Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 26th December Information

School Assembly 26th December Information

నేటి ప్రాముఖ్యత
జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం.
చరిత్రలో ఈరోజు
1907వ సం.  భారత జాతీయ కాంగ్రెస్‌ 23వ మహాసభలో పార్టీ సభ్యులు అతివాద, మితవాద వర్గాలుగా చీలిపోయారు. అతివాద వర్గానికి బాలగంగాధర తిలక్, మితవాదులకు గోపాలకృష్ణ గోఖలే నాయకత్వం వహించారు.
2004 వ సం. హిందూ మహాసముద్రంలో వచ్చిన పెను భూకంపం కారణంగా సునామి వచ్చింది. వివిధ దేశాల్లో సునామి సృష్టించిన విధ్వంసంలో దాదాపు 2,75,000 మంది వరకు చనిపోయారు. రిక్టర్‌ స్కేలుపై భూకరప తీవ్రత 9.3గా నవోదైంది. ఈ భూకంపంలో విడుదలైన శక్తి 0.8టీఎన్‌టీలకు సమానం.
1982 వ సం.  టైమ్‌ మ్యాగజైన్‌ ఏటా ఇచ్చే 'మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌' పురస్కారాన్ని ఆ ఏడాది 'పర్సనల్‌ కంప్యూటర్‌'కు ఇచ్చింది. మనిషికి కాకుండా ఆ గౌరవాన్ని ఒక యంత్రానికి ప్రకటించడం అదే మొదటిసారి.
ఉద్దమ్ సింగ్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు 1899 వ సం.లో జన్మించారు.
కొమ్మారెడ్డి సావిత్రి, తెలుగు సినీ ప్రపంచంలో మహానటి 1981 వ సం.లో మరణించారు.
 నేటి అంశము:
సునామీలు రావడానికి గల ముఖ్య కారణాలు...?
1.భూకంపాలు: ఎక్కువసార్లు సునామీలు సముద్రంలో భూకంపాల వల్ల వస్తాయి. రిక్టర్ స్కేలుపై 7.5 లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రతతో సముద్రంలో సంభవించే భూకంపాల వల్ల సముద్రం అడుగున ఉన్న భూ ఫలకాలలో కదలికలు సంభవిస్తాయి. అప్పుడు ఆ భాగంలో ఉన్న నీరు అస్థిరతకు లోనై, ఆ తర్వాత భూమ్యాకర్షణ శక్తి వల్ల ఆ నీరంతా మళ్లీ కిందకు రావడం తదితర కారణాలతో సునామి సంభవిస్తాయి.
2.మంచు పర్వతాలు విరగడం: సముద్రం మధ్యలో ఉండే కొండ చరియలు విరిగిపడటం, భారీ మంచు పర్వతాలు విరిగిపోవడం వల్ల కూడా భూకంపాలు వస్తాయి.
3.అగ్నిపర్వతాలు పేలడం: సముద్రంలోని అగ్నిపర్వతాలు పేలినప్పుడు భారీ మొత్తంలో నీరు స్థానభ్రంశం చెంది సునామీ అలలు ఏర్పడతాయి. అలాగే అగ్ని పర్వతం పై భాగం విరిగి సముద్రంలోకి పడినప్పుడు భారీ మొత్తంలో నీరు అగ్నిపర్వతం లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఏర్పడే అలజడుల కారణంగా కూడా సునామీ వస్తాయి.
4.గ్రహశకలాలు పడటం: అప్పుడప్పుడు భూమిపైకి భారీ ఆకారంలో ఉండే గ్రహశకలాలు,ఉల్కలు సముద్రంలో కూలిన సునామీ అలలు వస్తాయి.
మంచి మాట:
కోపం,ద్వేషం,అసూయ వంటి పనికిమాలిన విషయాలతో నింపడానికి మనసు చెత్త డబ్బా కాదు,శాంతం,సంతోషం ,ప్రేమ వంటి విలువైన భావాలతో నింపాల్సిన వజ్రాల పెట్టె.

వార్తలలోని ముఖ్యాంశాలు
నేడు వార్షిక సూర్యగ్రహణం ఉదయం 8.04 కు ప్రారంభం కానున్నది. భారత్ లో సుమారు3.12 గం. ల సేపు సూర్యగ్రహణం కొనసాగానున్నది. ఐతే ఈ సూర్యగ్రహణంను నేరుగా చూడొద్దని శాస్త్రవేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.
గండికోట దిగువన ముద్దనూరులో 20 టీఎంసీలతో మరో జలాశయం నిర్మాణం చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించారు. పులివెందుల అభివృద్ధి కోసం రూ.1,329కోట్లతో చేపట్టే 26పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు.
 తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
జార్ఖండ్‌లో 29న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి నేతగా ఎన్నికైన హేమంత్‌ సోరెన్‌ను రాష్ట్ర గవర్నర్‌ ద్రౌపదీ ముర్ము ఆహ్వానించారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 95వ జయంతి సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ లక్నోలో 25 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని ఆవిష్కరణ సందర్భంగా ఈ వాఖ్యలు చేసారు.
జులై - సెప్టెంబర్‌ (క్యూ3) మధ్య కాలంలో ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో 23 శాతం వృద్ధి నమోదై సింగపూర్, హాంగ్‌కాంగ్‌లను దాటేశాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ఆసియా పసిఫిక్‌ క్యూ3-2019 ఆఫీస్‌ రెంటల్‌ ఇండెక్స్‌ నివేదిక తెలిపింది.
అంతర్యుద్ధంతో సతమతమైపోతున్న ఆఫ్రికా దేశాల్లో శాంతి స్థాపన జరగాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆకాంక్షించారు. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పోప్‌ వాటికన్‌ నగరం నుంచి తన సందేశాన్నిచ్చారు.

School Assembly 26th December Information, School Assembly, prayer songs, Assembly information, historical events, information of the day, news of the day, golden words, today golden words, moral sentences, today's importance, headlines in the news, December month school assembly day wise, December 2019 school assembly, December 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజునేటి అంశముమంచి మాట / పద్యంవార్తలలోని ముఖ్యాంశాలు, 26th December 2019 assembly, 26th December 2019 assembly,news of the day history,news of the day highlights, 26th dec 2019 assembly, dec 26th assembly, dec 26th historical events, 26th December 2019 assembly, december 26th assembly, december 26th historical events,school related today assembly,school related today news, school related december 26th information, school related december month information
Previous
Next Post »
0 Komentar

Google Tags