Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 21st January Information

School Assembly 21st January Information

నేటి ప్రాముఖ్యత
మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం
చరిత్రలో ఈరోజు
1972: త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం, నన్నయ్య ప్రాంగణం రాజమండ్రిలో ఆచార్యుడు, పీఠాధిపతి- ఎండ్లూరి సుధాకర్ 1959 వ సం.లో జన్మించారు.
సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు వ్లాదిమిర్ లెనిన్ 1924 వ సం.లో మరణించారు.
తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత ఇ.వి.వి.సత్యనారాయణ 2011 వ సం.లో మరణించారు.
ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాళినీ సారాభాయి 2016 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
పసుపు : ప్రాముఖ్యత
పసుపు హిందువులకి పరమ పవిత్రమైనది. పూజల్లో ముందుగా పసుపుతో చేసిన విఘ్నేశ్వరుడిని చేసి కొలుస్తారు. పూజలూ వ్రతాలూ చేసేటప్పుడు దేవీ పటాలకీ, కలశాలకీ పసుపు బొట్లు పెట్టడం తెలిసిందే. పసుపు కొట్టడంతోనే పెళ్లిపనులు మొదలవుతాయి. పెళ్లికి ముందు ఒంటికి పసుపు పూయడం మంగళప్రదమైన వేడుక. పెళ్లిపిలుపుల కార్డుకి పసుపు పూశాకే అది శుభ లేఖ. పెళ్లికి ఒకప్పుడు పసుపుపారాణే మెహందీ. పసుపు కలిపితేనే బియ్యం తలంబ్రాలవుతాయి, అక్షతలుగా మారతాయి. పెళ్లిలోని తాళీ పసుపుతాడే. బంగారు సూత్రాలు లేకున్నా పసుపు కొమ్ము ఉంటే చాలు, పెళ్లయిపోతుంది. అందుకే పసుపు అన్నమాటే మనకు ఎంతో శుభకరం..
మంచి మాట:
ఒకరి నుంచి సాయం అందుకున్నప్పటి సంతోషంకన్నా వేరొకరికి సహాయం అందించడంలో ఉన్న తృప్తే మిన్న- మదర్‌ థెరెసా
నేటి జీ.కె
ప్రశ్న: సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయసు ఎంత?
జ: 65 సంవత్సరాలు

వార్తలలోని ముఖ్యాంశాలు

> విద్యార్థులకు పరీక్షలే ప్రధానం కాదనీ, తమ ఆసక్తులను బట్టి విద్యార్థులు ఎదగాలనీ, సాంకేతికతకు బానిసలు కారాదనీ, తాత్కాలికంగా ఎదురయ్యే అవరోధాలను చూసి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రధాని మోదీ విద్యార్థులకు పిలుపునిచ్చారు.
> ఏ.పి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడు రోజులు, శాసనమండలి సమావేశాలు రెండు రోజులు నిర్వహించాలని బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నిర్ణయం తీసుకుంది.
> అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయపరమైన రాజధానిగా ఏర్పాటు చేసేందుకు, అలాగే ప్రాంతీయ ప్రణాళిక అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేసేందుకు ఏ.పి. కేబినెట్‌ ఆమోదం తెలిపింది. హైపవర్‌ కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది.
> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను సోమవారం శాసనసభ ఆమోదించింది. ఇదిలా ఉండగా నేడు శాసనమండలిలో అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది.
> అమరావతి ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూకుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గుతేల్చాలని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సీఎం వైఎస్‌ జగన్‌కి సూచించారు.
> తెలంగాణలో అమలు చేయనున్న రబీ రైతుబంధు పథకానికి రూ.5,100 కోట్ల నిధులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు.
> తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సాదక బాధలను తెలుసుకుని వారికి ఉపశమనం కల్పించే చర్యల కోసం ప్రభుత్వానికి సిఫారసు చేయాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్ణయించారు.
>మన దేశ జనాభాలో 70 శాతం జనాభాతో పోలిస్తే 1 శాతం కుబేరుల సంపద ఏకంగా నాలుగు రెట్లు పైగా ఉందని, దేశీయంగా 63 మంది బిలియనీర్ల మొత్తం సంపద విలువ.. పూర్తి ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ ను మించిందని మానవ హక్కుల సంస్థ ఆక్స్‌ ఫామ్‌ నివేదిక తెలిపింది.
> భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 11వ జాతీయ అధ్యక్షుడిగా జగత్‌ ప్రకాశ్‌ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
> ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌5 )లో భాగంగా సోమవారం జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌ 25తో చెన్నై సూపర్‌ స్టార్స్‌ జట్టు చేతిలో ఓడింది. సింధు మాత్రమే హైదరాబాద్‌ తరఫున గెలిచింది.
School Assembly 21st January Information, School Assembly,prayer songs, Assembly information, historical events,information of the day, news of the day, golden words, today golden words
Previous
Next Post »
0 Komentar

Google Tags