Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Education Minister review meeting on feasibility of 10th Class Examinations



పదో తరగతి పరీక్షల సాధ్యాసాధ్యాలపై మంత్రి సమీక్ష
పరీక్షలపై నేడో రేపో కీలక నిర్ణయం..!
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ ఉన్నతాధికారులు, జిల్లా విద్యాధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా అనే అంశాలను క్షుణ్ణంగా చర్చించారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పరీక్షల నిర్వహణ కష్టంగా మారితే ఫార్మేటివ్ అసెస్మెంట్ 1,2 సమ్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ప్రగతి ఆధారంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశాలపై కూడా దృష్టి సారించారు. అయితే పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులు నేడో , రేపో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. 

Previous
Next Post »
0 Komentar