Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 7th February Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 7th February Information


చరిత్రలో ఈరోజు
1990: సోవియట్ యూనియన్ యొక్క 70 సంవత్సరాల సార్వభౌమిక అధికారం విచ్ఛిన్నమయింది.
1992: ఐ.ఎన్.ఎస్. షల్కి (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
ప్రసిద్ధ రచయిత వేటూరి ప్రభాకరశాస్త్రి 1888 వ సం.లో జన్మించారు.
స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం పాలన వ్యతిరేక ఉద్యమకారుడు పి.సుదర్శన్ రెడ్డి 1925 వ సం.లో జన్మించారు.
అమెరికన్ దౌత్యవేత్త మరియు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎలిహూ రూట్ 1937 వ సం.లో మరణించారు.
స్వాతంత్ర్య సమరయోధులు, /చరిత్రకారులు / చలనచిత్ర దర్శకులు ఆమంచర్ల గోపాలరావు 1969 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
బొట్టు నిచ్చే చెట్లు
సిందూరం తయారయ్యేది.. సింధూర్ అనే మొక్క నుంచి, ఈ మొక్కను ఆంగ్లంలో 'లిప్స్టిక్ ట్రీ' అంటారు. పొదలా ఎదిగే ఈ మొక్క. పుట్టిల్లు దక్షిణ అమెరికా, అక్కణ్నుంచే ప్రపంచమంతా వ్యాపించింది. సిందూరం చెట్టుకు పూసిన పూలు తెల్లగా, అందంగా ఉంటాయి. కాయలు ఎర్రగా ఉండి, వాటిలో ఎర్రని గింజలుంటాయి. ఆ గింజల నుండే సింధూరం సమకూరుతుంది.
మంచి మాట /సుభాషితం:
విజయం అంతిమ లక్ష్యమూ కాదు, ఓటమి శాశ్వతమూ కాదు, అన్ని పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసంతో ఉండగలగడమే మన గొప్పతనం- బ్రూస్‌లీ


వార్తలలోని ముఖ్యాంశాలు
ఈ నెల 10న ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఖాళీ కుండలతో నిరసన తెలియజేయాలని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన ఐకాస నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ఛైర్మన్‌గా తెదేపా సీనియర్‌ నాయకుడు, ప్రభుత్వ విప్‌ ఎం.ఎ.షరీఫ్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. శాసనమండలి ఛైర్మన్‌ పదవికి బుధవారం ఎం.ఎ.షరీఫ్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు.
పంచాయతీల్లో నిధులను ఏవిధంగా ఖర్చుపెడుతున్నదీ తెలుసుకోవటానికి 25 ఆకస్మిక తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఈ బృందాలు ఎప్పుడు ఎక్కడికి పోతారో తెలియకుండా తనిఖీలు చేయనున్నట్లు చెప్పారు.
శబరిమల ఆలయానికి అన్ని వయసుల మహిళల్నీ అనుమతించవచ్చని ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ విషయంలో గత సుప్రీంకోర్టు తీర్పును సమర్థించింది.
దేశ సమాచార వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రయోగించిన జీశాట్‌31 ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాన్ని పెరిజీ (భూమికి దగ్గరగా) 250 కిలోమీటర్లు, అపోజి (భూమికి దూరంగా) 35,850 కిలోమీటర్ల ఎత్తులోని దీర్ఘ వృత్తాకార భూ బదిలీ కక్ష్యలో 3.0 డిగ్రీల కోణంలో విజయవంతంగా ప్రవేశ పెట్టారు.
విదేశీయుల రాక తనకు సంతోషమేనని, వారు ప్రతిభ ఆధారంగా, చట్టబద్ధంగా అమెరికాలోకి ప్రవేశించాలని అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పునరుద్ఘాటించారు.
క్వాడ్రిగా-సీఎక్స్‌ అనే కెనడా క్రిప్టో కరెన్సీ కంపెనీ అధ్యక్షుడు జెరాల్డ్‌ కాటెన్‌ మరణించడంతో సుమారు రూ.1000 కోట్ల సొమ్ము ఫ్రీజ్‌ అయిపోయింది. లావాదేవీలు జరపడానికి కావాల్సిన పాస్‌వర్డ్‌ తెలియక టెక్‌ దిగ్గజాలు సహితం తలలు పట్టుకుంటున్నారు.
భారత్‌ టీ20 సిరీస్‌ తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. మొదట కివీస్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. భారత్‌ 19.2 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. ఇదిలా ఉండగా మహిళల టీ20  తొలి మ్యాచ్‌లో కూడా భారత్‌ ఓడింది.


పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:7th February(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట)
  • SCHOOL ASSEMBLY:7th February(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 7th February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 7th February 2019 assembly, 7th February 2019 assembly,news of the day history,news of the day highlights,7th dec 2019 assembly, dec 7th assembly, dec 7th historical events, 7th February 2019 assembly, February 7th assembly, February 7th historical events,school related today assembly,school related today news, school related February 7th information, school related February month information, School Assembly 7th Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 7th Feb 2019 assembly, 7th Feb 2019 assembly,news of the day history,news of the day highlights,7th dec 2019 assembly, dec 7th assembly, dec 7th historical events, 7th Feb 2019 assembly, Feb 7th assembly, Feb 7th historical events,school related today assembly,school related today news, school related Feb 7th information, school related Feb month information
    Previous
    Next Post »
    0 Komentar