Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Swami Vivekananda Biography

Vivekananda Biography


వివేకానంద బయోగ్రఫీ
స్వామీ వివేకానంద జవవరి 12, 1863 న జన్మించాడు. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే.
బాల్యం
బాలుడిగా ఉన్నపుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. పుట్టగానే పువ్వుపరిమళిస్తిందన్నట్లుగా చిన్నప్పటీ నుంచే అతనికి నిస్వార్థ గుణం, మరియు ఔదార్య గుణాలు అలవడ్డాయి. నరేంద్రుడు ఏకసంథాగ్రాహి పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. అతని జ్ఞాపకశక్తి అమోఘమైనది. రోజు రోజుకూ అతని జ్ఞాన తృష్ణ అధికంకాసాగింది. దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవాడు. చరిత్ర మరియు సైన్సు తోపాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టాడు.
రామకృష్ణ పరమహంసతో పరిచయం
ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి  రామకృష్ణ పరమహంస కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. ఆ సందర్భంలో నరేంద్రుడు పాడిన పాటలకు ముగ్దుడైన రామకృష్ణ పరమహంస ఇన్ని రోజులుగా నీ కోసం చూసి చూసి అలసి పోయాను. నా అనుభావలన్నింటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను. నీవు సామాన్యుడవు కావు. సాక్షాత్తు భువికి దిగివచ్చిన దైవ స్వరూపుడవు. నీ గురించి నేనెంతగా తపించానో తెలుసా? అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు.
కుటుంబ బాద్యతలు
తండ్రి మరణించిన తరువాత నరేంద్రుని కుటుంబాన్ని పేదరికం ఆవరించింది. నరేంద్రుడు కొద్దిరోజులపాటు పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. బోధకుడిగా పనిచేస్తూనే తన న్యాయ విద్యను కొనసాగించాడు. గురువుగారి ఆరోగ్యం క్షీణించడంతో నరేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండు మానేసి గురు శుశ్రూషలో మునిగిపోయాడు. రామకృష్ణులవారు చనిపోయిన తరువాత ఆయన శిష్యులందరూ కలిసి రామకృష్ణ మఠం స్థాపించడం జరిగింది. నరేంద్రుడు కూడా సన్యాసిగా మారి ఆ మఠానికి నాయకుడయ్యాడు.


వివేకానందుడిగా మార్పు
నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశపు ఆధ్యాత్మిక విలువల్ని వారికి వివరించడం తన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాడు. అతని ప్రయాణానికి ఖర్చుల నిమిత్తం దేశం నలుమూలల నుంచీ విరాళాలు వచ్చి పడ్డాయి. అతను ఎక్కిన నౌక బొంబాయి తీరం నుంచి 1893, మే 31వ తేదీన బయలు దేరింది .
విదేశాలలో
స్వామీజీ చికాగో సదస్సు 1893, సెప్టెంబర్ 11న హాజరైనాడు.  దేశవిదేశాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు అక్కడ చేరారు. వివేకానంద వారందరిలోకెల్లా చిన్నవాడు. ఆయన దగ్గర ముందుగా తయారు చేసిన ఉపన్యాసం లేదు. అమెరికా దేశపు ప్రియ సహోదరులారా! అని స్వామీజీ తన మృధు మధుర కంఠస్వరంతో ప్రసంగాన్ని మొదలు పెట్టగానే సభ మూడు నిమిషాలపాటు చప్పట్లతో దద్దరిల్లింది. అటువంటి మనీషి యుగానికి ఒకరే పుడతారు. ఆయన బోధనలను వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం వార్తాపత్రికలు ఆయన వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. అక్కడి ప్రజలకు ఆయన ఆరాధ్యుడయ్యాడు. స్వామీజీ కృషి వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది.  ఇంగ్లాండు నుంచి కూడా ఆయనకు ఆహ్వానం లభించింది. నాలుగు సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తరువాత స్వామీజీ తిరిగి భారతదేశానికి విచ్చేశాడు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దశదిశలా వ్యాపించిపోయింది. అదే స్ఫూర్తితో, లక్ష్యంతో1897లో రామకృష్ణ మఠాన్నిస్థాపించాడు. ఈ మఠం తరువాత శాఖోపశాఖలుగా విస్తరించింది.
ముఖ్య సూత్రములు, తత్త్వములు
రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రముగా మారింది. రామకృష్ణా మిషన్ (రామకృష్ణా మఠము) ను "వ్యక్తి మోక్షమునకు, ప్రపంచ హితమునకు" అనే నినాదము మీద స్థాపించాడు. అన్ని మతాలు ఒకే సనాతన ధర్మం యొక్క అంశాలు.
స్వామి వివేకానందుని స్ఫూర్తి వచనాలు
మందలో ఉండకు ..వందలో ఉండటానికి ప్రయత్నించు..
ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు..
కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు
మతం అనేది సిద్దాంత రాద్దాంతాలలో లేదు .. అది ఆచరణలో ఆద్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది.
ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది..
మరణం
అవిశ్రాంతంగా పని చేయడం వలన స్వామి ఆరోగ్యం దెబ్బతిన్నది. జులై 4, 1902న యధావిధిగా ఆయన రోజూవారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాడు. రాత్రి 9 గంటల సమయంలో ఆయన అలసిపోయినట్లుగా కనిపించాడు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది.చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి ముప్పై తొమ్మిధి ఏళ్ళ వయసు లోనే జారుకున్నాడు.
గుర్తింపు
భారతదేశ ఔన్నత్నాన్ని ప్రపంచ దశదిశలా చాటిన స్వామీ వివేకానంద జన్మించిన జనవరి 12 న భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.


 Vivekananda Biography,Vivekananda Biography in telugu,vivekananda biography pdf,vivekananda biography wikipedia,vivekananda a biography,vivekananda a biography by swami nikhilananda,autobiography of vivekananda,vivekananda a biography in pictures,vivekananda a born leader,vivekananda a born leader pdf,swami vivekananda all biography,vivekananda biography book pdf, vivekananda brief biography,vivekananda biography download,vivekananda born date,vivekananda born day,vivekananda biography in telugu download, vivekananda biography in telugu pdf download,vivekananda biography telugu,vivekananda biography telugu pdf,swami vivekananda biography essay,vivekananda full biography,vivekananda biography pdf free download
Previous
Next Post »
0 Komentar