Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Schools from October 5 - Admissions without bothering for TCs, certificates



Schools from October 5 - Admissions without bothering for TCs, certificates
AP: అక్టోబర్‌‌ 5 నుంచి స్కూల్లు, సిద్ధమవుతున్న విద్యాశాఖ...!
టీసీలు, ధ్రువపత్రాల కోసం ఇబ్బందులు పెట్టకుండా అడ్మిషన్లు
విద్యార్ధులు లేకుండా అడ్మిషన్లు

మూతబడిన స్కూళ్లు మళ్లీ తెరుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. స్కూళ్లలో అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకాలు ఖరారవుతున్నాయి.

ప్రధానాంశాలు:
2020–21కి సిద్ధమవుతున్న పాఠశాల విద్యాశాఖ
టీసీలు, ధ్రువపత్రాల కోసం ఇబ్బందులు పెట్టకుండా అడ్మిషన్లు
తల్లిదండ్రుల సమ్మతితోనే ఇతర స్కూళ్లకు బదిలీ

కరోనా నేపథ్యంలో ఉన్నపళంగా మూతబడిన స్కూళ్లు మళ్లీ తెరుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. దీర్ఘకాలంగా ఇంటికే పరిమితమైన విద్యార్థులు మళ్లీ స్కూళ్లలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. స్కూళ్లలో అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకాలు ఖరారవుతున్నాయి. సర్టిఫికెట్లు, ఇతర ధ్రువపత్రాల కోసం ఒత్తిడి చేయకుండా విద్యార్థులను చేర్చుకోవడం.. పరీక్షల్లేకుండా అందరినీ పై తరగతులకు ప్రమోట్‌ చేశారు కనక అవసరమైన వారిని ఇతర స్కూళ్లకు పంపటం వంటి ప్రక్రియను చేపట్టనున్నారు.

తల్లిదండ్రుల అనుమతితోనే..!
ప్రవేశాల సమయంలో ఇతర స్కూళ్లలో చేరాలనుకున్నవారికి టీసీలు జారీ చేయడానికి కూడా స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడనున్నాయి. తల్లిదండ్రుల అనుమతితోనే జరిగేలా చర్యలు తీసుకోబోతున్నారు. కరోనా కారణంగా ప్రవేశాల కోసం విద్యార్థులను స్కూళ్లకు రప్పించరు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు.

ఒకవేళ 5, 7వ తరగతుల విద్యార్థులు తదుపరి చదువుల కోసం ఇతర పాఠశాలలకు వెళ్లాల్సి వస్తే తల్లిదండ్రుల అభిప్రాయాలను స్వీకరించి ప్రవేశాలను చేపట్టాలి. ఈ మేరకు ప్రాంతీయ జాయింట్‌ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులు క్షేత్రస్థాయిలో మార్గనిర్దేశం చేస్తారు.
5, 7వ తరగతులు చదివిన విద్యార్థులు తదుపరి ఏ స్కూల్లో చదవదల్చుకున్నారో తల్లిదండ్రులతో హెడ్మాస్టర్లు మాట్లాడి నిర్ధారించుకోవాలి. ఆ సమాచారాన్ని పిల్లలు చేరదలచుకున్న పాఠశాలల హెడ్మాస్టర్లకు లిఖితపూర్వకంగా తెలియచేయాలి.
తల్లిదండ్రులతో మాట్లాడి ఆయా స్కూళ్లలో ప్రవేశాలు సజావుగా జరిగేలా చూడాలి. ప్రాథమిక పాఠశాలల విషయంలో ఎంఈవోలు, హైస్కూళ్ల విషయంలో ఉపవిద్యాధికారులు దీన్ని పర్యవేక్షించాలి.
తల్లిదండ్రుల సమ్మతి లేకుండా ఏ విద్యార్థినీ ఇతర స్కూళ్లలోకి పంపకూడదు. విద్యార్థి ఏ స్కూల్లో చేరదలుచుకున్నా తల్లిదండ్రుల ఆప్షన్‌ను లిఖితపూర్వకంగా తీసుకోవాలి.
తల్లిదండ్రుల సమ్మతి తీసుకున్నాక విద్యార్థి స్కూల్‌ రికార్డు, టీసీలను విద్యార్థి చేరదలుచుకున్న పాఠశాల హెడ్మాస్టర్‌/ప్రిన్సిపాల్‌కు అందించాలి. ఇందుకు సంబంధించిన రసీదును కూడా తీసుకోవాలి.
స్వస్థలాలకు చేరుకున్న ఉపాధి కూలీల పిల్లలకు ఎలాంటి గుర్తింపు పత్రాలు అడగకుండా పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలి. బదిలీ సర్టిఫికెట్ల (టీసీ) కోసం బలవంతం చేయకుండా.. గతంలో చదివిన తరగతి తాలూకు నిర్థారణ పత్రాలు అడగకుండా... తల్లిదండ్రులిచ్చిన సమాచారం సరైనదిగా భావించి సదరు తరగతిలో పిల్లలకు ప్రవేశం కల్పించాలి.
అక్టోబర్‌ 5 నుంచి పాఠశాలలను ప్రారంభించాలని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినా.. తుది నిర్ణయం మాత్రం కేంద్రం ప్రకటించే లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా తీసుకుంటారు.
  
వీటిల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాలు:
రెసిడెన్సియల్‌ స్కూళ్లు, మోడల్‌ స్కూళ్లు, కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో ప్రవేశాల ప్రక్రియ ఆన్‌లైన్లో జరుగుతున్నందున వారికి సంబంధించిన ధ్రువపత్రాలు, రికార్డులను సంబంధిత ప్రిన్సిపాళ్లు రసీదులు తీసుకొని అప్పగించాలి. ప్రత్యేక అవసరాలున్న పిల్లలను వారి సామర్థ్యాలను అనుసరించి తగిన తరగతిలో ప్రవేశం కల్పించాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags