Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 25th February Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 25th February Information


చరిత్రలో ఈరోజు
2008: క్యూబా అధ్యక్షుడిగా ఫిడెల్ కాస్ట్రో సోదరుడు రాల్ క్యాస్ట్రో ఎన్నికయ్యాడు.
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు సుబ్రతా బోస్ 1932 వ సం.లో జన్మించారు.
ప్రముఖ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 1961 వ సం.లో మరణించారు.
ప్రసిద్ధ కవి, రచయిత, పాత్రికేయుడు ఏల్చూరి సుబ్రహ్మణ్యం 1995 వ సం.లో మరణించారు.
తెలుగు సినీనిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.నాగిరెడ్డి 2004 వ సం.లో మరణించారు.
స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు కాటం లక్ష్మీనారాయణ 2010 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే-పొడుపు కథ దాని వివరణ
దేవుడి పెళ్లి అంటే ఉత్సవ విగ్రహాలకు వివాహం చేయటం. అటువంటి పెండ్లిలో దేవతా విగ్రహాలు ఏమీ మాట్లాడవు. కనుక ప్రతివారూ ఏదో పెత్తనం చేయటానికి ప్రయత్నిస్తారు. సామూహిక కార్యక్రమాల్లో కూడా అందరూ పెత్తనం చేయటానికి ప్రయత్నిస్తారు. కనుక ఈ సందర్భంగా ఈ సామెత పుట్టింది.
మంచి మాట /సుభాషితం:
ధనవంతుడె కులవంతుడు
ధనవంతుడె సుందరుండు ధనవంతుండే
ఘనవంతుడు బలవంతుడు
ధనవంతుడె ధీరుడనుచు దలచె కుమారా!
భావం - ఈ లోకమునందు ధనవంతుడిని అన్ని మంచి లక్షణాలు కల ఉత్తముడుగా భావిస్తారు. సంపద కలవాడినిగా , గొప్ప కులంలో జన్మించినవాడినిగా అందగాణ్ణిగా బలవంతునిగా, ధైర్యశాలిగా భావిస్తారు.


వార్తలలోని ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ శాసనమండళ్లలో ఎనిమిది స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుందని ఈసీ స్పష్టం చేసింది.
పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌ ప్రాంతానికి వెళ్లే మార్గంలోని ప్రధాన రహదారి బీటలు వారి కుంగిపోయింది. స్పిల్‌ ఛానల్‌ ప్రాంతంలో బెడ్‌ లెవల్‌లో మట్టి తవ్వకం పనుల దృష్ట్యా భూమి పైభాగం నుంచి ఒత్తిడి ఏర్పడటం వల్ల రోడ్డు కుంగిపోయి ఉంటుందని భావిస్తున్నారు.
పీఎం కిసాన్‌ పథకం కింద ఆదివారం తెలంగాణ రైతుల ఖాతాల్లో రూ.100 కోట్లను కేంద్ర వ్యవసాయశాఖ జమ చేసింది. దాదాపు 5 లక్షల మంది రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేసినట్లు తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో బడిఈడు పిల్లల నమోదులో జాతీయస్థాయిలో పైమెట్టున నిలుస్తున్నా, విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలు తక్కువగా ఉన్నట్లు నీతి ఆయోగ్‌ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోంది.
ఇళ్ల కొనుగోలుదార్లకు ఊరట కలిగించేలా నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీ శాతాన్ని 12 శాతం నుంచి 5 శాతానికి; అందుబాటు ధరల్లో ఉన్న ఇళ్లపై పన్నును 8 శాతం నుంచి 1 శాతానికి తగ్గించనున్నట్లు జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకొంది.
ఆరు తెగలకు శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలన్న ప్రభుత్వ కమిటీ సిఫార్సులను వ్యతిరేకిస్తూ అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఆరంభమైన ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. రాజధాని ఈటానగర్‌లో ముఖ్యమంత్రి పెమా ఖండూకు చెందిన నివాసంపై దాడి ఘటనలో ఇద్దరు యువకులు పోలీసు కాల్పులలో మరణించారు.
ఆదివారం విశాఖలోని ఏసీఏ- వీడీసీఏ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.
భారత యువ షూటర్ సౌరభ్‌ చౌదరి 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్లో 245 పాయింట్ల తో స్వర్ణం సాధించాడు. దీనితో భారత్‌ ఒక ఒలింపిక్‌ కోటా బెర్తు సాధించినట్లయినది.


పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:25th February(చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం)
  • SCHOOL ASSEMBLY:25th February(వార్తలలోని ముఖ్యాంశాలు)


  • School Assembly 25th February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 25th February 2019 assembly, 25th February 2019 assembly,news of the day history,news of the day highlights,25th dec 2019 assembly, dec 25th assembly, dec 25th historical events, 25th February 2019 assembly, February 25th assembly, February 25th historical events,school related today assembly,school related today news, school related February 25th information, school related February month information, School Assembly 25th Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 25th Feb 2019 assembly, 25th Feb 2019 assembly,news of the day history,news of the day highlights,25th dec 2019 assembly, dec 25th assembly, dec 25th historical events, 25th Feb 2019 assembly, Feb 25th assembly, Feb 25th historical events,school related today assembly,school related today news, school related Feb 25th information, school related Feb month information
    Previous
    Next Post »
    0 Komentar