Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 5th February Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 5th February Information

చరిత్రలో ఈరోజు
1884: హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ ఆలీ ఖాన్ పట్టాభిషేకం
2008: వన్డే క్రికెట్ లో సచిన్ టెండుల్కర్ 16000 పరుగులు పూర్తి చేసిన ఘనతను పొందినాడు.
ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు 1915 వ సం.లో జన్మించారు.
బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ 1920 వ సం.లో జన్మించారు.
ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత వట్టికోట ఆళ్వారుస్వామి 1961 వ సం.లో మరణించారు.
రాయలసీమ కవికోకిలగా ప్రసిద్ధి చెందిన కవి బెళ్లూరి శ్రీనివాసమూర్తి 1988 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
కార్డ్ పెట్టగానే ఎ.టి.ఎమ్. దాన్నెలా గుర్తిస్తుంది ?
కార్డ్ ను తిప్పి చూస్తే దాని వెనకాల దీర్ఘచతురస్రాకారంలో ఉన్న నల్లటి పట్టీ మెరుస్తూ కనబడుతుంది. అది అయస్కాంత పట్టీ (మాగ్నటిక్ స్టిప్) ఖాతాదారుడికి సంబంధించిన ఖాతా వివరాలు, పిన్ నెంబర్ అందులో అయస్కాంత గుర్తులుగా నమోదై ఉంటాయి. కార్డును ఎ.టి.యమ్ లో ఉంచగానే మిషన్లోని రీడర్ పట్టీ లోని వివరాలన్నీ స్వీకరించి పరిశీలించి, ఆ వివరాలకు అనుగుణంగా స్పందిస్తుంది. ఎ.టి.యమ్ కార్డ్ కు అయస్కాంత పట్టి ఉంటుంది కాబట్టి బలమైన అయస్కాంతం దగ్గర ఉంచ కూడదు. ఉంచితే వివరాలు చెరిగిపోయే ప్రమాదముంది.
మంచి మాట /సుభాషితం:
లక్ష్యంపై అంకితభావం ఉన్న వ్యక్తులు మాత్రమే ఆ పనిని ముందుకు నడిపించగలరు- అంబేడ్కర్‌
వార్తలలోని ముఖ్యాంశాలు
సీబీఐ అధికారులకు, పశ్చిమ బెంగాల్‌ పోలీసుల మధ్య తలెత్తిన ఘర్షణ రాజకీయ రగడగా రూపు సంతరించుకుంది. సీబీఐ తీరుకు నిరసనగా ధర్నాకు కూర్చున్న సీఎం మమతా బెనర్జీ పట్టు వీడలేదు. కోల్‌కతా ఎపిసోడ్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనున్నది.
ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై సామాన్యుడికి అనుమానాలున్నందున వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా 50% మేర ఓటు రసీదు యంత్రాలను లెక్కించి, వాటిని ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోల్చేలా నిబంధనలు తీసుకురావాలని 23 రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశాయి.
రూ.2.25 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బడ్జెట్‌ను శాసనసభలో నేడు ప్రవేశపెట్టనున్నది. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌గా ప్రభుత్వం పేర్కొంటున్నా పూర్తి స్థాయి సంసిద్ధతతో, రాష్ట్ర ప్రజానీకాన్ని ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో పలు అవకతవకలు జరుగుతున్నాయనిముగ్గురు పోలీసు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైకాపా అధినేత జగన్‌  సీఈసీకి ఫిర్యాదు చేశారు.
దేశంలోని ప్రతీ ఒక్కరికీ ఒక్కసారైనా యాదాద్రిని సందర్శించాలనే ఉత్సుకత కలిగేలా దేవాలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.
డిజిటల్‌ లావాదేవీలకు భరోసా కల్పిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) అంబుడ్స్‌మన్‌ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఆన్‌లైన్‌ లావాదేవీలలో ఇబ్బందులను వీలైనంత వేగంగా పరిష్కారమయ్యేందుకు ఈ వ్యవస్థ సహకరించనుంది.
2018 డిసెంబరు 1 నుంచి అమలు చేసే ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) పథకం నకు కుటుంబం అంటే భర్త, భార్య, ఇద్దరు పిల్లలు (18 ఏళ్లలోపు). వీరందరికీ కలిపి అయిదెకరాల లోపు సొంత సాగుభూమి ఉండాలి. అలాగైతేనే అర్హులని కేంద్రం పేర్కొన్నది.

భారత్‌లో బ్యాంకు రుణాలు తీసుకొని చెల్లించకుండా బ్రిటన్‌కు పారిపోయిన విజయ్‌మాల్యాను భారత్‌కు తిరిగి అప్పగించేందుకు యూకే హోంమంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపింది.

Click Here.....To Download The Above Information in Pdf
పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.

  • SCHOOL ASSEMBLY:5th February(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట)
  • SCHOOL ASSEMBLY:5th February(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 5th February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 5th February 2019 assembly, 5th February 2019 assembly,news of the day history,news of the day highlights,5th dec 2019 assembly, dec 5th assembly, dec 5th historical events, 5th February 2019 assembly, February 5th assembly, February 5th historical events,school related today assembly,school related today news, school related February 5th information, school related February month information, School Assembly 5th Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 5th Feb 2019 assembly, 5th Feb 2019 assembly,news of the day history,news of the day highlights,5th dec 2019 assembly, dec 5th assembly, dec 5th historical events, 5th Feb 2019 assembly, Feb 5th assembly, Feb 5th historical events,school related today assembly,school related today news, school related Feb 5th information, school related Feb month information

    Previous
    Next Post »
    0 Komentar