Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 31st December Information

School Assembly 31st December Information

నేటి ప్రాముఖ్యత
వరల్డ్ స్పిరిట్యువల్ డే.
చరిత్రలో ఈరోజు
ప్రముఖ సాహితీవేత్త పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు పుట్టిన రోజు.
ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు మరియు మాజీ పార్లమెంటు సభ్యుడు అయిన కొంగర జగ్గయ్య పుట్టిన రోజు.
విప్లవ సినిమాల నిర్మాత, దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి పుట్టిన రోజు.
ప్రముఖ ఆర్థికవేత్త రోనాల్డ్ కోస్ పుట్టిన రోజు.
సాహసయాత్రికురాలు, ఆసియాలో అతిపెద్దదైన గోబీ ఎడారిని విజయవంతంగా దాటిన సుచేతా కడేత్కర్ పుట్టిన రోజు.
 నేటి అంశము:
యక్ష ప్రశ్నలు-వాటి పురాణము
మహాభారతం అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన ఆరణి లేడికొమ్ములలో యిరుకుకొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నలుగురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరాడు. కొంతసేపటికి ఆ లేడి కనబడకుండా మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీళ్ళు తెమ్మని నకులుని పంపిచాడు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపాడు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజే బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, ఎంతో దుఃఖించాడు. అంతలో అదృశ్యవాణి పలికింది “ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీ తమ్ములు అహం భావంతో దాహం తీర్చుకోబోయినందుకే ఈ గతి పట్టింది. నీవయినా, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ధర్మరాజును పరీక్షించుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో ఉండి వేసిన 72 చిక్కు ప్రశ్నలే ఈ యక్ష ప్రశ్నలు.
మంచిమాట:
పనిలో ప్రతిసారీ సంతోషం లభించకపోవచ్చు కానీ పని అన్నది లేకపోతే అసలు సంతోషమనేదే ఉండదు- ఫ్రాంక్లిన్‌
వార్తలలోని ముఖ్యాంశాలు
➥దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న గర్భిణులు ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం నగదు రహితంగా కాన్పులకు అవకాశం కల్పిస్తూ చేపట్టిన తల్లిసురక్ష పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సహజ ప్రసవానికి రూ.8వేలుశస్త్రచికిత్సకు రూ.14వేలు చెల్లించే విధంగా ఈ పథకాన్ని వర్తింప చేయనున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందించే నగదు రహిత వైద్య సేవలు పరిమితిని ఏడాదికి రూ.2.5 లక్షల నుండి రూ.లక్షలకు పెంచింది.


➥తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకంపాలమూరు-రంగారెడ్డిడిండిసీతారామ ప్రాజెక్టు నిర్మాణాల ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా పరిశీలించనున్నారు. రెండు దశల్లో సాగనున్న ఈ పర్యటనలో మొదట జనవరి ఒకటిరెండు తేదీల్లో షెడ్యూలు ఖరారైంది.
ఆసీస్‌తో బాక్సింగ్‌ డే టెస్టులో  భారత్‌ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్యంతో చివరి రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌ 261 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని భారత్‌ నిలబెట్టుకున్నట్లైంది.
➥ప్రముఖ బెంగాలీ దర్శకుడు మృణాల్‌ సేన్‌(95) కన్నుమూశారు. పద్మభూషణ్‌, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డులు అందుకున్న మృణాల్‌.. 1955 వచ్చిన రాత్‌భోరేఅనే చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత నీల్‌ అక్షర్‌ నీచే’, ‘పడాతిక్‌’, ‘భువన్‌ షోమే’, ‘అకాలర్‌ సాంధానే’, ‘ఏక్‌ దిన్‌ ప్రతిదిన్‌లాంటి ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను తెరకెక్కించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
➥అండమాన్‌ నికోబార్‌ దీవుల సముదాయంలోని మూడు దీవులకు ప్రధాని నరేంద్రమోదీ కొత్త పేర్లను ప్రకటించారు. ద రోస్‌ ఐలాండ్‌ దీవిని నేతాజీ సుభాశ్‌ చంద్రబోస్‌ ద్వీప్‌గా, ద నెయిల్‌ ఐలాండ్‌ను షాహీద్‌ ద్వీప్‌, హావ్‌లాక్‌ ఐలాండ్‌ను స్వరాజ్‌ ద్వీప్‌ అని ప్రధాని పేర్కొన్నారు.
➥బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు హింసాత్మకంగా ముగిశాయి. అవామీ లీగ్‌ పార్టీ, ప్రతిపక్షం బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఎక్కువ మంది చనిపోగా.. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. బంగ్లాదేశ్‌లో ఇవి 11వ పార్లమెంటరీ ఎన్నికలు.
➥జమ్మూకశ్మీర్లో భారత దేశ సరిహద్దు అయిన వాస్తవాధీన రేఖ వెంట మోహరించే లక్ష్యంతో పాకిస్తాన్‌ రష్యా నుంచి టీ–90లతో సహా దాదాపు 600 యుద్ధ ట్యాంకులను సమకూర్చుకుంటోంది. వీటిలో  3 కిమీల నుంచి 4 కిమీల దూరంలోని లక్ష్యాలను  కచ్చితంగా ఛేదించగల అత్యాధునిక కంప్యూటరైజ్డ్‌ ఫైర్‌ కంట్రోల్‌ వ్యవస్థ ఉంది.

పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.

  • SCHOOL ASSEMBLY:31st DEC(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈరోజు,నేటి అంశము,మంచిమాట)
  • SCHOOL ASSEMBLY:31st DEC(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 31st December Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,December month school assembly day wise,December 2018 school assembly,December 2018 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 31st December 2018 assembly, 31st December 2018 assembly,news of the day history,news of the day highlights,31st dec 2018 assembly, dec 31st assembly, dec 31st historical events, 31st December 2018 assembly, december 31st assembly, december 31st historical events,school related today assembly,school related today news, school related december 31st information, school related december month information
    Previous
    Next Post »
    0 Komentar