Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 13th March Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....

School Assembly 13th March Information


చరిత్రలో ఈరోజు
1940 మార్చి 13 తారీకున, ఉధమ్ సింగ్, అమృతసర్ మారణ కాండకు (జలియన్‌వాలా బాగ్) బాధ్యుడిగా పరిగణింపబడిన మైకేల్ ఓ డైయర్ ను లండన్ లో కాల్చి చంపాడు.
1955: నేపాల్ రాజుగా మహేంద్ర అధికారం స్వీకరించాడు.
ఆక్సిజన్ ను కనిపెట్టిన శాస్త్రవేత్త జోసెఫ్ ప్రీస్ట్‌లీ 1733 వ సం.లో జన్మించారు.
హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు 1899 వ సం.లో జన్మించారు.
యసుటారో కొయిడే 112 సంవత్సరాలు జీవించి అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన జపాన్ కురువృద్ధుడు 1903 వ సం.లో జన్మించారు.
అభ్యుదయ రచయిత, నాటక విమర్శకులు, నాటక విద్యాలయ ప్రధానాచార్యులు, పత్రికా రచయిత, వ్యాసకర్త, అనువాదకులు శ్రీనివాస చక్రవర్తి 1911 వ సం.లో జన్మించారు.
ప్రముఖ సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వల్లంపాటి వెంకటసుబ్బయ్య 1937వ సం.లో జన్మించారు.
తొలితరం స్వాతంత్ర సమరయోధుడు కన్నెగంటి సూర్యనారాయణమూర్తి 1990 వ సం.లో మరణించారు. 
నేటి అంశము:
న్యూటన్ గమన సూత్రములు
న్యూటన్ మొదటి గమనసూత్రం: ఐజాక్ న్యూటన్ అనే బ్రిటీష్ విజ్ఞాని. రోదసీలోనూ భూమి మీద వస్తువుల గమనం కింది మూడు గతి నియమాలననుసరించి ఉంటుందని 1687లో ప్రతిపాదించాడు. బాహ్యబలం ప్రయోగించనంత వరకు నిశ్చలస్థితిలో ఉన్న వస్తువు నిశ్చలస్థితిలోను, సమ వేగంతో పోతున్న వస్తువు, అదే స్థితిలోను ఉంటుంది. దీనినే న్యూటన్ మొదటి సూత్రం అంటారు. 
వివరణ : మొదటిసూత్రం 1) జడత్వ ధర్మాన్ని 2) బలాన్ని వివరిస్తుంది.
మంచి మాట /సుభాషితం:
నాకెప్పుడూ ఓటమి లేదు, ఎందుకంటే చేసే పనిలో వస్తే విజయం వస్తుంది,లేకపోతే ఏ తప్పులు చేయకూడదో తెలిపే పాఠం లభిస్తుంది- నెల్సన్‌ మండేలా
నేటి జీ.కె
ప్రశ్న: గాంధేయ విధానాల్లో చిప్కో ఉద్యమాన్ని ఏమని పిలిచేవారు?
జ: అడవి సత్యాగ్రహం


వార్తలలోని ముఖ్యాంశాలు
> కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు మార్చి 31 వరకు దిల్లీలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాల్స్‌ మూసివేస్తున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.
> జగనన్న విద్యా కానుకకిట్స్‌ కొనుగోలుకు పరిపాలనా సంబంధిత అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
> బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ వేదికగా వింగ్స్‌ ఇండియా2020 గురువారం ప్రారంభమైంది. ఇందులో సారంగ్‌ టీమ్‌ వైమానిక విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
> వేసవిలో కరోనా వైరస్ బతకలేదని కచ్చితంగా చెప్పలేమని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అత్యధిక ఉష్ణోగ్రతలో కరోనా వైరస్ బతకదన్న సాధారణ భావన ఉందనీ... కానీ అది నిర్ధారణ కాలేదని స్పష్టం చేసింది.
> జాతీయ పౌర పట్టిక(ఎన్‌పీఆర్‌)కు ఎటువంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని, అదేవిధంగా ఎవరిని అనుమానాస్పద వ్యక్తులుగా ప్రకటించమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు.
> దేశీయ స్టాక్‌ మార్కెట్లను కరోనా భయాలు కుదిపేశాయి. పతనాల్లో కొత్త రికార్డులను సృష్టించాయి.
> వందకుపైగా దేశాల్లో వేగంగా విస్తరించిన కరోనా వైరస్‌ (కోవిడ్‌19)ను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) బుధవారం ప్రకటించింది.
> భారత యువ శాస్త్రవేత్త  కె.నానాజీకి ఈ ఏడాది జర్మనీలో జరిగే నోబెల్‌ బహుమతి గ్రహీతల సమావేశంలో పాల్గొనే అవకాశం లభించింది.
> భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయింది.
TODAY'S NEWS 13.03.2020 :: GSRAO GK GROUPS
1.Doctors advised to  Disinfect  smartphone  every 90 mins with alcoholic sanitizer to prevent COVID-19
2.India’s first COVID-19 death confirmed in Karnataka
4.KCR slammed Centre for poor allocations to Telangana
5.TS economy strong, debts under control: Harish Rao said
6.Telangana Wakf Board official was  caught due to taking bribe
7.TS Assembly to discuss preparedness to tackle COVID-19 on Friday
8.Fully-equipped oncology dept  was inaugurated at SLG Hospitals in Hyderabad

9.Sindhu  entered   into quarterfinals, in All England Championship
School Assembly 13th March Information, School Assembly,prayer songs, Assembly information, historical events, information of the day, news of the day, golden words, today golden words, moral sentences,today's importance, headlines in the news, March month school assembly day wise, March 2020 school assembly, March 2020 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజునేటి అంశముమంచి మాట / పద్యంవార్తలలోని ముఖ్యాంశాలు, 13th March 2020 assembly, 
Previous
Next Post »
0 Komentar