Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

IIIT Admission notification details

AP IIIT Admission notification details


S.S.C ఫలితాలలో ఉత్తీర్ణులైన విద్యార్ధులు IIIT లో ప్రవేశానికి ధరకాస్తు చేసుకోవచ్చు.
1) మన ఆంధ్రప్రదేద్ లో నాలుగు ఐఐఐటీ లు ఉన్నాయి (నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం) ఈ నాలుగు సెంట్రల్ లో కలిపి 4000 సీట్స్ ఉంటాయి. త్వరలో నోటిఫికేషన్ రావచ్చు, వీటిల్లో మీ 10వ తరగతిలో వచ్చిన గ్రేడ్స్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
2) గత ఏడాది ప్రకారం 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివుంటే మీకు వచ్చిన గ్రేడ్ పాయింట్స్ కి 0.4 పాయిట్స్ కలుపుతారు (ఈ అకడమిక్ ఇయర్ కు నిర్ణయం ప్రకటించ వలసి ఉన్నది). అంటే  10th లో మీకు 9.8వస్తే 9.8+0.4=10.2 వచ్చినట్టు. ప్రైవేట్ స్కూల్స్ లో చదివిన వాళ్లకి 0.4 పాయింట్స్ కలపరు.
3) ఒకే గ్రేడ్ పాయింట్స్ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఒకే సీట్ కి పోటీ పడినప్పుడు వాళ్ళ సైన్స్ మరియు మాథ్స్ గ్రేడ్ పాయింట్ చూస్తారు అది కూడా ఒకే లా ఉంటే వయసు ని పరిధిలోకి తీసుకుని ఎక్కువ వయసు ఉన్నవాళ్ళకి ఆ సీట్ కేటాయిస్తారు.
4) స్పోర్ట్స్ కోట లో మరియు N.C.C కోట లో 1% సీట్స్ కేటాయిస్తారు మీకు 10th లో పై రెండు సరిఫికెట్లు ఉంటే ఆ కోట లో కూడా అప్లై చేసుకోవచ్చు.
5) అప్లికేషన్ విడుదల అయ్యాక ఒక నెల టైం ఇస్తారు అప్లికేషన్ తేదీ ముగిశాక అప్లై చేసుకున్న వాళ్ళ గ్రేడ్ ని బట్టి షార్ట్ లిస్ట్ చేసి 1st లిస్ట్ ని రిలీజ్ చేసి వాళ్ళకి కౌన్సెలింగ్ కి పిలుస్తారు. 1st లిస్ట్ లో మిగిలిన సీట్స్ ని బట్టి సెకండ్ లిస్ట్ విడుదల చేస్తారు.
6) అడ్మిషన్ పొందిన స్టూడెంట్స్ కి ఒక లాప్టాప్, 2 జతల యూనిఫామ్, స్పోర్ట్స్ షూ, ఫార్మల్ షూ, బ్లాంకెట్స్ ఇస్తారు.
7) ఫీజు 36000/- ( ట్యూషన్ ఫీ 6000/- మరియు హాస్టల్ ఫీ 30,000 ఉంటుంది) ఫీజు రిఎంబెర్స్మెంట్, స్కాలర్ షిప్ సౌకర్యం ఉన్నవి. సంవత్సర ఆదాయం, తెల్ల రేషన్ కార్డ్, 1 లక్ష లోపు ఉన్న వాళ్ళకి వర్తిస్తాయి.
8) 10% అగ్రవర్ణ రిజర్వేషన్లు కి సంబంధించి EWS (Economical Weaker Section) certificate మీ సేవలో తీసుకొని దగ్గర ఉంచుకోవాలి.
పూర్తి వివరాలు కోసం ఐఐఐటీ website www.rguktn.ac.in (Nuzvid IIIT Site) లేదా www.rgukt.in లను చూడండి.

గమనిక: AP IIIT ప్రవేశాలకు నోటిఫికేషన్ 3 లేదా 4 రోజుల్లో విడుదల అయ్యే అవకాశం ఉన్నది.
Previous
Next Post »

1 comment