకి భారీ ఆకారంలో ఉండే గ్రహశకలాలు,ఉల్కలు సముద్రంలో కూలిన సునామీ అలలు వస్తాయి.
మంచి మాట:
కోపం,ద్వేషం,అసూయ వంటి పనికిమాలిన విషయాలతో నింపడానికి మనసు చెత్త డబ్బా కాదు,శాంతం,సంతోషం ,ప్రేమ వంటి విలువైన భావాలతో నింపాల్సిన వజ్రాల పెట్టె.
వార్తలలోని ముఖ్యాంశాలు
దేశంలోనే అత్యంత పొడవైన రైల్‌కమ్‌రోడ్‌ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అస్సాం రాష్ట్రం డిబ్రూగఢ్‌ సమీపంలోని బోగీబీల్‌ వద్ద ప్రారంభించారు. బ్రహ్మపుత్ర నదిపై 4.94 కి.మీ. పొడవుతో నిర్మించిన ఈ వంతెనతో అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌ మధ్య రాకపోకలు మరింత సులభం కానున్నాయి.
తెలుగు రాష్ట్రాలతోసహా దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తక్కువకి పడిపోయాయి. సాధారణంగా శీతాకాలంలో ఉత్తరాది నుంచి మధ్య భారతం మీదుగా తెలంగాణ నుంచి ఒడిశా వరకు చలిగాలులు బలంగా వీయడమే దీనికి కారణంగా తెలుస్తున్నది.
పాఠశాలలో అడ్మిషన్‌ పొందాలంటే సదరు విద్యార్థులు ఆధార్‌ సమర్పించాల్సిన అవసరం లేదని, స్కూల్‌ యాజమాన్యాలు సైతం విద్యార్థులను అడగవద్దని భారత విశిష్ట గుర్తింపు ప్రాథికార సంస్థ(యూఐడీఏఐ) సూచించింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో దేశంలో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది అక్టోబరులో జీవనకాల గరిష్ఠాన్ని తాకిన పెట్రోల్‌ ధర ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ తాజాగా ఈ ఏడాదిలో కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతోందని, అయినా బ్యాలెన్స్‌ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లలో సంక్షేమ కార్యక్రమాలకు రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశామని సంక్షేమ రంగం, సామాజిక సాధికారితపై మూడో శ్వేతపత్రం విడుదల సందర్భం గా తెలియజేసారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. మోదీతో భేటీలో రాష్ట్ర విభజన హామీలను ప్రస్తావించనున్నారు. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ట్రిపుల్‌ ఐటీ.. ఇతర అంశాలపై మరోమారు లేఖలు అందజేయనున్నారు.
తెలంగాణలో వచ్చే ఐదేళ్లలో మరో ఐదు వైద్యకళాశాలలను నెలకొల్పడానికి వైద్యఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. వికారాబాద్‌, సంగారెడ్డి, జనగాం, రామగుండం, కరీంనగర్‌ జిల్లాల్లో కొత్త వైద్యకళాశాలలను ఏర్పాటుచేసే ఉన్నాయి.

పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.

  • SCHOOL ASSEMBLY:26th DECEMBER

  • School Assembly 26th December Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,December month school assembly day wise,December 2018 school assembly,December 2018 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 26th December 2018 assembly, 26th December 2018 assembly,news of the day history,news of the day highlights,26th dec 2018 assembly, dec 26th assembly, dec 26th historical events, 26th December 2018 assembly, december 26th assembly, december 26th historical events,school related today assembly,school related today news, school related december 26th information, school related december month information
    Previous
    Next Post »
    0 Komentar