Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 28th December Information

School Assembly 28th December Information

చరిత్రలో ఈరోజు
1885వ సం.లో భారత జాతీయ కాంగ్రెసు స్థాపన జరిగింది. మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ.
1921 వ సం.లో మొదటిసారి వందేమాతరం గీతాన్ని కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు.
1859 వ సం. లోమొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త.లార్డ్ మెకాలే (ఇతడే భారతదేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు).
ప్రముఖ పారిశ్రామికవేత్త ధీరుభాయ్ అంబానీ 1932 సం. లో జన్మించారు.
 పారిశ్రామికవేత్త రతన్ టాటా 1937 సం. లో జన్మించారు.
రాజకీయవేత్త ప్రస్తుత కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 1952 సం. లో జన్మించారు.
చైనా కు చెందిన నొబుల్ శాంతి బహుమతి గ్రహీత లియూ క్సియాబొ పుట్టిన రోజు.
 నేటి అంశము:
ఈజిప్ట్ మహిళా చక్రవర్తి
ఈజిప్టు ను పాలించిన కింగ్  Hatshepsut నిజానికి ఓ మహిళ.  కింగ్ తుత్ మోస్-2 క్రీస్తుకు పూర్వం 1473 లో అకస్మాత్తుగా చనిపోవడంతో అతని వారసుడు అయిన తుత్ మోస్-3 బాలుడు కావడంతో క్వీన్ Hatshepsut అధికార పగ్గాలు చేపట్టింది. తన సవతి కొడుకు తుత్ మోస్-3కు తర్వాత కూడా పాలన అప్పగించకుండా తననే కింగ్ గా ఆ రాణి ప్రకటించుకోవడం విశేషం. దాదాపు 20 ఏళ్ల పాటు సాగిన ఆమె పాలనలో ఈజిప్టు శాంతి సుభిక్ష లతో విలసిల్లింది. ఈమె తన హయాంలో కళ లకు, ఆర్కిటెక్చర్ కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. అంత గొప్ప ఈజిప్టు చరిత్ర లో ఆమె పేరు శతాబ్దాలపాటు గల్లంతయింది. దీనికి కారణం ఆమె మరణానంతరం పూర్తిస్థాయిలో పగ్గాలు చేపట్టిన కింగ్ తుత్ మోస్-3 తక్షణం తన సవతి తల్లి ని చక్రవర్తిగా తెలిపే ఆనవాళ్లు ధ్వంసం చేయించాడు. శిల్పాలపై ఆమె పేరును చెరిపించాడు.  రాజరికపు చిహ్నాలతో ఉన్న ఆమె ప్రతిమలను పగులగొట్టించాడు.

 మంచి మాట:
నిరాడంబరత స్నేహితుల్ని పెంచితే గర్వం శత్రువుల్ని పెంచుతుంది- ఎమర్సన్‌
వార్తలలోని ముఖ్యాంశాలు
తక్షణ విడాకులిచ్చే ఇస్లాం సంప్రదాయం ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా పరిగణించే తాజా బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు2018 పేరిట తెచ్చిన ఈ బిల్లుకు 245 మంది సభ్యులు అనుకూలంగా, 11 మంది వ్యతిరేకంగా ఓటేశారు.
వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అన్ని వాహనాలకు ట్యాంపర్‌ ప్రూఫ్‌ హై సెక్యురిటీ రిజిస్ట్రేషన్‌ కలిగిన నంబర్‌ ప్లేట్లు(హెచ్‌ఎస్‌ఆర్‌పీ) ఉండాల్సిందేనని కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించింది. వాటిపై తప్పనిసరిగా అధికారిక హోలోగ్రామ్‌ కలిగిన స్టిక్కర్‌ సైతం ఉండాలని తెలిపింది.
కొత్త సంవత్సరం తొలి రోజున ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మొట్టమొదటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఇదిలా ఉండగా ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ కొత్త సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు.
తుంగభద్ర రిజర్వాయర్‌లో పూడిక వల్ల కోల్పోయిన నీటిని వినియోగించుకునేందుకు ప్రత్యామ్నాయంగా వరద కాలువను, కొత్త రిజర్వాయర్‌ను నిర్మించుకుంటామని కర్ణాటక రాష్ట్రం తుంగభద్ర బోర్డుకు ప్రతిపాదించింది. ఐతే కర్ణాటక తుంగభద్ర వరద నీటిని కాలువ ద్వారా మళ్లిస్తే ఈ మేరకు శ్రీశైలం జలాశయానికి వచ్చే నీటిపై ప్రభావం ఉంటుందన్న ఆందోళన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అధికారుల్లో వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌ను 100 శాతం కరవు రహిత రాష్ట్రంగా మార్చాన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో చేపట్టిన సహజ వనరులు-జల వనరుల నిర్వహణపై గురువారం శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 15,363.79 కోట్ల రూపాయలు ఖర్చుచేసిందని, కేంద్రం కేవలం రూ.6,727.26 కోట్లు మాత్రమే విడుదల చేసిందని వివరించారు.
వైఎస్సార్‌ జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద ఉక్కుఫ్యాక్టరీకి గురువారం ఎపి సీఎం చంద్రబాబు గారు భూమి పూజ నిర్వహించారు. మూడు నెలల్లోపు పనులు ప్రారంభించి, రెండేళ్లలోపు స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం పేర్కొన్నారు.
దేశంలో వ్యవసాయం పండుగ కావాలని, రైతుల కష్టాలన్నీ తొలగిపోయి, కచ్చితమైన ఆదాయ వనరులు సమకూరాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. తెలంగాణలో చేపట్టిన రైతుబంధు పథకం దేశవ్యాప్తంగా అమలు కావాలన్నారు.

పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.

  • SCHOOL ASSEMBLY:28th DECEMBER

  • School Assembly 28th December Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,December month school assembly day wise,December 2018 school assembly,December 2018 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 28th December 2018 assembly, 28th December 2018 assembly,news of the day history,news of the day highlights,28th dec 2018 assembly, dec 28th assembly, dec 28th historical events, 28th December 2018 assembly, december 28th assembly, december 28th historical events,school related today assembly,school related today news, school related december 28th information, school related december month information
    Previous
    Next Post »
    0 Komentar