Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 29th January Information

School Assembly 29th January Information


చరిత్రలో ఈరోజు
1780: భారత్ లో మొట్టమొదటి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజెట్ ప్రచురింపబడింది.
1939:: రామకృష్ణ మఠం ప్రారంభించబడింది.
1953: భారత సంగీత నాటక అకాడమీ స్థాపించబడింది.
1979లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత అబ్దుస్ సలం 1926 వ సం.లో జన్మించారు.
తెలుగు సినీ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి 1936 వ సం.లో జన్మించారు.
కవి, నవలా రచయిత, వ్యాసకర్తగా ప్రసిద్ధులు రేవూరి అనంత పద్మనాభరావు 1947 వ సం.లో జన్మించారు.
నేటి అంశము:
Cache Memory అంటే ఏమిటి ?
కంప్యూటర్లో లేదా మొబైల్ లో మైక్రోప్రాసెసర్ డేటా కోసం RAM మీద ఆధారపడుతుంది. Processor స్పీడుకు తగినట్లు RAM డేటాను అందించలేనపుడు ప్రోసెసర్ కు RAMకు మధ్యలో ఏర్పాటు చేసిన మెమరీని Cache Memory అంటారు. Cache Memory RAM నుండి డేటాను తీసుకొని తనలో నిల్వ ఉంచుకొని ప్రోసెసర్ వేగానికి తగినట్లు డేటాను అందిస్తుంది.
మంచి మాట/సుభాషితం:
ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహం చూపినవాడే నిజమైన బలశాలి- గాంధీజీ
నేటి జీ.కే.
భారతదేశంలో పోర్చుగీసు వారి మొదటి రాజధాని ఏది?

జ. కొచ్చిన్


వార్తలలోని ముఖ్యాంశాలు
*”వైఎస్సార్‌ కాపు నేస్తం” ద్వారా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజికవర్గాల మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం ఏటా రూ.15 వేల చొప్పున అందించడానికి ఏ.పి. ప్రభుత్వం సిద్ధమైంది.
*ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 54.64 లక్షల మందికిపైగా  పేదలకు ఇంటివద్దే పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ఏ.పి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
*మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్‌ లను నియంత్రించడానికి ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు కోటి మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
*30 ఎకరాల విస్తీర్ణంలో, ఏకకాలంలో లక్ష మంది వరకు ధ్యానం చేసుకునేందుకు వీలుగా ప్రపంచంలోనే అతిపెద్దదైన ధ్యానమందిరం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం లో ప్రారంభమైనది.
*తెలంగాణలో ఎత్తిపోతల పథకాలు, భగీరథకు వచ్చే ఐదేళ్ల పాటు రూ.52,700 కోట్ల మేర ప్రత్యేక గ్రాంట్లు కేటాయించాలని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 15వ ఆర్థిక సంఘాన్ని కోరారు.
*తెలంగాణలో కరోనా వైరస్ ఉన్నట్టు ఇంకా ఎలాంటి నిర్దారణ కాలేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.
*పాకిస్తాన్‌ను మట్టికరిపించడానికి భారత సైనిక దళాలకు వారం, పది రోజులు చాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు.
*చారిత్రక తప్పిదాన్ని సరిచేయడానికే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
*అమెరికాలో గ్రీన్‌కార్డ్‌ నిబంధనలకు ఆదేశ సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. దీని ద్వారా ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్న వలసదారులకు గ్రీన్‌ కార్డ్‌ ను నిరాకరించనున్నారు.
*కెరీర్‌లో పైకి ఎదిగే క్రమంలో దగ్గరి దారులు వెతకవద్దని, సవాళ్లు ఎదురైనప్పుడు మోసం చేసైనా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయవద్దని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ యువ ఆటగాళ్లకు సూచించాడు.
*ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌లో యువ భారత్‌ ఆస్ట్రేలియాను  ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

*ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌, జొకోవిచ్‌ లు విజయం సాధించి సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. మహిళల సింగిల్స్‌ విభాగంలో యాష్లే బార్టీ (ఆ్రస్టేలియా), సోఫియా కెనిన్‌ (అమెరికా) తొలిసారి సెమీఫైనల్‌కు చేరారు. మిక్స్‌ డ్‌ డబుల్స్‌ లో లియాండర్‌ పేస్‌ (భారత్‌)జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) జంట ఓడిపోయింది.
School Assembly 29th January Information, School Assembly, prayer songs, Assembly information, historical events, information of the day, news of the day, golden words, today golden words, moral sentences, today's importance, headlines in the news, January month school assembly day wise, January 2020 school assembly, January 2020 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 29th January 2020 assembly, 29th January 2020 assembly
Previous
Next Post »
0 Komentar

Google Tags