Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 14th March Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....

School Assembly 14th March Information


నేటి ప్రాముఖ్యత
పై డే : గణితంలో వాడే ఒక గుర్తు పేరు 'పై' (22/7). పై యొక్క విలువ 3.14159.... దానిని పురస్కరించుకుని, గణిత మేధావులు ఈ రోజును పై డేగా జరుపుకుంటున్నారు.
చరిత్రలో ఈరోజు
1888: అత్యధిక సర్క్యులేషన్ కల మలయాళ వార్తాపత్రిక మలయాళ మనోరమను కందత్తిల్ వర్ఘీస్ మాప్పిల్లై స్థాపించాడు.
1931సం.లో భారతదేశములో తొలి టాకీ చిత్రము, అర్దెషీర్ ఇరానీ దర్శకత్వము వహించిన 'ఆలం ఆరా' ముంబైలోని గోరేగాఁవ్ లోని ఇంపీరియల్ సినిమా థియేటరులో విడుదలయ్యింది.
2008సం.లో హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి సోనియాగాంధీ చే ప్రారంభోత్సవం జరిగింది.
ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1879 వ సం.లో జన్మించారు.
సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ 1917 వ సం.లో జన్మించారు.
ప్రముఖ తెలుగు రచయిత్రి నాయని కృష్ణకుమారి 1930 వ సం.లో జన్మించారు.
కలంకారీ కళాకారుడు, 2009 లో పద్మశ్రీ పురస్కారము తోనూ సత్కరించబడ్డ జొన్నలగడ్డ గురప్పశెట్టి 1937 వ సం.లో జన్మించారు.
1664: సిక్కుల ఎనిమిదవ గురువు గురు హర్‌కిషన్ ఢిల్లీలో మరణించాడు.
1883: ప్రఖ్యాత తత్వవేత్త, రాజకీయ-ఆర్థికవేత్త మరియు విప్లవ కారుడు కారల్ మార్క్స్ మరణించాడు.
రంగస్థల నటుడు, రూపశిల్పి అడబాల 2013 వ సం.లో మరణించారు.


నేటి అంశము:
అనువర్తిత వృక్షశాస్త్ర శాఖలు
1. ఫార్మకాగ్నసీ: మందు మొక్కల అధ్యయన శాస్త్రం.
2. ప్లారికుల్చర్: పుష్పాలనిచ్చే మొక్కలను గురించి తెలిపే శాస్త్రం.
3. సోమాలజీ: ఫలాలనిచ్చే మొక్కలను గురించి తెలిపే శాస్త్రం.
4. అగ్రానమీ: పైరు మొక్కలను గురించి తెలిపే శాస్త్రం.
5. ఒలెరి కల్చర్ : కూరగాయలనిచ్చే మొక్కల పరిజ్ఞానం.
మంచి మాట /సుభాషితం:
కలిగిన మనుజుండు కాముండు సోముండు
మిగుల తేజమునను మెరయుచుండు
విత్తహీనుడెంత రిత్తమై పోవును
విశ్వదాభిరామ వినురవేమ.
భావం: డబ్బుగలవాన్ని మన్మధునిలా అందగాడు. చంద్రునిలా వెలుగు 'రేడు' అంటారు. కీర్తి కాంతులతో ప్రకాశిస్తాడు. విత్తం చేతిలో లేనివాడు చేజారినవాడు, నిజంగా ఉత్త మనిషే అవుతాడు.


వార్తలలోని ముఖ్యాంశాలు
ఎన్నికల సంఘం సర్వర్‌ మొరాయిస్తుండడంతో ఆన్‌లైన్‌లో ఓటర్ల నమోదు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇదిలావుండగా కొత్తగా ఓటరు నమోదుకు మార్చి 15వ తేదీ వరకే గడువు ఉంది.
నీటి వినియోగం ఎక్కువగా ఉండడంతో తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన జలాశయాల్లో నీటి మట్టం గతేడాదితో ఇదే సమయంతో పోల్చితే వేగంగా ఖాళీ అవుతున్నాయి.
అమెరికా-భారత్‌ భాగస్వామ్యంలో చేపట్టే సైనిక ఉత్పత్తులకు హైదరాబాద్‌ కేంద్ర స్థానంగా మారిందని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా తెలిపారు.
విప్రో చైర్మన్‌ 'అజీమ్‌ ప్రేమ్‌జీ' సమాజ సేవ కోసం మరో రూ.52,700 కోట్లు కేటాయించారు. దీంతో తన ఫౌండేషన్‌ కార్యక్రమాలకు ప్రేమ్‌జీ కేటాయించిన మొత్తం రూ.1.45 లక్షల కోట్లకు చేరింది.
దక్షిణ మధ్య రైల్వే సీజన్‌ టికెట్లప్రయాణ దూరం పరిమితిని 150 కి.మీ. నుండి 160 కిమీ వరకు పెంచింది. ప్రయాణికుల నుంచి డిమాండ్‌ అధికంగా ఉన్న 12 మార్గాలను ఎంపిక చేసి ఈ నిర్ణయం తీసుకుంది.
ఓటు వేయడం పౌరుల ప్రాథమిక విధి అని, ఓటు వేయడమంటే దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగేందుకు ఉద్దేశించే బ్రెగ్జిట్ ఒప్పందాన్ని బ్రిటన్‌ పార్లమెంటు రెండోసారి తిరస్కరించింది.  బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా 391 ఓట్లు, అనుకూలంగా 242 ఓట్లు నమోదయ్యాయి.
ఫిరోజ్‌ షా కోట్లా వేదికగా జరిగిన నిర్ణయాత్మక ఐదో వన్డేలో ఆస్ట్రేలియా భారత్‌ను 35 పరుగుల తేడాతో ఓడించి, 3-2తో వన్డే సిరీస్‌ కైవసం చేసుకుంది.
School Assembly 14th March Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,March month school assembly day wise,March 2019 school assembly,March 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 14th March 2019 assembly, 14th March 2019 assembly,news of the day history,news of the day highlights,14th march 2019 assembly, march 14th assembly, dec 14th historical events, 14th March 2019 assembly, March 14th assembly, March 14th historical events,school related today assembly,school related today news, school related March 14th information, school related March month information, historical events in india,historical events in march,historical events around the world in march,historical events and dates,historical events around the world,a historical event in india,a historical event that happened today,a history event in india,current and historical events,dates and historical events,historical events by date,historical events calendar,historical events dates,historical events date wise,historical events march,historical events march 14th,historical events happened in march month,historical events happened today,historical events happening now,historical events pdf,historical events related to education,historical events that happened today,historical events wikipedia,historical events with dates pdf,a-z historical events
Previous
Next Post »
0 Komentar