Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

U-DISE SCHOOL PARTICULARS FILLING INSTRUCTIONS

U-DISE SCHOOL PARTICULARS FILLING INSTRUCTIONS


A. School Profile-Part-A.
ఈ విభాగము నందు పాఠశాలకు సంబంధించిన ప్రాధమిక సమాచారము అనగా పాఠశాల పేరు, చిరునామా, మండలము,అసెంబ్లీ నియోజక వర్గము, పార్లమెంటు నియోజక వర్గము, ప్రధానోపాధ్యాయుని సెల్ నెంబర్ మరియు ప్రధమ సహాయకుని సెల్ నెంబర్, పాఠశాలలోని అతి చిన్న తరగతి, అతి పెద్ద తరగతి,ఒక్కొక్క తరగతి సెక్షన్ల సంఖ్య , పాఠశాలలో గల మీడియం వివరములు మొదలైనవి నమోదు చేయాలి.


A1School Profile - Part-B
ఈ విభాగము ప్రాధమిక మరియు ప్రాధమికోన్నత పాఠశాలలకు మాత్రమే అందుబాటులో ఉండును.దీని యందు పాఠశాలకు అనుబంధముగా గల ప్రీ ప్రైమరీ పాఠశాల లేక పాఠశాల ఆవరణ లో గల అంగన్ వాడి సెంటర్ సంబంధించిన విద్యార్థుల వివరములు, ఉద్యోగుల వివరములు నమోదు చేయాలి.
A2 SMC/SMDC(RTE)
ఈ విభాగము నందు పాఠశాల యొక్క పనిదినముల సంఖ్య, రోజు సగటు పని గంటల సంఖ్య (విద్యార్థులు, ఉపాధ్యాయులు), సి.సి.యి అమలు, పాఠశాల యాజమాన్య కమిటీ వివరాలు, పాఠశాల యాజమాన్య మరియు అభివృద్ధి కమిటీ వివరాలు, మరియు పాఠశాల యాజమాన్య కమిటీ బ్యాంక్ ఎకౌంటు వివరములు,ఉచిత పాఠ్య పుస్తకముల వివరములు మొదలైనవి నమోదు చేయవలెను.
B(1) infrastructural details
ఈ విభాగము నందు పాఠశాల యొక్క భౌతిక వసతులైన తరగతి గదులు, ప్రహరీ గోడ, మరుగు దొడ్లు, మంచినీటి వసతి, తరగతి గడులలో ఉన్న డెస్కు , ఉపాధ్యాయుల కుర్చీల వివరములు, విద్యుత్ శక్తి, గ్రంధాలయము,ఆట స్థలము, కంప్యుటర్, CAL లాబ్, స్మార్ట్ క్లాస్,ఇంటర్ నెట్, సైన్సు కిట్,గణిత కిట్,బయోమెట్రిక్ వివరములు నమోదు చేయవలెను.
1. పాఠశాల భవన స్థితి
ఇందులో పాఠశాల భవనం సొంత భావనమా లేక అద్దెకు వాడుతున్నారా , మొత్తము ఎన్ని తరగతి గదులు ఉన్నాయి, అందులో ఎన్ని తరగతి గదులు పూర్తి స్థాయి లో వాడుతున్నారు, ఎన్ని తరగతి గదులు కట్టడము స్థాయి లో ఉన్నాయి (under Construction), తరగతి గదుల స్థితి అనగా మైనర్ రిపేర్ ఎన్ని, మేజర్ రిపేర్ ఎన్ని, పడిపోవడానికి సిద్దముగా (Dilapidated Construction) ఉన్నగదులు ఎన్ని ఉన్నాయి వంటి వివరములు నమోదు చేయాలి.
2. Toilets and Urinals details
మరుగు దొడ్లు మరియు అందలి యూరినల్స్ వివరములు నమోదు చేయాలి 3. త్రాగునీటి సౌకర్యం వివరాలు:
త్రాగు నీరు సౌలహ్యం ఏ విధంగా పాఠశాలకు అందుతుంది మరియు త్రాగునీరు శుద్ధి యంత్రాలు అందుబాటు లో ఉన్నాయా లేదా? వంటి వివరాలు నమోదు చేయాలి.


U-DISE SCHOOL PARTICULARS FILLING INSTRUCTIONS,U-DISE SCHOOL PARTICULARS FILLING INSTRUCTIONS IN TELUGU,U-DISE SCHOOL FILLING INSTRUCTIONS,FILLING INSTRUCTIONS FOR U-DISE SCHOOL PARTICULARS,u dise school registration,u dise school directory,u dise school information,udise school directory,udise school data,private school udise data entry,school education u dise,udise login for school,school udise format,udise codes of schools in ap,udise registration of school
Previous
Next Post »
0 Komentar

Google Tags