Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 14th February Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 14th February Information


నేటి ప్రాముఖ్యత 
ప్రేమికుల దినోత్సవం.
చరిత్రలో ఈరోజు
2018 - అంతర్జాతీయ మైనింగ్ సదస్సు - హైదరాబాదులో ప్రారంభమైనది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 1921 వ సం.లో జన్మించారు.
వ్యవసాయ శాస్త్రవేత్త, ఎత్తిపోతల పథకం రూపకర్త  ఘంటా గోపాల్‌రెడ్డి 1932 వ సం.లో జన్మించారు.
భారతీయ జనతా పార్టీ ప్రముఖ మహిళా నాయకురాలు సుష్మాస్వరాజ్ 1952 వ సం.లో జన్మించారు.
ఆంగ్ల-నావికుడు, సముద్ర యానికుడు, సాహస యాత్రికుడు జేమ్స్ కుక్ 1779 వ సం.లో మరణించారు.
ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు 1983 వ సం.లో మరణించారు.
ప్రముఖ నవలా రచయిత డిక్ ఫ్రాన్సిస్ 2010 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
చాన్నాళ్లు బతికేస్తాం!
ఏ జీవి అయినా కొంతకాలమే బతుకుతుందనుకుంటాం. కానీ అకశేరుక జెల్లీలు ఎంచక్కా దీర్ఘకాలం బతికేస్తున్నాయ్. మెడిటేరియన్ సముద్రంలో ఉండే టుర్రిటోప్సిస్ దోర్హిని' అనే జెల్లీ చేపను మాత్రం చావును జయించిన జీవి' (immortal jellyfish)గా చెబుతారు. ఈ జీవి 4.5 మి. మీ పొడవుతో ప్రౌఢ దశకు చేరిన తర్వాత తన జీవితాన్ని ముగించకుండా జువేలినైన్ పోల్స్ అనే లార్వా దశకు చేరుకుంటుంది. అలా తన జీవితాన్ని మళ్లీ మొదలు పెడుతుందన్నమాట. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుంది. వేరే చేపలకు ఆహారంగా మారినప్పుడో, లేద ఏదైనా వ్యాధికి గురైనప్పుడో తప్ప దోర్షిని జెల్లి ఫిష్ చనిపోవడం జరగదట.
మంచి మాట /సుభాషితం:
సద్గోష్ఠి సిరియు నొసగును
సద్గోష్ఠ్యె కీర్తి బెంచు సంతుష్టిని నా
సద్గోష్ఠియె యొనగూర్చును
సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా!
భావం - ఓ కుమారా! సజ్జనులు, సత్ఫురుషుల సభలలోనే మంచి జ్ఞానమును సంపదిస్తారు. దానివలన సిరి సిద్ధించును సద్గోష్ఠి వలన కీర్తి పెరుగును, సంతృప్తి కలుగుతుంది. సద్గోష్ఠి వలన సర్వపాపములు సమసిపోవును.


వార్తలలోని ముఖ్యాంశాలు
'అన్నదాతా సుఖీభవ పథకం' కింద ప్రతి రైతు కుటుంబానికీ  కేంద్రం ప్రకటించిన రూ.6వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4వేలు మొత్తం రూ.10వేలు ఇవ్వాలని ఏపీ కేబినెట్‌ తీర్మానించింది. కేంద్ర పథకానికి అర్హులు కాని రైతులకు పూర్తిగా రూ.10 వేలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. కౌలు రైతులూ ఇందుకు అర్హులుగా పేర్కొంది.
విమాన ప్రయాణికుల సంఖ్యపరంగా దేశంలో తెలంగాణ 6, ఆంధ్రప్రదేశ్‌ 13వ స్థానాల్లో నిలిచాయి. 2017తో పోలిస్తే 2018లో ఏపీలో ప్రయాణికుల వృద్ధి 36.3% మేర ఉంది. ఇదే సమయంలో తెలంగాణలో 26.4% మేర వృద్ధి నమోదయింది.
'ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి తెలంగాణ రాష్ట్రంలో అర్హులను గుర్తించే పని ప్రారంభమైంది. ఈ పథకం కింద  రైతుల ఖాతాల్లో ఈ నెల 24న నిధుల జమ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో అందుకు అనుగుణమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
➥‘బిహార్‌-ఝార్ఖండ్‌ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ ఆర్థికంగా, నైతికంగా, అన్ని రకాలుగా దిగజారిందని, పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ, కేంద్ర మిలటరీ కమిషన్‌ సభ్యుడు  సుధాకర్‌ వెల్లడించారు.
స్వైన్‌ఫ్లూ కారక 'హెచ్‌1ఎన్‌1 వైరస్‌ వాతావరణంలో ఎక్కువ కాలం జీవించగలిగే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్లుగా వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో భారత్ లో ఇప్పటికే 489 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవడం, దీని  కారణంగా 6గురు మృత్యువాతపడటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
అసోంలోని దరంగ్‌ జిల్లాకు చెందిన ప్రస్తన్న దేకా అనే యువకుడు రూ.85వేల ఖర్చుతో నీటితో నడిచే కారును రూపొందించాడు. ఈ కారును రూపొందించే ప్రక్రియలో 55 సార్లు విఫలమయినప్పటికి పట్టు విడువక చివరికి విజయం సాధించాడు.  
ఫిబ్రవరి14 జరుపుకునే ప్రేమికుల దినోత్సవం మన భారతీయ సంప్రదాయమే కాదు. ఇదో పాశ్చాత్య పండగ. ఈ మధ్య కాలంలో పాశ్చాత్య దేశాలకంటే ఎక్కువగా భారతదేశంలో జరుపుకొంటున్నారు. అయితే ఈ ప్రేమికుల దినోత్సవాన్ని ఆస్వాదించేవాళ్లు ఎంతమంది ఉన్నారో వ్యతిరేకించే వాళ్లు అంతకంటే ఎక్కువే ఉన్నారు.


పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:14th February(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం)
  • SCHOOL ASSEMBLY:14th February(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 14th February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 14th February 2019 assembly, 14th February 2019 assembly,news of the day history,news of the day highlights,14th dec 2019 assembly, dec 14th assembly, dec 14th historical events, 14th February 2019 assembly, February 14th assembly, February 14th historical events,school related today assembly,school related today news, school related February 14th information, school related February month information, School Assembly 14th Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 14th Feb 2019 assembly, 14th Feb 2019 assembly,news of the day history,news of the day highlights,14th dec 2019 assembly, dec 14th assembly, dec 14th historical events, 14th Feb 2019 assembly, Feb 14th assembly, Feb 14th historical events,school related today assembly,school related today news, school related Feb 14th information, school related Feb month information
    Previous
    Next Post »
    0 Komentar