Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 5th January information

School Assembly 5th January information


నేటి ప్రాముఖ్యత 
అమెరికా జాతీయ పక్షి దినోత్సవం.
చరిత్రలో ఈరోజు
➥భారతదేశంలో అమ్మకపు పన్ను చట్టం 1957 సం. నుండి అమల్లోకి వచ్చింది.
➥మొట్టమొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ ఆస్ట్రేలియా, ఇంగ్లండుల మధ్య 1971 సం. లో జరిగింది. 
➥మొఘల్ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి షాజహాన్ 1592 వ సం.లో జన్మించారు.
➥రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ఆర్. కృష్ణసామి నాయుడు 1902 వ సం.లో జన్మించారు.
➥మొదటి పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రిణి మమతా బెనర్జీ 1955 వ సం.లో జన్మించారు.
➥మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ 1531 వ సం.లో మరణించారు.
➥స్వాతంత్ర్య సమరయోధులు, కవి, సంస్కృతాంధ్ర పండితులు గరికపాటి మల్లావధాని 1985 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
ధ్యానం-ఉపయోగాలు
ధ్యానం మనస్సును మరియు శరీరాన్ని శాంత పరుస్తుంది. శరీరానికి పుష్కలంగా ప్రాణశక్తిని అందిస్తుంది. శరీరాన్ని తేజస్సుతో నింపుతుంది. కాలక్రమంలో ఆత్మ జ్ఞానాన్ని క్రమక్రమముగా వికసింప చేస్తుంది. ప్రకృతి బంధాల నుండి వీలయినంతగా విడిపడి స్వేచ్చా జీవితాన్ని జీవాత్మ పొందేలా ధ్యానం సహకరిస్తుంది. ఉదయం 4 గంటల నుండి 8 గంటలలోపు, సాయంత్రం 5.30 నుండి రాత్రి 8.30 వరకు ఈ సమయంలో దైవశక్తి ఎక్కువగా భూమిపై ప్రసరిస్తుంది కాబట్టి ధ్యానానికి చాలా అనుకూల మైన సమయం. కనుక ఈ సమయంలో ధ్యానం చేయటం ఉత్తమంగా భావించబడుతుంది. ధ్యానమును ఎంత సాధన చేస్తే అంత మంచిది. ఎంత సేపు అనేది మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.
మంచి మాట:
నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే - అబ్దుల్‌ కలాం


వార్తలలోని ముఖ్యాంశాలు
రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై దాడిని ముమ్మరం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా శుక్రవారం పార్లమెంటు లోపలా, బయటా విమర్శల వర్షాన్ని కురిపించింది.
పుట్టుకతోనే కడుపులో పిండంతో జన్మించింది ఓ పసికందుకు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి ప్రాణాలను నిలబెట్టింది నిలోఫర్‌ ఆసుపత్రి వైద్య బృందం. తల్లి గర్భంలో ఉండగానే శిశువు పొట్టలోకి చేరిన పిండం, తల్లి ప్రసవించిన తర్వాత శిశువు పొట్టలో క్రమంగా పెరగసాగింది.
తూర్పుతీరంలో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద గల కోన గ్రామంలో జీఎంఆర్‌ కాకినాడ గేట్‌వే పోర్ట్‌ లిమిటెడ్‌ నిర్మించనున్న నౌకాశ్రయానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు. 
విశాఖపట్నం విమానా శ్రయంలో గత ఏడాది అక్టోబర్‌ 25న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.
భారత తృణధాన్యాల పరిశోధనా సంస్థ’(ఐఐఎంఆర్‌)తో కలసి రాగి సంకటి, జొన్నరొట్టెలు, కొర్రల అన్నం, సామలతో బిస్కట్లు...ఇలా పోషక విలువలుండే ఆహారోత్పత్తులను ప్రోత్సహించాలని, ఆ పంటల సాగును పెంచాలనే కార్యాచరణ ప్రణాళికకు తెలంగాణ ప్రభుత్వం తుది రూపు దిద్దుతోంది.
దిల్లీలోని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌ అండ్‌ పవర్‌ వార్షికోత్సవం సందర్భంగా నీటిపారుదల, విద్యుత్‌ రంగాల్లో కృషి చేసిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పురస్కారాలు ప్రదానం చేసింది. పోలవరం ప్రాజెక్టు ఉత్తమ ప్రణాళిక, నిర్మాణానికి ఏపీ నీటిపారుదల శాఖకు, మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం చేసిన కృషికి తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖకు అవార్డులు దక్కాయి.
ఆస్ట్రేలియాలో తొలి సిరీస్‌ విజయం కోసం తహతహలాడుతున్న టీమ్‌ ఇండియా.. లక్ష్యానికి మరింత చేరువైంది. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాలో టెస్టు శతకం సాధించిన తొలి భారత  వికెట్‌కీపర్‌గా రిషబ్‌ పంత్‌ ఘనత సాధించాడు


పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:5th January(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈరోజు,నేటి అంశము,మంచి మాట)
  • SCHOOL ASSEMBLY:5th January(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 5th January Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,January month school assembly day wise,January 2019 school assembly,January 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 5th January 2019 assembly, 5th January 2019 assembly,news of the day history,news of the day highlights,5th dec 2019 assembly, dec 5th assembly, dec 5th historical events, 5th January 2019 assembly, january 5th assembly, january 5th historical events,school related today assembly,school related today news, school related january 5th information, school related january month information, School Assembly 5th Jan Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Jan month school assembly day wise,Jan 2019 school assembly,Jan 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 5th Jan 2019 assembly, 5th Jan 2019 assembly,news of the day history,news of the day highlights,5th dec 2019 assembly, dec 5th assembly, dec 5th historical events, 5th Jan 2019 assembly, jan 5th assembly, jan 5th historical events,school related today assembly,school related today news, school related jan 5th information, school related jan month information
    Previous
    Next Post »
    0 Komentar

    Google Tags