Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 18th December Information

School Assembly 18th December Information
నేటి ప్రాముఖ్యత
అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం.
మైనారిటీ హక్కుల దినం. (భారతదేశం.)
చరిత్రలో ఈ రోజు
1948 వ సం. జాగృతి తెలుగు వారపత్రిక ప్రారంభమైనది.
1971 వ సం. బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది.
2014 వ సం. భారతదేశానికి చెందిన భూసమస్థితి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎం.కె. III ప్రయోగం విజయవంతం అయినది.
సుప్రసిద్ధ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్ పుట్టిన రోజు.
అసాధారణ మేధావి, మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారత పరిస్థితులకు అన్వయం చేసి బోధించే కాట్రగడ్డ బాలకృష్ణ మరణించిన రోజు.
నేటి అంశము-బంగారము - తూకము
1000 మిల్లీ గ్రాములు -------1 గ్రాము
1000 గ్రాములు -------------1 కిలో గ్రాము
8 గ్రాములు------------------1 సవరసు (కాసు)
11 మిల్లీ గ్రాములు ----------1 గురివింజ ఎత్తు
11.664 గ్రాములు-----------1 తులము
పాలు-ధాన్యపు కొలతలు 
2 గిద్దలు ------- 1అరసోల 
2 అరసోలలు -- 1 సోల
2సోలలు -------1 తవ్వ
2తవ్వలు - ----1మానిక
2 మానికలు --1 అడ్డేడు
20 అడ్డేళ్ళు ---1 అంకెము
2 అంకెములు - 1 పలక
8పలకలు - -----1 పుట్టి
మంచి మాట
విజయం ఎప్పుడూ మన ముందస్తు ప్రణాళిక మీదే ఆధారపడి ఉంటుంది- నెల్సన్‌ మండేలా
మంచి పద్యం
కవిత్వమయితె కప్పిచెప్పూ
విమర్ష అయితె విప్పిచెప్పూ
ఉబుసుబోనీ కబురులైతే
కాళ్ళకిందేసి తొక్కూ.
నేటి జీ.కె
ప్రశ్న: విద్యుత్ ప్రవాహ దిశ‌ను మార్చున‌ది ఏది?
జ: క‌మ్యుటేట‌ర్
వార్తలలోని ముఖ్యాంశాలు
> ఏపీకి మూడు రాజధానులు రావొచ్చు అని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటన.  అమరావతిలో శాసన నిర్వాహక, విశాఖలో కార్యనిర్వాహక, కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. ఇలాంటి ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు.
> యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పునర్నిర్మాణం ఆగమశాస్త్ర నియమాల ప్రకారం పూర్తి నాణ్యతా ప్రమాణాలతో అత్యంత పకడ్బందీగా నిర్మాణాలు జరగాలని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.
> జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో నిలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పదికోట్ల పనిదినాలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యం కాగా, ఇప్పటికే 9.85 కోట్ల పనిదినాలను పూర్తిచేసింది.
> పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు మరణశిక్ష పడింది. దేశ ద్రోహం కేసులో ప్రత్యేక కోర్టు ఈ మరణశిక్ష విధించింది. మాజీ అధ్యక్షుడికి మరణ శిక్ష విధించడం పాకిస్థాన్‌ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
> పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో  నిన్న కూడా వేలమంది నిరసనకు దిగారు. బస్సులను ధ్వంసం చేసి ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు.
> కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జాతీయ బ్రాండ్ మిషన్ ను ప్రారంభించారు. దీని ప్రకారం ప్రతి గ్రామానికి 2022 కల్లా నాణ్యమైన బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం అందుబాటులోకి రానున్నది.
> బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణికి సంబంధించిన 2 వెర్షన్లను మంగళవారం రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. వీటిలో 1 భూతలం నుంచి రెండోది గగనతలం నుండి ప్రయోగించే ది కావడం విశేషం.
> నేడు విశాఖపట్టణంలో భారత్, వెస్టిండీస్ ల మధ్య రెండో వన్డే జరగనున్నది.  సిరీస్ పై ఆశలు నిలవాలంటే భారత్ ఈ మ్యాచ్ లో గెలవాల్సి ఉన్నది.

>టీమిండియా ఓపెనర్‌ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. ఈ ఏడాది ఐసీసీ వన్డే, టీ20 జట్లలో చోటు సంపాదించింది. .
School Assembly 18th December Information, School Assembly,prayer songs, Assembly information, historical events,information of the day, news of the day,golden words, today golden words, moral sentences,today's importance, headlines in the news, December month school assembly day wise, December 2019 school assembly, December 20189 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యతచరిత్రలో ఈ రోజునేటి అంశముమంచి మాట / పద్యంవార్తలలోని ముఖ్యాంశాలు, 18th December 2019 assembly, 18th December 2019 assembly, news of the day history, news of the day highlights, 18th dec 2019 assembly, dec 18th assembly, dec 18th historical events, 18th December 2019 assembly, december 18th assembly, december 18th historical events, school related today assembly, school related today news, school related december 18th information, school related december month information
Previous
Next Post »
0 Komentar