Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 1st February Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 1st February Information


నేటి ప్రాముఖ్యత 
భారతీయ తపాలా బీమా దినం.
భారత తీర రక్షక దళ దినోత్సవం
చరిత్రలో ఈరోజు
1977: భారత తీర రక్షక దళం ఏర్పాటయింది.
1996: ఐ.ఎన్.ఎస్. వజ్ర బాహు భారతీయ నౌకాదళంలో చేరిన తేది (ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే ముంబై లోని కార్యాలయం)
2003: అమెరికా స్పేస్‌ షటిల్ కొలంబియా, అంతరిక్షం నుండి భూమికి దిగి వచ్చేటపుడు కాలిపోయింది. ఈ దుర్ఘటనలో మరణించిన ఏడుగురిలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా ఉంది.
కొంకణ్ రైల్వే మేనేజింగ్ డైరెక్టర్, వేలాడే రైలు స్కైబస్ రూపకర్తగా ప్రసిద్ధుడు బొజ్జి రాజారాం 1945 వ సం.లో జన్మించారు.
ప్రముఖ తెలుగు చలనచిత్ర హాస్యనటుడు బ్రహ్మానందం 1956 వ సం.లో జన్మించారు.
భారత క్రికెట్ క్రీడాకారుడు అజయ్ జడేజా 1971 వ సం.లో జన్మించారు.
నేటి అంశము:
రాష్ట్రపతి అధికారాలు-ఎన్నిక
భారత రాజ్యాంగంలో రాష్ట్రపతిని గురించి 5వ భాగం, అధ్యాయం-1లోని 52-73వరకు గల నిబంధనలు వివరిస్తాయి. భారత రిపబ్లిక్ కు రాష్ట్రపతి అధ్యక్షుడు. ఆయన భారత పౌరులలో ప్రధముడు. కేంద్రంలో ప్రధాన కార్యనిర్వహణ అధికారి రాష్ట్రపతి. పార్లమెంటరీ సూత్రాల ప్రకారం రాష్ట్రపతి ప్రధాన మంత్రిని, మంత్రిమండలిని నియమిస్తాడు. వారి సలహాపైన తన అధికారాలను చెలాయిస్తాడు. కాబట్టి వాస్తవ కార్యనిర్వహణ అధికారి ప్రధాన మంత్రి. రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు.
ఎన్నిక విధానం: రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజి ఎన్నుకుం టుంది. ఈ ఎలక్టోరల్ కాలేజీలో 
1) పార్లమెంటు ఉభయ సభలలోని ఎన్నికైన సభ్యులు. 
2) రాష్ట్ర శాసన సభలలోని ఎన్నికైన సభ్యులు ఉంటారు.
సుభాషితం:
చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె
నీట బడ్డ చినుకు నీట గలిసె
బ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినురవేమ
భావం- ఆల్చిప్పలో పడ్డ స్వాతి చినుకు ముత్యంగా మారుతుంది. నీటిలోన పడిన చినుకు వ్యర్ధం అవుతుంది. అలాగే ప్రాప్తి ఉంటే తప్పకుండా ఫలితం అదే వస్తుంది.


వార్తలలోని ముఖ్యాంశాలు
పార్లమెంటులో గురువారం ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగిస్తూ, '21వ శతాబ్దానికి తగ్గట్టు భారత్‌ను శక్తిమంతమైన, స్వావలంబన దేశంగా తీర్చిదిద్దే అవకాశం ఈ ఏడాది ప్రజలకు సార్వత్రిక ఎన్నికల రూపంలో వస్తోందని, పౌరులంతా ఓటుహక్కును ఉపయోగించుకో వాలని పిలుపునిచ్చారు'.
దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ఠానికి చేరిందంటూ జాతీయ నమూనాల సర్వే కార్యాలయం తేల్చిందని గురువారం ఓ ఆంగ్ల పత్రికలో కథనం వెలువడింది. ఉపాధి కల్పన, రుణ వితరణ, ఇతర పథకాల గురించి పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటించిన రోజే ఈ వివరాలు బయటపడడం రాజకీయ వాగ్వాదాలకు దారి తీసింది.
కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం చెల్లింపునకు హైకోర్టులో రూ.250 కోట్లు డిపాజిట్‌ చేయడానికి,  ప్రత్యేక హోదా, వంశధార నిర్వాసితులపై పెట్టిన కేసులు ఎత్తివేతకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
శాసనసభ, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలను పూర్తి చేసుకొన్న తెలంగాణ రాష్ట్రం.. త్వరలోనే జిల్లా, మండల పరిషత్‌, పురపాలక సంఘాల ఎన్నికలకూ వెళ్లబోతోంది. నిర్ణీత గడువు ప్రకారం ఈ ఏడాది మే, జూన్‌ నెలల్లో ఈ ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
కేంద్రప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టబోయే తాత్కాలిక బడ్జెట్‌పై పారిశ్రామిక వర్గాల్లో గణనీయమైన ఆసక్తే వ్యక్తమవుతోంది. వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రజానీకానికి మేలు చేసే పథకాలు, కేటాయింపులు ఉంటాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
వీసా గడువు ముగిసినా అక్రమంగా నివాసం ఉంటున్న వారికోసం అమెరికా అధికారులు పన్నిన వలలో దాదాపు 600 మంది విదేశీ విద్యార్థులు చిక్కుకున్నారు. అమెరికా డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ సృష్టించిన ఫేక్‌ వర్సిటీ వలలో చిక్కుకున్న వారిలో ఎక్కువమంది భారతీయులే కాగా.. అందులో సగం తెలుగువారేనని తెలుస్తున్నది.
నాలుగో వన్డేలో టీమ్‌ఇండియాకు గట్టి షాక్‌ తగిలింది. ఫాస్ట్ బౌలర్లు ట్రెంట్‌బౌల్ట్‌, గ్రాండ్‌హోమ్‌ విజృంభించడంతో గురువారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది. కివీస్‌ పేసర్ల ధాటికి భారత్‌ మొదట 30.5 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది.

Click Here....To Download Above Information in Pdf
పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:1st February(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం)
  • SCHOOL ASSEMBLY:1st February(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 1st February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 1st February 2019 assembly, 1st February 2019 assembly,news of the day history,news of the day highlights,1st dec 2019 assembly, dec 1st assembly, dec 1st historical events, 1st February 2019 assembly, February 1st assembly, February 1st historical events,school related today assembly,school related today news, school related February 1st information, school related February month information, School Assembly 1st Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 1st Feb 2019 assembly, 1st Feb 2019 assembly,news of the day history,news of the day highlights,1st dec 2019 assembly, dec 1st assembly, dec 1st historical events, 1st Feb 2019 assembly, Feb 1st assembly, Feb 1st historical events,school related today assembly,school related today news, school related Feb 1st information, school related Feb month information
    Previous
    Next Post »
    0 Komentar