Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 3rd January information

School Assembly 3rd January informationనేటి ప్రాముఖ్యత
మహిళా టీచర్స్ డే.
చరిత్రలో ఈరోజు
1985వ సం.లో రవిశాస్త్రి ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
1999 వసం.లో ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు.
భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు రచయిత్రి సావిత్రిబాయి ఫూలే 1831 వ సం.లో జన్మించారు.
ప్రసిద్ధ మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత బ్రహ్మ ప్రకాష్ 1984 వ సం.లో మరణించారు.
స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత క్రొవ్విడి లింగరాజు 1986 వ సం.లో మరణించారు.
భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ 2002 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
అసలు చెట్లు ఎలా శ్వాసిస్తాయి ...?
పగటి పూట పచ్చని చెట్లు గాలిలోగల బొగు పులుసు వాయువును గ్రహించి ప్రాణవాయువును బయటికి వదిలివేస్తాయి. జంతువులు మాత్రం దీనికి విరుద్ధంగా ప్రాణవాయువును గ్రహించి బొగ్గుపులుసు వాయువును విడుస్తాయి. అయితే చెట్లలో రాత్రి పూట బొగ్గుపులుసు వాయువును పీల్చే ప్రక్రియ ఆగిపోతుంది. అప్పుడు మాత్రం అవి ప్రాణవాయువును విడుదల చేస్తాయని సరిగ్గా జంతువులలాగే శ్వాసిస్తాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.
నిజానికి అసలు పగటిపూట అవి బొగ్గుపులసు వాయువును గ్రహించడం వాటి శ్వాసప్రక్రియ కాదు. ఇది ఆహారం సంపాదించు కొనే ప్రక్రియ. పగలు కూడా నిజానికి జంతువులలాగ అవి శ్వాసి స్తూనే వుంటాయి. కాని ఆ శ్వాస ప్రక్రియలో అది వదిలే బొగ్గు పులుసుగాలి అధిక ప్రమాణంలో వెలువడే ప్రాణవాయువులో మరుగున పడిపోతూ వున్నది.


మంచి మాట:
వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే, అతడు ఎన్నో కఠిన పరీక్షల్ని ఎదుర్కొని నిలిచాడని అర్థం- ఆస్కార్‌ వైల్డ్‌
వార్తలలోని ముఖ్యాంశాలు
రఫేల్‌ వ్యవహారంపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిరాకరించింది. ఇదిలా ఉండగా ఓ ఆడియో టేపు ఆధారంగా ఇందుకు సంబంధించిన మొత్తం దస్త్రాలన్నీ అప్పటి రక్షణ మంత్రి, ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ పడకగదిలో ఉన్నాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. 
శతాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయాల్ని తోసిరాజని హిందూ సంస్థల సవాళ్లను ధిక్కరిస్తూ శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి బుధవారం తెల్లవారుజామున 44 ఏళ్ల వయసున్న కనకదుర్గ, 42 ఏళ్ల వయసున్న బిందు పోలీసుల సాయంతో ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్నారు.
దేనా బ్యాంక్‌, విజయా బ్యాంక్‌లను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం చేయడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఏప్రిల్‌ 1 నుంచి  కార్యకలాపాలు  సాగించనున్న విలీనబ్యాంక్‌ ఆస్తుల పరంగా దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకు అవతరించనుంది.
చైనా తన మిత్ర దేశమైన పాకిస్థాన్‌ కోసం ఆయుధ సంపత్తికి సంబంధించి కుదిరిన ప్రధాన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా అత్యాధునిక యుద్ధనౌకలు తయారు చేస్తోంది. పాక్‌ కోసం చైనా తయారు చేస్తున్న ఈ యుద్ధ నౌకలో అత్యాధునిక డిటెక్షన్‌, ఆయుధ వ్యవస్థల‌ను ఏర్పాటు చేస్తోంది.
తెలంగాణా రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం మరో రెండు కొత్త జిల్లాలు (భూపాలపల్లి జిల్లాను విభజించి ములుగు, మహబూబ్‌నగర్‌ జిల్లాను విడదీసి నారాయణపేట జిల్లాల) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా నిజామాబాద్‌ జిల్లాలో చండూరు, మోస్రా, మేడ్చల్‌ జిల్లాలో మూడుచింతలపల్లి, సిద్దిపేట జిల్లాలో నారాయణరావుపేట మండలాలు కొత్తగా ఏర్పాటయ్యాయి.
అంతరిక్షంలో మరో వింత చోటు చేసుకోబోతుంది. గురువారం భూమి సూర్యుడికి సమీపంగా చేరబోతుంది. ఖగోళ పరిభాషలో సూర్యుడికి భూమి సమీపంగా వెళ్లటాన్ని పెరిహిలియన్‌ అని, దూరంగా వెళ్లటాన్ని అపిలియన్‌ అని పిలుస్తుంటారు.
బ్యాంకు ఖాతాలను తెరుచుకునేందుకు, మొబైల్‌ ఫోన్‌ కనెక్షన్లు పొందేందుకు ఇక ఆధార్‌ తప్పనిసరికాదు. ధ్రువీకరణ నిమిత్తం దీనిని స్వచ్ఛందంగానే సమర్పించుకునేందుకు వీలు కల్పించే ఆధార్‌-ఇతర చట్టాల సవరణ బిల్లు-2018ను బుధవారం కేంద్ర న్యాయ, ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.


పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:3rd January(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈరోజు,నేటి అంశము,మంచి మాట)
  • SCHOOL ASSEMBLY:3rd January(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 3rd January Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,January month school assembly day wise,January 2019 school assembly,January 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 3rd January 2019 assembly, 3rd January 2019 assembly,news of the day history,news of the day highlights,3rd dec 2019 assembly, dec 3rd assembly, dec 3rd historical events, 3rd January 2019 assembly, january 3rd assembly, january 3rd historical events,school related today assembly,school related today news, school related january 3rd information, school related january month information, School Assembly 3rd Jan Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Jan month school assembly day wise,Jan 2019 school assembly,Jan 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 3rd Jan 2019 assembly, 3rd Jan 2019 assembly,news of the day history,news of the day highlights,3rd dec 2019 assembly, dec 3rd assembly, dec 3rd historical events, 3rd Jan 2019 assembly, jan 3rd assembly, jan 3rd historical events,school related today assembly,school related today news, school related jan 3rd information, school related jan month information?Ganitotsavam(maths day)-2019 questions for District Level Quiz
    Previous
    Next Post »
    0 Komentar