Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 13th December Information

School Assembly 13th December Information

చరిత్రలో ఈ రోజు
2001: భారత పార్లమెంటు పై ఐదుగురు తీవ్రవాదులు దాడి చేసిన సంఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక తోటమాలి మరణించారు. మొత్తం తీవ్రవాదులందరూ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. వీరందర్నీ పాకిస్తాన్ దేశస్తులుగా గుర్తించారు.
ఢిల్లీ మెట్రో రైల్వేను అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి 2002 లో ప్రారంభించారు.
1968 వ సం. నాసా అంతరిక్షనౌక అపోలో 8లోప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు.
2000 సం. లోభారత్ కు చెందిన చదరంగం ఆటగాడు, విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు
మనదేశంలో మొట్టమొదటి ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ 'ఎస్సెల్‌ వరల్డ్‌' 1989లో ముంబయిలో ప్రారంభమైంది.
దగ్గుపాటి వెంకటేష్ (1960) ప్రముఖ సినీ నటుడి పుట్టిన రోజు.
నేటి అంశము- సైన్సు (వృక్ష,జంతుశాస్త్రము)
 ఆహారం ఎందుకు పాడవుతుంది?
మనం తినే అన్నం, కూరలు ఇతర ఆహార పదార్థాలు నిల్వ ఉంటే పాడవుతాయి. అందులో ఉండే బ్యాక్టీరియా క్రిములే దానికి కారణం. ఇవి కంటికి కనిపించనంత చిన్నవిగా ఉంటాయి. సమయం గడిచేకొద్దీ  అసంఖ్యాకంగా పెరిగిపోతాయి. ఈ సూక్ష్మజీవుల వల్ల ఆహారంలోని ప్రోటీన్లు, పదార్థాలు మార్పు చెందుతాయి. కాబట్టే, ఆహారం  పాచిపోతుంది. అంటే పాడవుతుంది.
చెడిన పదార్థాలు తింటే ఎందుకు జబ్బు  పడతాం?
సమయం గడిచేకొద్దీ ఆహారంలోని బ్యాక్టీరియా జీవుల సంతతి వృద్ధి చెందుతుంది. అసంఖ్యాకంగా సూక్ష్మక్రిములు ఉన్న ఆహారం తింటే మనకు కడుపు నొప్పి వస్తుంది. బ్యాక్టీరియా వల్ల ఆహారంలోని పదార్థాలు విచ్చిన్నమై హానికరమైన పదార్థాలుగా  మారతాయి. ఇవి కూడా మనల్ని అస్వస్థతకు గురిచేస్తాయి. కొన్ని బాక్టీరియాలు మేలు చేస్తాయి, బ్యాక్టీరియాలు అసలు పదార్థాలను వేరే పదార్థాలుగా మార్చుతాయి. ఈ మారిన పదార్థాలు మనకు మేలు కూడా చేయవచ్చు. ఉదాహరణకు పాలని తీసుకోండి. వాటిలోని బ్యాక్టీరియా పాలను జున్ను గా మార్చుతాయి.
మంచి సుభాషితం
భర్తృహరి సుభాషితం
తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు
భావం - ప్రయత్నం చేయుట వలన ఇసుక నుంచి తైలం తీయవచ్చును. ఎండమావిలో నీరు త్రాగవచ్చును. తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనను సాధింపవచ్చును. కాని మూర్ఖుని మనస్సును మాత్రము సమాధాన పెట్టుట సాధ్యము కాదు
నేటి మాట
"ప్రోత్సాహంలేదని మంచి పనిని వాయిదా వేయకండి!"
"Failure is the stepping stone to success."
నేటి జీ.కె
ప్రశ్న:  హెడ్ హంట‌ర్సు జాతివారు ఎచ‌ట నివ‌సించుచున్నారు?
జ: బోర్నియా

వార్తలలోని ముఖ్యాంశాలు
> దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం ముగ్గురు సభ్యులతో విచారణ కమిషన్‌ ఏర్పాటుచేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆరునెలల్లో కమిషన్ నివేదిక ఇవ్వనుంది.
> నటుడు, రచయిత, సంపాదకుడు & వ్యాఖ్యాతగా ప్రాచుర్యం పొందిన గొల్లపూడి మారుతి రావు గారు కొద్ది రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతూ గురువారం తుది శ్వాస విడిచారు.
> అన్ని పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం పై గురువారం ఏ.పి. శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరుపేద కుటుంబాల పిల్లలు కూడా బాగా చదువుకొని అన్ని రంగాల్లో ఎదగడం కోసమే ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టామని, దేశం మొత్తం గర్వపడేలా ఈ విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.
> అయోధ్య వివాదానికి సంబంధించి వెలువరించిన తీర్పును సమీక్షించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
>పార్లమెంట్లో తాజాగా ఆమోదించిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గువాహటి లో యుద్ధ వాతావరణం కనిపించింది.
> బ్రిటన్ ప్రతినిధుల సభకు గురువారం ఎన్నికలు జరిగాయి. ఇంగ్లాండ్ వేల్స్ స్కాట్లాండ్ లలోని మొత్తం 650 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 3322 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. వీటికి సంబంధించి ఫలితాలు శుక్రవారం ఉదయం వచ్చే అవకాశం ఉంది.
>బీడబ్ల్యూ ఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ లో డిఫెండింగ్ చాంపియన్ పి వి సింధూ లీగ్ దశ కూడా దాట లేకపోయింది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ ఓడి సెమీస్ బెర్తుకు దూరమైంది.
School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,december month school assembly day wise,december 2019 school assembly,december 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 13th december 2019 assembly, 13th december 2019 assembly, of the day history,news of the day highlights,13th dec 2019 assembly, dec 13th assembly, dec 13th historical events, 13th december 2019 assembly, december 13th assembly, december 13th historical events,school related today assembly,school related today news, school related december 13th information, school related december month information
Previous
Next Post »
0 Komentar

Google Tags