Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Is there no census this year?



Is there no census this year?
ఈ ఏడాది జనగణన లేనట్టే?
ఇంకా ఖరారు కాని షెడ్యూల్, లక్షల అధికారులు అవసరం
 పెరుగుతున్న కరోనా కేసులు, వాయిదా వేసే ఆలోచనలో కేంద్రం
 షెడ్యూల్ ప్రకారం.. ఈ ఏడాది జనాభా లెక్కలు చేపట్టాలి. జాతీయ జనాభా నమోదు (ఎన్పీఆర్)ను నిర్వహించాలి. కానీ కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో జన గణనతో పాటు ఎన్పీఆర్ నిర్వహించే అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు. అసలు ఈ విషయమై చర్చే జరగడం లేదు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టే ఆస్కారం లేకపోవడమే దీనికి కారణం. దేశంలో జనాభా లెక్కింపు అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలను లెక్కించేందుకు సుమారు 30 లక్ష లమంది అధికారులు రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఇంత భారీ జన గణన ప్రపంచంలోని ఏ దేశంలో జరగదు. ప్రతీ ఇంటికి వెళ్లి...జనాభాను లెక్కించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జన గణన అనేది అంత ముఖ్యమైంది కాదని భావిస్తున్నట్టు ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. ఒక ఏడాది ఆలస్యం అయినా.. పెద్ద ఇబ్బందేమీ ఉండదని అన్నారు. జన గణన 2021 ఎన్పీఆర్ తొలి దశ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికారి వివరించారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి మాత్రం2020  లో జన గణన జరగదనేది స్పష్టంగా తెలుస్తోంది. ఎన్ పీఆర్తో పాటు జన గణన అనేది 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దేశ వ్యాప్తంగా నిర్వహించాల్సి ఉంది. కానీ కోవిడ్ - 19 కారణంగా దీనికి బ్రేక్ పడింది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేసేందుకు లక్షలాది మంది ప్రభుత్వ అధికారుల అవస రం ఉంది. ప్రతీ ఇంటికెళ్లి.. ప్రతీ కుటుంబాన్ని తట్టాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఆరోగ్యానికి ఎంతో చేటు. ఒకే రోజు 78 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న వేళ ఎన్పీఆర్, జనగణన ఈ ఏడాది లేనట్లే అని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. మునుపటి షెడ్యూల్ ప్రకారం.. జనాభా లెక్కల ప్రకారం.. మార్చి 1, 2021. కానీ అక్టోబర్ 1, 2020 నాటికి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాలు మంచుతో నిండి ఉంటాయి. అక్కడికి వెళ్లేందుకు ఎవరితోనూ సాధ్యం కాదు. కోవిడ్ 19 భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. కరోనా రాజాను ముందు జనగణన కమిషనర్ ఆఫ్ ఇండియా.. తొలి విడత జన గణన కోసం షెడ్యూల్ కూడా సిద్ధం చేసుకున్నారు. ఎన్ పీఆర్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని భావించారు. కానీ కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వస్తుంది అదేవిధంగా ఎన్పీఆర్ కు దేశ వ్యాప్తంగా కొంత వ్యతిరేకత కూడా ఉంది. జన గణనకు మాత్రం ఎలాంటి ఢోకా లేదు. 130 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ప్రతీ ఏళ్లకోసారి జన గణన జరుగుతుంది. కానీ ఈ సారి మాత్రం కరోనా కారణంగా వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉంది.


Previous
Next Post »
0 Komentar

Google Tags